Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, February 28, 2014

షిరిడీ సాయిబాబావారి అనుగ్రహాన్ని పొందడమేలా?

0 comments Posted by tyagaraju on 4:47 AM
                                            
                            
28.02.2014 శుక్రవారము (విజయవాడనుండి) 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మీకు శ్రీవిష్ణుసహస్రనామం, శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేస్తున్నాను.  ఎప్పటికప్పుడు మన బ్లాగులో ప్రచురణకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని యాత్రలు చేయడంవల్ల మరి యితరకారణాల వల్ల ఆలశ్యమవుతూ ఉంది.  అన్యధా భావించవద్దు.  కెనడానుండి శ్రీనగిశెట్టి రమేష్ కుమార్ గారు ఈ విషయాలన్నిటినీ తెలియచేస్తున్నారు.  ఇక చదవండి.   

డీ వీ డీ వల్ల ప్రయోజనాలు

షిరిడీ సాయిబాబావారి అనుగ్రహాన్ని పొందడమేలా?

ప్రతీ రోజు మీరు మీ యింటిలో షిరిడీసాయిబాబా వారి హారతులు, కాకడ హారతి, మధ్యాహ్న్న హారతి, ధూప్ హారతి, శేజ్ హారతి అన్నీ డీ.వీ.డీ లో వినవచ్చును.

సాయి భక్తులందరి కోసం బాబా హారతులన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు, డీ.వీ.డీ లను ఉచితంగా పంచడానికి అనుమతినిచ్చిన శ్రీ కె.వీ.పీ.రమణి, షిరిడీ సాయి ట్రస్ట్ చెన్నై గారికి ధన్యవాదాలు.  డీ.వీ.డీ లో శ్రీ సాయి సత్ చరిత్రను కూడా వినవచ్చు.  మొత్తం అన్ని అధ్యాయాలు వినడానికి 6 గంటల సమయం పడుతుంది.  తెలుగులో శ్రీసాయి సత్ చరిత్ర, చాలీసాలను కూడా భక్తుల సౌకర్యం కోసం డీ.వీ.డీ లలో చేర్చడానికి అనుమతినిచ్చినందుకు శ్రీ కె.రాజేంద్రప్రసాద్, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు. 

Tuesday, February 18, 2014

బందిపోటు దొంగలనుండి రక్షించిన బాబా

0 comments Posted by tyagaraju on 12:32 AM
            
        
18.02.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి లీల ద్వైమాసపత్రిక మే-జూన్ 2013 సంచికనుండి గ్రహింపబడినది.

బందిపోటు దొంగలనుండి రక్షించిన బాబా

అది 1997వ.సంవత్సరం అక్టోబరు 16వ.తేదీ.  ఆరోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చినపుడెల్లా నాకు భయంతో యిప్పటికీ వళ్ళు జలదరిస్తుంది.

ఆరోజున నాకు సాయిబాబా ఒక గొప్ప అనుభూతినిచ్చారు.  ఆయన ఆరోజున నాకు చూపించిన అగోచరమైన అనంతమైన లీలను వర్ణించడానికి నాకు మాటలు చాలవు.  అదే ఆయన యొక్క అనంత శక్తి.

నేను, శ్రీవిజయ్ కార్కర్ యిద్దరం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యిండియాలో ఆడిటర్స్ గా పనిచేస్తున్నాము.  ఆరోజున మేము వార్ధా బ్రాంచ్ లో ఆడిట్ చేస్తున్నాము.  ఆడిట్ పూర్తయేముందు బ్రాంచ్ మానేజర్ తో అన్ని విషయాలను చర్చించి తుది రిపోర్టును తయారు చేయాలి.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago