12.04.2017 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –20 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 944037541
పరదసింగ అవధూత అనసూయ మాత
1988
వ.సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున గోదావరి నదిలో స్నానాలు చేసి శారదాదేవిని దర్శించుకున్నాము. మధ్యాహ్నానికి కల్లూరు చేరుకొన్నాము. మేము శ్రీసాయినాధుని మందిరానికి చేరుకునేటప్పటికి
ఆరతి అవుతోంది. బాబాకు మా నమస్కారాలను అర్పించుకున్నాము.
(కల్లూర్ సాయి మందిరం)
నాభర్త దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళారు. అక్కడ ధుని వద్ద నాభర్త ధ్యానంలో కూర్చున్నారు. కొంతసేపటి తరువాత బాబా ఆయనకు భౌతికంగా దర్శనమిచ్చారు.
ఆయనను చూడగానే నాభర్తకు వళ్ళు పులకరించి ఎంతో సంతోషం కలిగింది. చెంపలమీదుగా కన్నీరు కారింది. మవునంగా మాటరాకుండా అలా చూస్తూ ఉండిపోయారు. అపుడు బాబా “నీకూడా వచ్చిన నీస్నేహితులని కూడా పిలు. వారు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను” అన్నారు. బాబా దర్శనం ఇచ్చారన్న విషయం నాభర్త తన స్నేహితులందరికీ చెప్పారు. అక్కడ దగ్గరలో ఉన్నవారు బాబా దర్శనం చేసుకున్నారు. వారంతా చాలా చాలా అదృష్టవంతులు. కాని మిగిలినవారు మాత్రం బాబాని చూడలేకపోయినా, బాబా ఇంకా అక్కడే ఉన్నారనే ప్రగాఢమయిన నమ్మకంతో ఆయనకు నమస్కరించుకున్నారు.

తరువాత
మహూర్ ఘడ్ వెళ్ళి అక్కడ దత్తాత్రేయస్వామిని దర్శించుకున్నాము.
అక్కడినుంచి నాగపూర్ వెళ్ళి శ్రీ తాజుద్దీన్ బాబా వారి సమాధిని దర్శించుకున్నాము. అక్కడినుంచి 60 మైళ్ళదూరంలో ఉన్న పరదసింగలో ఉంటున్న అనసూయమాతను దర్శించుకోవడానికి బయలుదేరాము. మేము ఆవిడ నివసిస్తున్న ప్రదేశానికి చేరుకుంటూ ఉండగానే ఆవిడ కొంత దూరం వచ్చి , మాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మారాక ఆవిడకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది. మేము వ్యానులోనుంచి క్రిందకు దిగబోతూండగా ఆవిడే మావ్యానులోకి ఎక్కి వ్యానును వెనక్కి తిప్పి ముందుకు పోనిమ్మన్నారు. అక్కడ ఉన్నవాళ్ళు అనసూయ మాతగారు మీరాకకోసం అరగంటనుంచి ఎదురు చూస్తూ ఉన్నారని, మిమ్మల్ని తీసుకునిరావడానికి కొంతదూరం నడుచుకుంటూ వచ్చారని చెప్పారు. వారు చెప్పిన మాటలు వినగానే మాకు చాలా అధ్భుతమనిపించింది.

ఆరోజు
రాత్రి మేము మాతా అనసూయదేవి గారితోనే ఉన్నాము.
తరువాత ఆవిడ మమ్మల్ని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు. ఆశ్రమాన్ని ఇంకా కడుతూ ఉన్నారు. అక్కడే ఆవిడ నాభర్త మీద ఒక గిన్నెనిండా ఉన్న పెరుగును
పోసి, నాలుగు జగ్గులతో నీటిని పోశారు. ఆవిధంగా
ఆవిడ నాభర్తని పవిత్రుడిని చేసారు. ఆవిడతో
ఉన్నంతసేపు మాకు ఆకలిదప్పులు తెలీలేదు. ఆరోజు
రాత్రి ఆశ్రమంలో వంటలు అవుతున్నపుడు, పొయ్యి మీద ఉన్న పాత్రలో మాతాదేవి స్వయంగా
తన చేతిని పెట్టి ఉడుకుతున్న పదార్ధాన్ని కలియత్రిప్పారు. ఆదృశ్యం మాకు సాయిబాబా అన్నం గుండిగలో తన చేతిని
పెట్టి కలియతిప్పిన సంఘటనను గుర్తుకుతెచ్చింది. మరుసటి రోజు ఉదయం ఆవిడ మమ్మల్ని తన గురువుగారి ప్రదేశమయిన
నారాయణపూర్ కి తీసుకునివెళ్ళారు. అక్కడ ఆవిడ
మారుతి దేవాలయంలో ధ్యానం చేసుకున్నారు. మధాహ్నం
వరకు ఆవిడ మాతోనే ఉన్నారు. ఆతరువాత మమ్మల్ని
తనను పూజించుకోవడానికి అనుమతి ప్రసాదించారు.
ఆవిడని మేము ఇంతకుముందెన్నడూ కలుసుకోలేదు.
కాని మేము తనకు తెలుసుననీ, మాతో గత తొమ్మిది జన్మలనుంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆవిడ మాటలకి మేము చాలా ఆశ్చర్యపోయాము.
ఆతరువాత మేమందరం వ్యానులో ప్రయాణిస్తున్నాము. ఆవిడ రోడ్డు ప్రక్కన ఉన్న వృక్షాలను చూపిస్తూ వాటిలాగానే మీరు కూడా ఉపయోగకరంగా ఉండాలని బోధించారు. అనగా చెట్లు మానవాళికి అవసరమయిన ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. మనకు చల్లని నీడను ఇస్తాయి. ఫలపుష్పాలను మనకు అందిస్తాయి. ఆఖరికి అవి చనిపోయినపుడు మనకి కలపగా ఉపయోగపడయాయి. అవి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్ధంగా మనకి ఉపయోగపడుతున్నాయి. చెట్లు చేసే మహోపకారాన్ని, త్యాగాన్ని గుర్తించి మమ్మల్ని కూడా అదేవిధంగా నిస్వార్ధంగా ఉండమని మాతాజీ హితోపదేశం చేసారు.
ఆతరువాత మేము వ్యానులో సాయిభజన ప్రారంభించాము. కొంతసేపటి తరువాత మాస్నేహితులలో ఒకరయిన శ్రీవెంకట్రామయ్యగారు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. సాయినామం జపిస్తున్నందువల్ల భావోద్వేగం కలిగి ఆయన ఆవిధంగా ఏడుస్తున్నారని మొదట్లో భావించాము. కాని ఆయన చెప్పిన విషయం విని మాకు అత్యంతాశ్చర్యం కలిగింది. ఆయన పే అండ్ ఎక్కౌన్ ట్స్ ఆఫీసర్. వాళ్ళబ్బాయి ఎమ్.కామ్. గోల్డ్ మెడలిస్ట్. అతనికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కాని ఉద్యోగంలో ప్రవేశించిన కొద్ది నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను పోయి సంవత్సరమయినా తల్లి, తండ్రి అతని జ్ఞాపకాలను మర్చిపోలేక దుఃఖిస్తూ ఉంటారు. మనశ్శాంతి కోసం మాతో ఈయాత్రకి వచ్చారు. నామజపం జరుగుతున్నపుడు, నాభర్త మాతాజీ పాదాల దగ్గర కూర్చున్నారు. శ్రీవెంకట్రామయ్యగారు వ్యాను తలుపు దగ్గర, మాతాజీ సీటు మధ్యలోను కూర్చున్నారు. భజన ప్రారంభమయిన కొంతసేపటికి శ్రీవెంకట్రామయ్య గారికి ‘నాన్నా – నాన్నా’ అనే పిలుపు వినపడింది. ఆయన కళ్ళు తెరచి చూడగానే తన కుమారుడు మాతాజీ ప్రక్కనే కూర్చుని ఉండటం కనిపించింది. శ్రీవెంకట్రామయ్య గారు, కొడుకు చేయి పట్టుకుని ఏడవసాగారు. తన కుమారుడి చేతి స్పర్శ ఆయనకి తెలుస్తూనే ఉంది. పదినిమిషాల తరువాత అనసూయమాత అతనిని తన ఒడిలోకి తీసుకోగానే అతను అదృశ్యమయిపోయాడు. తమ కుమారుడు కనీసం మాతాజీతోనయినా ఆనందంగా ఉన్నాడని ఆదంపతులు ఎంతో సంతృప్తి చెందారు.
ముందురోజు
మధ్యాహ్నంనుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మాతాజీ మాతోనే ఉన్నారు. అప్పుడప్పుడు ఆవిడ మిగతా భక్తులకి దర్శనం ఇవ్వడానికి
వెడుతూ ఉన్నాగాని, ఆవిడ మళ్ళీ వెనక్కివచ్చి మాతో కొంతసేపు గడుపుతూ ఉండేవారు. ఇదంతా గమనించిన ఆశ్రమంవాళ్ళు ఆవిడని ఒక గదిలో ఉంచి,
గదికి తాళంవేసారు. తిరిగి హైదరాబాదుకు వెళ్ళడానికి సన్నాహాలు మొదలు పెట్టాము.
బయలుదేరేముందు మాతాజీని కలుసుకోలేకపోయామే అని చాలా బాధపడ్డాము. ఆవిడని చూడాలనే ఆశతో మాతాజీ ఉన్నగది దగ్గరకు వెళ్ళి, తలుపులకు ఉన్న సందులగుండా తొంగి చూశాను. నేనావిధంగా తలుపుకు ఉన్న రంధ్రం గుండా చూడటంతో నామనసులోని ఆలోచనను పసిగట్టిన మాతాజీ తను కప్పుకున్న దుప్పటిని తొలగించి తన ముఖాన్ని చూపించారు. ఆవిడ తన కళ్ళతోనే నన్ను దీవించి మరలా దుప్పటిని కప్పేసుకున్నారు. తల్లి ఒక్కతె తన పిల్లలను తృప్తి పరచగలదనే నమ్మకంతో నేను సంతోషంగా తిరిగి వచ్చేశాను.

(రేపటి సంచికలో బాబాకు అంకిత భక్తుడయిన ఉమా
మహేశ్వరరావుగారిపై చేతబడి ప్రయోగం?)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
2 comments:
I need baba help i am suffering with financial problems 9481869769
"mee bharamulu na pai padaveyandi nenu vatini mosedanu" anna baba mata pina nammakam unchi manaspoorti ga ayanane pradhinchandi. Your sufferring will be reduced.
Post a Comment