Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, January 3, 2012

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 6:56 PM

04.01.2012 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1993 23 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1993

నిన్నటిరోజున కుటుంబ సభ్యులతో నేను ధన సంపాదన, ధనము ఖర్చు విషయాలలో గొడవలు పడినాను. నేను అందరి కోరికలు తీర్చిన వారు సంతోషముగా లేరు. నేను జీవితములో సంపాదించిన ధనము కుటుంబ సభ్యుల బాధ్యతలు పూర్తిచేయటానికే ఖర్చు చేసినాను. అయినా యింకా డబ్బు కావాలని వారు కోరడములో నా మనసుకు చికాకు కలిగించినది. ఈ చికాకులను మనసునుండి తొలగించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నా మనసుకు శాంతి కలిగించినది. అది ఒక పోలీసు స్టేషన్. పోలీసు వాడు దారినిపోయే ఓ అమాయకుడిని తెచ్చి పోలీసు స్టేషన్ లో కూర్చుండబెట్టి అతన్ని లాఠీతో కొడుతు అతని దగ్గరనుండి డబ్బు గుంజుతున్నాడు. అదే పోలీసు కానిస్టేబుల్ కొంచము సేపు తర్వాత పోలీసు ఇన్స్పెక్టర్ వేషములో వచ్చి ఆ అమాయకుడిని కొడుతు డబ్బు గుంజుతున్నాడు. ఆ పోలీసు కానిస్టేబుల్ ఆ విధముగా వేషాలు మార్చుతు ఆ అమాయకుడిని బాధించుతు డబ్బు గుంజుతున్న సమయములో ఒకసారి సరిగా వేషము మార్చలేకపోవటము ఆ అమాయకుడు గుర్తించినాడు. ఆ అమాయకుడు తనకు జరుగుతున్న మోసమును గుర్తించి ఆ పోలీసు కానిస్టేబుల్ మీద తిరగబడినాడు. ఆ సమయములో పోలీసు స్టేషన్ బయట ఉన్న ప్రజలు ఈ సంఘటనకు విరగబడి నవ్వుతారు. నేను కూడ ఈ సంఘటన చూసి నవ్వుతాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి ఈ విధమైన దృశ్యము ద్వారా నా కన్నులు తెరిపించి ఎవరైన అనవసరముగా నిన్ను మోసము చేస్తు నీనుండి ధనము గుంజుతుంటే ధైర్యముగా తిరగబడటము మంచిది అనే భావము కలిగించినారు.

05.12.1993 నిన్నటిరోజున యితరులకు ఏవిధముగా సహాయము చేయాలి. సహాయము చేసిన తర్వాత ఎవరినుండి ఏమి కోరాలి అనే ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపించిన దృశ్యము నన్ను చాలా ఆశ్చర్యములో ముంచి వేసినది. "అది చక్కటి పచ్చని పొలము. ఆ పొలములో రైతులు నాగలితో దున్నటములేదు. కాని మంచి పంటలు పండుతున్నాయి.

యింత మంచి పంటలు పండటానికి కారణము ఏమిటి అని ఆలోచించుతు ఆ పొలములో కాలు పెట్టినాను. ఆ పొలములో వానపాములు చక్కగా బ్రతుకుతు ఆ పొలము యజమానికి అంటే రైతుకు చాలా సహాయము చేస్తున్నాయి.

శ్రీ సాయి యిచ్చిన సందేశము "నీవు భూమిలో వానపాములాగ బ్రతుకుతు రైతుకు మంచి పంటపండించటానికి సహాయము పడాలి" అన్నారు శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో.

06.12.1993 నిన్నటిరాత్రి శ్రీ సాయికి నమస్కరించి నా ఆధ్యాత్మిక రంగానికి మంచి సలహా యివ్వమని కోరి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాగత జీవితమునకు సంబంధించినవి. వాటి గురించి చాల సేపు ఆలోచించి తిరిగి నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో వచ్చి నా చేతికి ఒక కత్తిని యిచ్చి గుఱ్ఱము ఎక్కి ఆఖరి పవిత్ర యుధ్ధము చేయమని ఆదేశించుతారు. నాలాగనే కొంతమంది కవచము ధరించి, కత్తి చేత బట్టుకొని, గుఱ్ఱము ఎక్కి యుధ్ధము చేస్తున్నారు. నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఈ దృశ్యమునకు నేను గ్రహించిన అర్ధము. యింక జీవితములో సంసారబంధాలు, స్నేహ బంధాలు విడనాడి భక్తి అనే కత్తిని చేత పట్టుకొని, భగవంతుని అనుగ్రహము అనె గుఱ్ఱము ఎక్కి పవిత్ర ఆధ్యాత్మిక యుధ్ధము చేయాలి.

08.12.1993

నిన్నటిరోజు అంత మనసులో చాల చికాకులు కలిగినవి. నా బంధువులతో ఏవిధముగా మసలుకోవాలి ముందు జాత్రత్తగా సలహాలు యివ్వమని శ్రీ సాయిని కోరినాను. శ్రీ సాయి రాత్రి కలలో ఓ అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. నీ జీవితానికి ఆగస్టు 15 పండగ జరిగినది. యింక నీ బంధువులు గురించి ఎక్కువగా ఆలోచించకు. వారితో ఎక్కువగా మాట్లాడకు. విశాఖపట్నము వెళ్ళి నీపని చేసుకొని వెంటనే తిరిగిరా. నాకు మెలుకువ వచ్చినది. శ్రీ సాయికి నమస్కరించినాను.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Monday, January 2, 2012

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 4:51 PM








03.01.2012 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1993 22 వ.భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1993


ఇందులో సాయి.బా.ని.స. గారు కలలో బాబా మీద ఖవ్వాలి పాటను వింటున్నట్లుగా చెప్పారు. దానిమీద బాబాఖవ్వాలి పాట లింకును కూడా మీకు అందిస్తున్నాను. ఆకలకు తగినట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇవ్వడం జరిగింది. సునో అనే మాటతో ఉన్న ఖవాలి కోసం గూగుల్ లో వెతికాను, సునో అనే మాటతో పాట ఉందిగాని, అది ఖవ్వాలీ కాదు, పైగా అది కూడా ఉషారుగా పాడుతున్నట్లుగా లేకపోవడంవల్ల దాని లింక్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఖవ్వాలీ కూడా విని ఆనందించండి. లింక్ తీసి చొపీ చేసి మరొక విండోలో ఓపెన్ చేసి చూడండి.


సాయి.బా.ని.స. డైరీ - 1993

21.11.1993

నిన్నటిరోజున కుటుంబ సభ్యులతో గొడవలు మనసుకు చాలా చికాకు కలిగించినది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా మనసుకు ప్రశాంతత కలిగించమని వేడుకొన్నాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము నా మనసులోని చికాకులు తొలగించినది.

అది ఒక బీదల బస్తి. అక్కడ హిందువులు ముస్లిములు కలసి కవ్వాలి పాడుతున్నారు. ఆ కవ్వాలి పాటలో శ్రీ సాయిబాబా లీలలు పాడుతున్నారు సాయి భక్తులు. ఆ పాటలు వింటూ ఉంటే మనసుకు ప్రశాంతత కలిగినది. ఆ ముస్లిం భక్తుడు "సునో సాయిబాబా" అనే పాట పాడుతుంటే నాకు యింకొకసారి ఆపాట వినాలని అనిపించినది. ఆ పాట తిరిగి పాడమని కోరినాను. ఆ ముస్లిం భక్తుడు 10 రూపాయలు దక్షిణ కోరినాడు. నేను సంతోషముగా యిచ్చినాను. ఆ భక్తుడు కవ్వాలి పాడుతుంటే నేను తన్మయత్వము చెందినాను. ఆ పాటలు పాడటము పూర్తి అయిన తర్వాత ఆ యింటి యజమానురాలు బయటకు వచ్చి సాయిబాబాకు పూజ చేసిన తర్వాత నన్ను పిలిచి పంతులుగారు మీ పంచాంగము పెట్టుకోవటానికి ఈ సంచి ఉపయోగపడుతుంది అని బుజానికి వేసుకొనే సంచి దానము చేసినది. నేను సంతోషముగా స్వీకరించినాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఆ స్వప్నము గురించి ఆలోచించినాను. శ్రీ సాయి మాత (యింటి యజమానురాలు) నాకు జోలి ఇచ్చినది. అందులో పంచాంగము (కాలమును నిర్ణయించి పంచ అంగాలు) పెట్టుకోమని చెప్పినది. జరుగుతున్న కాలాన్ని శ్రీ సాయి యిచ్చిన జోలిలో వేయటము నా కర్తవ్యము అని నిర్ణయించుకొన్నాను. ఆ జోలినుండి శ్రీ సాయి యిచ్చే ఫలాలు స్వీకరించదలచినాను.

http://mmusicz.com/video/6XEHnr4JQtg/Sai_Baba_Qawwali.html

26.11.1993

నిన్నటిరోజున జీవితములో కుటుంబ సభ్యులకు నేను చాలా సహాయము చేసినాను అనే భావన . వారు ఎవరు నాపై విశ్వాసము చూపటములేదు అనే బాధతో, శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు కనువిప్పు కలిగించినవి. శ్రీ సాయి నా బంధువులకు నేను చేసిన సహాయము, నా మితృలకు నేను చేసిన సహాయము తిరిగి వారు నా వైపు కన్నెత్తి చూడకపోవటము చూపించి యిచ్చిన సందేశము నా మనసులో నిలిచిపోయినది. ఆ సందేశము వివరాలు :

జీవితము అనే పడవ ప్రయాణములో భార్య తెరచాపవంటిది. గాలి వాలు బాగా యున్నపుడు మాత్రమే ఆ తెరచాప ఎగరవేయాలి. లేకపోతే పడవ ప్రయాణానికి ఆ తెరచాప అడ్డుగా యండే ప్రమాదము ఉంది" "విశ్వాసము అనే పదానికి అర్థము లేదు. విశ్వాసము మాటలతో చెబితే చాలదు. విశ్వాసము చేతలలోఉండాలి".

30.11.1993

నిన్నటిరోజున బేగంపేటలో ఉన్న శివుని ఆలయానికి వెళ్ళినాను. అక్కడి పూజా వ్యవహారాలు నాకు నచ్చలేదు. శ్రీ సాయికి నమస్కరించి పూజా వ్యవహారాలుపై సందేశము ప్రసాదించమని కోరినాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము వివరాలు, సందేశము వివరాలు


(1) ధనవంతులు శివుని ఆలయానికి వచ్చి బాగా డబ్బు ఖర్చు చేసి పూజలు చేసుకొని యింటికి వెళ్ళేటప్పుడు శివుని గుడినుండి విభూతి తీసుకొని వెళ్ళుతున్నారు.

(2) కొందరు మధ్య తరగతి కుటుంబీకులు అప్పు చేసి శివాలయానికి వచ్చి గొప్పలకు పోతు పూజలు చేయించుకొని యింటికి వెళ్ళేటప్పుడు శివుని గుడినుండి విభూతి తీసుకొని వెళ్ళుతున్నారు.

(3) మరికొందరు తమ నిజస్థితిని గుర్తించి తమ దగ్గర ఉన్న ధనముతోనే మట్టితో శివుని లింగము చేసుకొని యింటిలోని పొయ్యిలోని బూడిదను విభూతిగా భావించి పూజ చేసుకొంటున్నారు.

ఈవిధమైన దృశ్యాలు చూపి శ్రీ సాయి యిచ్చిన సందేశము "భగవంతుని ఏ విధముగా పూజించిన పరవాలేదు కాని పూజ అనంతరము భగవంతుని అనుగ్రహము సంపాదించాలి అంతేగాని అప్పు యిచ్చినవాడి బాధను మాత్రము కాదు".

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    4 months ago