09.03.2021 మంగళ వారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 51 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – మంగళవారం – అక్టోబరు, 22, 1985
1912
వ.సం.నుండి షిరిడిలోనే నివాసం ఏర్పరచుకుని ఉంటున్న శ్రీ బాలాజీ పిలాజీ గురవ్ తో రెండవసారి జరిపిన సంభాషణ…
ప్రశ్న
--- సాయిబాబా వారు జీవించి ఉన్న రోజులలో ఆయన గురించి తెలిసిన మిగతా భక్తులు ఎవరయినా మీకు తెలుసా?
జవాబు
--- కొంతమంది ఉన్నారు గాని, వారు ఇటివలే మరణించారు.
ప్రశ్న
--- వారి పేర్లు ఏమయినా మీకు గుర్తున్నాయా?
జవాబు
--- ఒకాయన నివార్కి బాబా, మరొకాయన రాస్నే… రాస్నే గారు మూడు నెలల క్రితమే మరణించారు.
(దత్తాత్రేయ దామోదర్ రాస్నే అనబడే నానాసాహెబ్ రాస్నే… దామోదరు (అన్నా) సావర్ రామ్ రాసనే కుమారుడు)
ప్రశ్న
--- ఆయన చాలా వృధ్ధులా?
జవాబు
--- అవును.
చాలా
వృధ్ధులు… 85 లేక 87 సంవత్సరాలు ఉండవచ్చు.
రాస్నే
కాకా గారిని నేను స్వయంగా చూసాను.
(దత్తాత్రేయ
దామోదర్ రాస్నే మామయ్య).
ప్రశ్న
--- ఇంకెవరయినా జీవించి
ఉన్నవారున్నారా?
జవాబు
--- ఇంకెవరూ లేరు.
ప్రశ్న
--- సాయిబాబా గురించి ఏమయిన ఆసక్తికరమయిన విషయం చెబుతారా?
ఇంతకుముందు
మీరు చెప్పని
విషయం గుర్తుకు తెచ్చుకుని చెప్పండి.
నేనేమీ
మిమ్మల్ని ప్రత్యేకించి అడగటంలేదు.
సాయిబాబా
గురించి మీరు నిరభ్యంతరంగా చెప్పవచ్చు.
జవాబు
--- ఒకసారి నంది గ్రామస్థులు గజానన్ మహరాజ్ గారిని దర్శించుకోవదానికి షేన్ గావ్ వెళ్ళారు.
గజానన్
మహరాజ్ వారికి
ఒక కొబ్బరికాయను ఇచ్చి, సాయిబాబాకు ఇమ్మని చెప్పారు.
“షిరిడీలో
నా సోదరుడు ఉన్నారు.
ఈ
కొబ్బరికాయను
ఆయనకు ఇవ్వండి” అన్నారు.
వారంతా
షిరిడీకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఒక గ్రామస్థుడు కొబ్బరికాయను పగలకొట్టి కొబ్బరి తిన్నాడు.
వారు
షిరిడీ చేరుకుని సాయిబాబాను దర్శించుకోగానే వారేమీ మాట్లాడకముందే సాయిబాబా వారితో “నా సోదరుడు నాకు పంపించిన కొబ్బరికాయ ఏది?” అని అడిగారు.
బాబా
ఆవిధంగా అడిగిన వెంటనే ఆగ్రామస్థులకు తాము చేసిన పొరబాటు తెలిసివచ్చింది.
బాబా
వారిమీద ఆగ్రహించారు.
“నాసోదరుడు
పంపించిన కొబ్బరికాయ ఏది?” అని బాబా అడిగిన వెంటనే ఆ యాత్రికులు వెంటనే గ్రామంలో ఉన్న దుకాణంలో కొబ్బరికాయని కొని తేవడానికి బయలుదేరబోయారు.
కాని
బాబా తన సోదరుడు
పంపించిన కొబ్బరికాయకు మరొకటి సాటిరాదు” అన్నారు.
ఆతరువాత
బాబా మౌనంగా ఉండిపోయారు. ఆవిధంగా
బాబా గజానన్ మహరాజ్ గారు పంపించిన
కొబ్బరికాయ యొక్క పూర్వవృత్తాంతాన్నంతా చెప్పడంవల్ల బాబా అంతర్జ్ఞాని అన్న విషయానికి ఇదే ఋజువు అని మనకు తెలుస్తుంది.
ప్రశ్న
--- అయితే ఆయన మరొక కొబ్బరికాయను స్వీకరించలేదా?
తుకారామ్
--- లేదు తీసుకోలేదు.
ప్రశ్న
--- బాబా మిమ్మల్ని ఎప్పుడయినా దక్షిణ ఇమ్మని అడిగారా?
జవాబు --- బాబా నాకు ఇచ్చేవారు.
పిలాజీ
గురవ్ దక్షిణ ఇచ్చేవారు.
ప్రశ్న
--- ఆహా!
సాయిబాబా
మీకు డబ్బు ఇచ్చేవారా?
తుకారామ్
--- అవును.
బాబా
స్వయంగా ఆయనకు డబ్బు ఇచ్చేవారు.
బాలాజీ పిలాజీ
---
బాబా నాకు ప్రతిరోజు రెండు అణాలు ఇస్తూ ఉండేవారు.
తుకారాం --- బాబా ఎంతోమందికి డబ్బు ఇచ్చేవారు.
రెండు
అణాలు, నాలుగణాలు, పదిహేను రూపాయలు, ఇరవై రూపాయలు….
బాలాజీ పిలాజీ (బాబా ఇచ్చిన కొన్ని నాణాలను తను గుర్తుగా దాచుకున్నవి చూపించారు)
నా అవసరాల కోసం నేను అన్ని నాణాలనూ ఖర్చు చేసేసాను.
ఇవే
నాదగ్గర మిగిలి ఉన్నాయి.
ప్రశ్న
--- బాబా ఎవరిమీదనయిన కోపగించడం చూశారా మీరు?
జవాబు
--- బాబా
కోపగిస్తూ ఉండేవారు.
ఎవరయినా తప్పు చేస్తే వారిని శిక్షించేవారు.
ప్రశ్న
--- ఈవిధంగా మాటిమాటికి జరిగేదా?
జవాబు --- మాటిమాటికి కాదు గాని, అప్పుడప్పుడు.
ప్రశ్న
--- ఉపాసనీ మహరాజ్ గారి గురించి ఏమయినా చెబుతారా?
ఆయనతో
మాట్లాడె సందర్భం మీకెప్పుడయినా కలిగిందా?
జవాబు
--- 1912 వ.సం.లో నేను మాకుటుంబంతో షిరిడీలో నివాసం ఏర్పరచుకోవడానికి వచ్చినపుడు అదే సంవత్సరంలో ఉపాసనీ మహరాజ్ కూడా షిరిడికి వచ్చారు.
1912వ.సంవత్సరంలో.
ప్రశ్న
--- అప్పుడు
ఏమి
జరిగింది?
జవాబు
--- ఉపాసనీ మహరాజ్ కూడా శ్యామాలాగ, నాలాగా ఇంకా మరికొందరిలాగానే బాబా భక్తులు.
కాకా
సాహెబ్ దీక్షిత్ షిరిడి వచ్చే యాత్రికులకి గ్రామంలోనే మొదటి మూడు రోజులు ఉచితంగా భోజనాలు పెట్టేవాడు.
మూడు
రోజులుకు మించి పెట్టేవాడు కాదు.
ఉపాసనీ
మహరాజ్ ఇక్కడ ఆరునెలలపాటు బాబాతోనే ఉన్నారు.
అందుచేత
ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ భోజన కార్యక్రమ వ్యవహారాలను శ్యామాని చూసుకోమని అప్పగించాడు.
ప్రశ్న
--- యాత్రికులకు భోజనాలను పెట్టె వ్యవహారాలను శ్యామా నిర్ణయించేవాడా?
జవాబు
--- ఆయన పర్యవేక్షకుడిలా వ్యవహరించేవాడు.
బాలాజీ పిలాజీ …..
ఈ పద్ధతి మంచిది కాదని కాకాసాహెబ్ దీక్షిత్ ఉపాసనీ మహరాజ్ తో అన్నాడు.
“మీరు ఇప్పటికి ఆరునెలలుగా ఇక్కడే ఉంటున్నారు.
మీరు
ఇక్కడినుండి
వెళ్ళిపోతే మంచిది” అని చెప్పాడు.
ప్రశ్న
--- ఆయనకు భోజనం పెట్టినందుకు అసలు ఎప్పుడూ డబ్బు చెల్లించకుండా ఆరునెలలపాటు
షిరిడీలోనే ఉండిపోయారా?
తుకారామ్
--- అవును.
ఆరోజుల్లో
కాకా సాహెబ్ దీక్షిత్ ఈ సేవ చేసేవాడు.
భక్తులందరికీ
భోజనాలు పెట్టేవాడు.
బాలాజి పిలాజీ
….
అపుడు ఉపాసనీ మహరాజ్ బాబా దగ్గరకు వెళ్ళి, “బాబా! ఈవిధంగా జరిగింది.
వారు
నాకింక భోజనం పెట్టము అని చెప్పారు.
ఇపుడు
నేనేమి చేయాలి?” అని విన్నవించుకున్నారు.
అపుడు
బాబా ఆతనతో దీని గురించి చింతించకు.
సహనంతో
ఉండు” అన్నారు.
ఆరోజునుండి
బాబా ఉపాసనీ మహరాజ్ ను ఖండోబా దేవాలయానికి పంపించి అక్కడే ఉండమని చెప్పారు.
బాబా
ఆయనతో “రెండు మూడు సంవత్సరాలలో నువ్వు కూడా నాఅంతవాడివవుతావు”
అని అన్నారు.
ఆవిధంగా
సాయిబాబా ఉపాసనీ మహరాజ్ కు చెప్పారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment