13.04.2017
గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –21 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 944037541
శ్రీ
ఉమామహేశ్వరరావుగారిపై చేతబడి
సజ్జన్
ఘడ్ లో ఉన్న సమర్ధ రామదాస్ స్వామి పీఠాధిపతి శ్రీ నారాయణ మహరాజ్ స్వామి గారిని మేము
దర్శించుకుంటూ ఉంటాము.
వారు హైదరాబాద్ లోని
మఠానికి వచ్చినప్పుడు గాని, కర్నాటకలోని హరి హర మఠానికి వచ్చినపుడు గాని మేము వెళ్ళి
దర్శించుకుంటూ ఉంటాము. ఒకసారి ఆయన హైదరాబాద్
లోని మఠానికి వచ్చారని తెలిసింది. మేమాయనను
దర్శించుకోవడానికి వెళ్ళాము మేమాయనను సమీపిస్తుండగానే
ఆయన నాభర్త వైపు చూసి, “సాయిభక్తులలో ఒకడు నీమీద అసూయతో నీపై చేతబడి ప్రయత్నం చేశాడు”
అని ఆవ్యక్తి పేరు, వివరాలు చెప్పారు. స్వామి
చెప్పిన మాటలకు మాకు చాలా ఆశ్చర్యం వేసింది.
ఆవ్యక్తికి మామీద ఉన్న ద్వేషానికి, అవిశ్వాసానికి చాలా బాధపడ్డాము. నాపరిస్థితిని గమనించి స్వామీజీ నన్ను ఓదారుస్తూ,
“భయపడకు, అన్నీ బాబా చూసుకుంటారు” అని ధైర్యం చెప్పారు. అపుడు నేనాయనతో “స్వామీ, నాభర్త ఎవరికీ ఎటువంటి
హాని తలపెట్టలేదు. ఎవ్వరినీ అవమానపరచలేదు. అహంకారం ఆయన దగ్గరకు రావడానికే భయపడుతుంది. నాభర్త చాలా మంచి హృదయం కలవారు. చిన్నపిల్లవాని మనస్తత్వం. అటువంటి ఆయన మీద చేతబడి చేయాలని ఎందుకని ప్రయత్నం
జరిగిందో నాకర్ధం కావటంలేదు” అన్నాను. అపుడు
స్వామీజీ, “ అనేకమంది భక్తులు ఎంతో కాలంనుంచి బాబా తత్వ ప్రచారం చేస్తున్నా గాని బాబా
అనుగ్రహాన్ని పొందలేకపోయారు. కాని నీభర్త అనతికాలంలోనే
బాబా అనుగ్రహాన్ని పొందారు. అందువల్లనే నీభర్త
మీద చేతబడి ప్రయత్నం జరిగింది” అన్నారు. అంతా ఆయన వివరించి మమ్మల్ని ఎటువంటి ఆందోళన పెట్టుకోకుండా
నిశ్చింతగా ఉండమని చెప్పారు.
మూడురోజుల
తరువాత నాకు కల వచ్చింది. ఆ కలలో నేను శ్రీనారాయణ
మహరాజ్ వారి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక
ఇత్తడి గెన్నెలో బొగ్గులు మండుతూ ఉన్నాయి.
నేను నాభర్త అక్కడికి వెళ్ళి నిలబడ్డాము.
శ్రీనారాయణ మహరాజ్ గారు నాలుగంగుళాలు నలుచదరంగా ఉన్న రాగిరేకుని తీసుకుని వచ్చారు. ఆ రాగిరేకు మీద ఏదో వ్రాయబడి ఉంది. ఆయన దానిని మండుతున్న బొగ్గుల మంటలోకి విసిరేసి వెళ్ళిపోయారు.ఆ సమయంలో స్వామి మాతో మాట్లాడకపోయినా, ఆయన ఏమిచేసినా
మా క్షేమం కోసమేననే నమ్మకంతో ఉన్నాము. మేము శ్రీసీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ మూర్తులను దర్శించుకుని వెళ్ళిపోయాము.
మరునాడు
మేము శ్రీనారాయణ మహరాజ్ గారి ఆశ్రమానికి వెళ్ళాము. నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయబోతుండగా “మళ్ళి
మీరు ఎందుకు వచ్చారు? మీరు చాలా మధన పడుతున్నారని
రాత్రి మీకలలోకి వచ్చాను కదా?” అన్నారు. ఆయన
మాటలకు ఆశ్చర్యపోయి స్వామీజీకి వినమ్రంగా నమస్కరించుకున్నాము.
ఈ
సంఘటన జరిగిన రెండు నెలల తరువాత మేము షిరిడీ వెళ్లాము. నాభర్త ద్వారకామాయిలో ధ్యానం చేసుకుంటున్నారు. అదే సమయంలో నాభర్త మీద చేతబడి చేసిన వ్యక్తి, ధ్యానంలో
నిమగ్నమయి ఉన్న నాభర్తకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. ఆతరువాత బాబా ఫొటోకు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుని
నన్ను చూసినా గాని, చూడనట్లే వెళ్ళిపోయాడు.
తప్పు చేసినవాడిని క్షమించు, తప్పుని ద్వేషించు అన్న బాబామాటల ప్రకారం. మేమా
వ్యక్తి మీద ఎటువంటి ద్వేషాన్ని పెట్టుకోలేదు.
అతని ప్రవర్తన చూస్తే తను చేసినపనికి
ప్రశ్చాత్తాప పడుతున్నట్లుగా కనిపించాడు. అరగంట
గడిచిన తరువాత నాభర్త ధ్యానంలోనుంచి లేచారు.
బాబా తనకు ధ్యానంలో దర్శనమిచ్చి, “నీమీద చేతబడి చేసి నీకు హాని తలపెట్టదలచుకున్న
వ్యక్తి ద్వారకామాయికి వచ్చి నీపాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడు” అని చెప్పారన్నారు. బాబా చెప్పినట్లుగానే ఆవ్యక్తి ఇంతకు ముందే వచ్చి
వెళ్ళిపోయాడని చెప్పాను. సర్వరక్షకుడు, సర్వశక్తిమంతుడయిన
బాబా అనుగ్రహం మానవాళి మీదంతా ప్రసరిస్తూ ఉంటుంది. అటువంటి ఆయన భక్తులమీద ఎవ్వరూ కూడా ఎటువంటి హాని
తలపెట్టలేరు. ఒకవేళ హాని తలపెడదాముకున్నా అది
ఎప్పటికీ జరగని పని.
(రేపటి సంచికలో జీవితకాలాన్ని పొడిగించిన బాబా)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment