08.03.2021 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 50 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – మంగళవారం – అక్టోబరు, 22, 1985
ఈ రోజు జరిగిన సంభాషణ వివరాలు…
షిరిడీలో అబ్దుల్ బాబా సమాధివద్ద ఉదయం గం. 7.30 ని.
శ్రీ బాలదేవ్ గ్రిమేతో జరిపిన సంభాషణ – ఆయన అబ్దుల్ బాబా సమాధి వ్యవహారాలను చూసే పర్యవేక్షకుడినుండి అబ్దుల్ బాబా గురించి చెప్పిన వివరాలు---
బాలదేవ్ గ్రిమే చెబుతున్న వివరాలు.
అబ్దుల్ బాబా సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతనికి వివాహమయింది. వివాహమయిన తరువాత అతని భార్య ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. కాని కొడుకు జన్మించడానికి ముందే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అన్ని పుణ్యక్షేత్రాలను, భారతదేశంలోని అన్ని ప్రదేశాలను దర్శించుకుంటూ ప్రయాణించాడు. సాయిబాబా వద్దకు వెళ్ళమని తాజుద్దీన్ బాబా అతనికి ఆదేశించారు. సాయిబాబాకు శిష్యుడిగా ఉండమని అబ్దుల్ బాబాకు, తాజుద్దీన్ బాబా మాత్రమే చెప్పారు.








