08.03.2021 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 50 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – మంగళవారం – అక్టోబరు, 22, 1985
ఈ రోజు జరిగిన సంభాషణ వివరాలు…
షిరిడీలో అబ్దుల్ బాబా సమాధివద్ద ఉదయం గం. 7.30 ని.
శ్రీ బాలదేవ్ గ్రిమేతో జరిపిన సంభాషణ – ఆయన అబ్దుల్ బాబా సమాధి వ్యవహారాలను చూసే పర్యవేక్షకుడినుండి అబ్దుల్ బాబా గురించి చెప్పిన వివరాలు---
బాలదేవ్ గ్రిమే చెబుతున్న వివరాలు.
అబ్దుల్ బాబా సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతనికి వివాహమయింది. వివాహమయిన తరువాత అతని భార్య ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. కాని కొడుకు జన్మించడానికి ముందే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అన్ని పుణ్యక్షేత్రాలను, భారతదేశంలోని అన్ని ప్రదేశాలను దర్శించుకుంటూ ప్రయాణించాడు. సాయిబాబా వద్దకు వెళ్ళమని తాజుద్దీన్ బాబా అతనికి ఆదేశించారు. సాయిబాబాకు శిష్యుడిగా ఉండమని అబ్దుల్ బాబాకు, తాజుద్దీన్ బాబా మాత్రమే చెప్పారు.
ఆయన
సర్వశక్తిమంతుడు
అని తాజుద్దీన్ బాబా అతనితో చెప్పారు.
“ఆయన
అల్లా” - అబ్దుల్
బాబా చివరివరకు సాయిబాబాతోనే ఉన్నాడు.
అబ్దుల్
బాబా జీవితం గురించి తెలుసుకోవాలంటే మీరు చదివి తెలుసుకోవడానికి ఎన్నో పుస్తకాలున్నాయి.
అందులో
ఎన్నో వివరాలు మీకు తెలుస్తాయి.
అవన్నీ
కూడా తగినన్ని వాస్తవాలతోనే రాయడం జరిగింది.
అబ్దుల్
బాబా ఏప్రిల్, 2, 1954, లో సమాధి చెందారు.
ప్రశ్న
--- అబ్దుల్ బాబా మొట్టమొదటిసారిగా షిరిడీ వచ్చినపుడు సాయిబాబాతో
అతనికి
కలిగిన మొట్టమొదటి అనుభవం ఏమిటి?
జవాబు
--- అబ్దుల్ బాబా సుమారు 30 సంవత్సరాలు సాయిబాబాకు పూర్తిగా సర్వశ్యశరణాగతి చేసుకున్నాడు.
సాయిబాబా
జీవించి ఉన్న రోజులలో 1918వ.సం. వరకు అబ్దుల్ బాబా 30 సంవత్సరాలపాటు సాయిబాబా పాదాల వద్ద సేవ చేసుకున్నాడు.
ప్రశ్న
--- అయితే ఆయన చనిపోయేనాటికి చాలా వృధ్ధుడా?
జవాబు
--- అవును.
చనిపోయేనాటికి ఆయన
చాలా వృధ్ధుడు.
అనగా
సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత కూడా 1954 వ.సం వరకు ఆయన పూర్తిగా సాయిబాబావారికే అంకితమయ్యారు.
ప్రశ్న
--- ఆయన ఇక్కడే నివశించారా?
జవాబు
--- అవును.
ఇక్కడే
ఉండిపోయారు.
ప్రశ్న
--- ఆయన చనిపోగానే సమాధిని నిర్మించారా?
జవాబు
--- అవును.
ఆయన
చనిపోయిన వెంటనే సమాధిని నిర్మించారు.
దానికయే
ఖర్చులన్నీ పార్శీ వనిత అయిన భరూచా, మరియు అప్పాసాహెబ్ బొరావకే అని పిలువబడే తుకారామ్ రఘుజీవ్ బొరావకే గార్లు భరించారు.
ఇక్కడ
షిరిడిలోనే అప్పా సాహెబ్ బొరావకే గారు నివసిస్తున్నారు.
మీరు
ఇక్కడ షిరిడిలో నివసించే ప్రజలని ఎవరిని అడిగినా ఆయన గురించి చెబుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను.
అప్పా
స్వయంగా తనే ముఖ్యంగా సమాధియొక్క పై భాగాన్ని నిర్మించడానికి ఎంతో ధనం ఖర్చుపెట్టారు.
ప్రశ్న
--- ఇక్కడ నివసిస్తున్న ముస్లిమ్స్ కి గాని, లేక ఇక్కడికి వచ్చేవారికి గాని అబ్దుల్ బాబా ఒక మార్గదర్శకునిగా లేక నాయకుడిగా ఉండేవారా?
జవాబు
--- అబ్దుల్ బాబా, సాయిబాబా సమక్షంలో ఖురాన్ చదివేవాడు.
కాని
ముస్లిమ్స్ మాత్రమే ఆయనను అనుసరించేవారని ఎవరూ చెప్పలేరు.
ఉదాహరణకి
అప్పా ముస్లిమ్ కాదు.
అప్పా
హిందువు. కాని
అబ్దుల్ బాబాకి కూడా అనుచరునిగా ఉండేవారు.
ప్రశ్న
--- అయితే అబ్దుల్ బాబా సాయిబాబాకు అత్యంత సన్నిహితుడయిన భక్తుడని మనం బావించవచ్చా?
జవాబు
--- ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఆయన
సాయిబాబాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
ప్రశ్న
--- ఆయన పూర్తిగా ఆయనకు అంకితమయిపోయారా?
జవాబు
--- అవును.
సాయిబాబాకు
పూర్తిగా అంకితమయిపోయిన వ్యక్తి.
నేను --- (ఆంటోనియో) --- మీరు
చెప్పిన వివరాలకి ధన్యవాదాలు.
(ఇంకా ఉన్నాయి బాలాజీ పిలాజీ గురవ్ తో రెండవ సంభాషణ వివరాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment