Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, April 13, 2016

శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:12 AM
Image result for images of saibanisa
       Image result for images of rose garden

13.04.2016  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావాఅరి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన జీవిత సందేశాలనుండి కొన్ని సందేశాలు తెలుసుకుందాము.
         Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్


31.07.2001

11) మన ఇంటిలో ఈగల బాధ ఉన్నట్లే, అదే విధంగా  ప్రాపంచిక జీవితంలోను, ఆధ్యాత్మిక జీవితంలోను అసూయాపరుల నుండి బాధలు ఉంటాయి.  అవి క్షణికమయినవి.  ఆ బాధలను మనం ఓరిమితో భరిస్తూ జీవిత పాఠాలు నేర్చుకోవాలి.

Tuesday, April 12, 2016

శ్రీ సాయి లీలామృత ధార - శ్రీ షిరిడీ సాయి విభూతి లీల

0 comments Posted by tyagaraju on 9:16 AM
Image result for images of shirdi sai smiling face
Image result for images of rose yellow

12.04.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్న అనగా 11.04.2016 నాడు “ఆ స్వరం ఎవరిది?” ప్రచురించాను.  అది చదివిన తరువాత శ్రీమతి కృష్ణవేణిగారికి తమ చిన్నప్పటి అనుభవమ్ గుర్తుకు వచ్చిందని చెప్పారు.  దానిని కూడా ఇప్పుడే ప్రచురిస్తేబాగుంటుందని ప్రచురిస్తున్నాను.
“ నా చిన్నప్పటినుండి నేను బాబా భజనలకు వెడుతూ ఉండేదానిని. నాకప్పుడు 14  సంవత్సరాలు.  పదవ తరగతి చదువుతున్నాను. ఆ సంవత్సరంలో డిసెంబరు 31 వ.తారీకున ఒంగోలులో అమ్ముల సాంబశివరావుగారి ఆశ్రమంలో 12 గంటలపాటు అఖండ సాయినామ సంకీర్తన జరుగుతూ ఉంది.  ప్రతి సంవత్సరం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది.  సరిగా 12 గంటలకు బాబా కు అందరూ ఆరతి ఇచ్చి “హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పారు.  అప్పుడు ఆరతి అయిన తరువాత  మాలో కొంతమందికి ఫొటో నుండి “శుభా కాంక్షలు” అని చెపుతున్నట్లుగా వినిపించింది. ఒకావిడ ఎవరో శుభాకాంక్షలు చెప్పారు ఎవరు? అనగానే ఇద్దరు ముగ్గురు మాకు కూడా వినిపించింది అన్నారు.  “శుభాకాంక్షలు” ఆ మాటలు నేను కూడా విన్నాను.

శ్రీ సాయి లీలామృత ధార
శ్రీ షిరిడీ సాయి విభూతి లీల
బాబా గారు చేసే వైద్యం చాలా విచిత్రంగా ఉంటుందని శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్న మనకందరికీ తెలుసు. ఉదాహరణకి 13 వ.అధ్యాయంలో భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని చాలా విచిత్రంగా నయం చేశారు.  అతను షిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవాలనిచ్చి, రోగాన్ని కుదిర్చారు.  మొదటి స్వప్నంలో అతను ఒక పాఠశాల విద్యార్ధిగా పద్యాలని కంఠోపాఠము చేయకపోవటం చేత, బాబా క్లాసు ఉపాధ్యాయునిగా   దెబ్బలు కొట్టినట్లు కనిపించారు.   రెండవ స్వప్నంలో ఒక గృహస్థునిగా కనిపించి అతని చాతీపై పెద్ద బండను వేసి క్రిందకు మీదకు తోయడం వల్ల మిక్కిలి బాధననుభవించాడు.  స్వప్నంలో పడిన ఈ బాధలతో అతని జబ్బు నయమైంది.  ఈ రోజు మీరు చదవబోయే ఈ అద్భుతమైన లీలలో బాబా ఏవిధంగా వైద్యం చేశారో చూడండి.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago