14.04.2017 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి – 22 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 9440375411
జీవితాన్ని
నిలబెట్టిన బాబా
1990
వ.సంవత్సరం జనవరి 25 వ.తారీకున నాభర్త శ్రీ ఉమా మహేశ్వరరావుగారికి బాబా ధ్యానంలో దర్శనమిచ్చి,
“వచ్చే ఆదివారం (04.02.1990) నాడు నీ జీవిత
చరమాంకం. నీ సమయం దగ్గరపడింది. నువ్వు ప్రతిరోజు బిల్వపత్రాల రసాన్ని త్రాగుతూ
నా నామస్మరణ చేస్తూ ఉండు” అని చెప్పారు.
బాబా
చెప్పిన ఈ సందేశం వినగానే బాంబుపేల్చినట్లుగా అనిపించింది. నామనస్సు కకావికలమైపోయింది. గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రపంచమంతా శూన్యమయిపోయినట్లయింది. మేము రోజులు లెక్కపెట్టుకుంటున్నాము.
నాభర్త
ఈ ప్రాపంచిక సుఖాలన్నిటిని త్యజించినట్లుగా సాయి సన్నిధికి చేరుకోవడానికి క్రమక్రమంగా
సిధ్ధమవుతున్నారు. తాను సమాధి స్ఠితిలోకి వెళ్ళినట్లుగా
ఉందని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. నాభర్త నా సంకట పరిస్ఠితిని అర్ధం చేసుకునే స్ఠితిలో
లేరు. నాబాధను ఎవరితో పంచుకోవాలో నాకర్ధం కాలేదు. నాబాధలను చెప్పుకోవడానికి సాయిబాబా ఒక్కరే ఆశాకిరణంలా కనిపించారు. నాభర్తను రక్షించగలవారు ఆయన మాత్రమే అనే నమ్మకంతో
ఉన్నాను. ఆవిధంగా ఆలోచిస్తూ బాబా ముందర రోదించాను,
“బాబా, బాబా, నాభర్తకు వంద సంవత్సరాల జీవితాన్ని
ప్రసాదించమని నేను నిన్నడగటంలేదు. నా జీవితకాలాన్ని
నాభర్తకు ప్రసాదించి నన్ను ‘సుమంగళి’గా ఈ లోకంనుండి వీడిపోయేలా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఆయనకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పావు. అయినప్పటికి నువ్వు తలుచుకుంటే ఆయన జీవితాన్ని పొడిగించగలవు. దీనికి ఉదాహరణ నువ్వు శ్రీనృసింహసరస్వతి అవతారంలో
అల్పాయుష్షు గల బాలుడిని రక్షించలేదా? దురదృష్టవశాత్తు,
ఆవిధంగా ఆశపడటానికి కూడా మాకు యోగ్యత లేదు. నన్ను నీపాదపద్మాల దగ్గరకు చేర్చుకో. భర్తలేకుండా
ఒంటరిగా గడిపే జీవితాన్ని మాత్రం నాకివ్వద్దు.”
ఇతర
ప్రాంతాలనుండి మాదగ్గరి బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ వచ్చారు. ప్రతిరోజు సాయిభక్తులందరూ వచ్చి చూసి వెడుతూ ఉండేవారు. ప్రతిరోజు సాయినామ జపం చేస్తూ ఉన్నాము. బాబా ఆదేశానుసారం నాభర్త బిల్వపత్రాల రసం త్రాగుతూ
ఉన్నారు. బాబా చెప్పిన ఆ అవసాన దినం కోసం ఎదురు
చూస్తూ ప్రగాఢమయిన నమ్మకం ఆశలతో బాబాని ప్రార్ధిస్తూనే
ఉన్నాను.
జనవరి
28వ. తారీకున బాబా ఈ సందేశాన్నిచ్చారు.
“వాస్తవానికి
మానవావతారం ఎత్తిన భగవంతునికి కూడా నిర్యాణం తప్పదు. నన్ను శరణు పొందిన భక్తుల కర్మలను మాత్రమే నిర్మూలించగలను. కాని అనివార్యమయిన విధి వ్రాతను తప్పించలేను. మానవుడు తన
అంత్య కాలంలో నా స్మరణయందే నిమగ్నమయి ఉండాలి. ఎవరయితే నన్ను స్మరిస్తూ, నానామాన్ని జపిస్తూ ఉంటారో
నేనెల్లపుడు వారికి దారి చూపుతాను. నీ స్నేహితులను,
బంధువులను అందరినీ పిలిపించి భక్తిశ్రధ్ధలతో నా నామజపాన్ని చేయమను”
ఈవిధంగా బాబా నాభర్తకు సందేశాన్నిచ్చి అదృశ్యమయ్యారు.
ఫిబ్రవరి
3వ.తారీకున మధ్యాహ్నం బాబా మరొక సందేశాన్నిచ్చారు. 7000 శ్లోకాలు కలిగిన శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామివారి
‘గురుసంహిత’ పారాయణ చేయమని చెప్పారు. మరుసటిరోజు
‘దత్తహోమం’ జరిపించమన్నారు. గురుసంహిత పారాయణ
వెంటనే ప్రారంభించడానికి ఒక సంస్కృత పండితుడిని ఏర్పాటు చేశాము. శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీ బోధానందస్వామిగారిని
కూడా ఆహ్వానించాము. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే రావడానికి ఒప్పుకొన్నారు. ఆయన వచ్చి మరుసటిరోజు వరకు మాతోనే ఉన్నారు. ఆయన మాకెంతో స్వాంతన కలిగించారు. ఏమి జరిగినా ఇంక బాబా ఇష్టానుసారమేననే భావంతో ఉండిపోయాను.
4వ.తేదీ
ఉదయం మాయింటికి సాయిభక్తుల రాక మొదలయింది.
ఉదయం 6 గంటలకే అఖండ దీపారాధన చేసి సాయినామ జపాన్ని ప్రారంభించాము. భక్తులందరూ ఎంతో భక్తిశ్రధ్ధలతో నాభర్తని కాపాడమని
ప్రార్ధిస్తూ బాబానామాన్ని జపిస్తున్నారు. శ్రీసాయి ఇచ్చిన ఆదేశాల ప్రకారం 7000 శ్లోకాల గురుసంహిత
పారాయణ జరుగుతూ ఉండగానే మరొకవైపు దత్తహోమం, నామజపం అన్నీ యధావిధగా జరుగుతున్నాయి. ఈలోపుగా ఒక సాయిభక్తునికి లలితా సహస్రనామ పారాయణ
11 సార్లు పారాయణ చేయాలనే సంకల్పం కలిగింది.
బాబా మావారిని కాపాడతారా లేదా అని తెలుసుకోవడానికి చాలామంది భక్తుల రాక మొదలయింది. కాని ఈ వార్త అంత తొందరగా ఎలా వ్యాపించిందా అని
ఆశ్చర్యపోయాము. దాదాపు నాలుగువందల మంది సాయిభక్తులు
నామ జపంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం శ్రీసాయికి ఆరతి ఇవ్వడం, దత్తహోమం రెండూ ఒకేసారి పూర్తి చేశాము.
ఆసమయంలో
నాభర్తకి ఛాతీలో కాస్త నొప్పి మొదలయింది. వెంటనే
ఆయనను మంచంమీద పడుకోబెట్టాము. బాబా బుందన్
గిరి (దత్తపాదుక క్షేత్రం) వద్దనుంచి తెచ్చిన ఊదీని, చందనాన్ని నుదుటికి, ఛాతీకి రాసాము. ఆయనకు బాబా తీర్ధాన్ని త్రాగించాము. ఇంత చేసినా కూడా ఆయన స్పృహతప్పిపోయారు. నాభర్తతో సన్నిహితంగా ఉండె సాయిభక్తులు ఆయన ప్రక్కనే
కూర్చుని శ్రీసాయిని దయ చూపమని ప్రార్ధిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకి నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. బి.పి. తగ్గిపోయింది. ఆయన పరిస్థితిని గమనించి సాయిభక్తులలో ఉన్న కొంతమంది
డాక్టర్స్ కూడా భయపడిపోయారు.
ఇదంతా
చూసిన తరువాత మాలో ఆయన బ్రతుకుతారనే ఆశ కాస్త సన్నగిల్లింది. నాకు భయం, అందోళన ఎక్కువయింది. అంతకు ముందే తెచ్చి ఉంచిన ఆక్సిజన్ సిలెండర్ తెచ్చి
ఆయనకు ఆక్సిజన్ పెట్టమని చెప్పాను. సిలెండర్
మూత తీద్దామని ఓపెన్ చేస్తుండగానే మూత విరిగిపోయింది. నా అజ్ఞానానికి బాబా ఒక గుణపాఠం చెప్పారని భావించాను.
కొంతసేపటి
తరువాత మావారు “బాబా – బాబా” అని మెల్లిగా గొణిగారు. బాబా ఆయన జీవితాన్ని నిలబెట్టారని అర్ధమయింది మాకు. సాయిభక్తులలో ఒక డాక్టర్ వచ్చి ఆయన నాడిని పరీక్షించి,
నాడి యధాప్రకారంగా కొట్టుకుంటోందని చెప్పారు.
ఆతరువాత నాభర్త మామూలుగా లేచి ‘నామసంకీర్తన’ లో పాల్గొన్నారు. ఆసాయంత్రం గం.4.19 ని.కి నాభర్తకు ధ్యానంలో బాబా
దర్శనమిచ్చి “నామీద పూర్తి నమ్మకం, విశ్వాసంతోను, నీమీద ప్రేమాభిమానాలతోను నాభక్తులు
నామజపం చేశారు. అందుచేతనే నీజీవితంలో పెద్ద
గండం నివారింపబడింది. నువ్వు బాధననుభవించవలసిన
కాలం కూడా తగ్గిపోయింది” అన్నారు. నాభర్తను
రక్షించడానికి సాయిభక్తులందరూ వచ్చి మాకెంతో సహాయసహకారాలు అందించారు. వారు చూపించిన ప్రేమాభిమానాలకి కృతజ్ఞతాపూర్వకంగా
ఆరోజు సాయంత్రం 6 గంటలవరకు నామజపాన్ని మరింత భక్తితో కొనసాగించాము.
దయాసాగరుడయిన
శ్రీసాయినాధులవారు నాభర్తకు క్రొత్తజీవితాన్ని ప్రసాదించారు. ఆందోళనపడుతున్న మాహృదయాలకి ఓదార్పును కలిగించారు. నాహృదయంలో వేయిదీపాలు వెలిగి రంగురంగుల ఇంద్రధనుస్సు
ఏర్పడినట్లుగా అనుభూతి చెందాను. అందరినీ రక్షించేవాడు,
కరుణాసముద్రుడు, సర్వాంతర్యామి, అయిన శ్రీసాయినాధులవారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలను
అర్పించుకొన్నాను. ఆయన పాదపద్మాలకు శతకోటి నమస్కారాలను ఎంతో వినయంగా సమర్పించుకొంటున్నాను.
1990వ.
సంవత్సరంలో శ్రీసాయినాధులవారు నాభర్తకు ధ్యానంలో దర్శనమిచ్చి పూజ్య రత్నపురి స్వామీజీని
కలుసుకొని ఆయన వద్దనుంచి ఆత్మ – తత్వాన్ని గురించి తెలుసుకోమని చెప్పారు. ఆతరువాత నాభర్త తన స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్ళారు. అక్కడ స్వామీజీ వారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శనం
కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆశ్రమంలోనే
ఉంటున్న స్వామిజీ శిష్యుడు వచ్చి నాభర్త దేనిగురించి వచ్చారో వివరాలడిగాడు. అన్నీ తెలుసుకున్న తరువాత, “బాబా తన భక్తులను మా
గురువుగారి వద్దకు పంపించేకన్నా ఆయనే తన భక్తులకు ఆత్మ తత్వాన్ని బోధించవచ్చును కదా”
అని తిరస్కారంగా మాట్లాడాడు. ఈలోగా రత్నపురి
స్వామీజీ వచ్చి నాభర్తతో కన్నడంలో మాట్లాడారు.
నాభర్త ఆయనకు నమస్కరించగానే ఆయన దీవించి “ఈసారి ఎప్పుడయినా నీతో తీరికగా మాట్లాడతాను. ఇపుడు నేను ప్రయాగలో జరుగుతున్న కుంభమేళాకు వెళ్ళడానికి,
ప్రయాణ సన్నాహాలు చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ హడావిడిలో ఉన్నాను” అన్నారు.
తను
వచ్చిన పని ఆవిధంగా నిష్ప్రయోజనం అవడంతో మావారు చాలా బాధపడ్డారు. శ్రీసాయి నాభర్తకు ధ్యానంలో దర్శనం ఇచ్చి,
“ఇదంతా
‘గురుపరంపర’ విధానం. ఒక గురువు తన శిష్యునికి
ఆత్మ తత్వాన్ని బోధపరిచేందుకు మరొక గురువు వద్దకు పంపుతాడు. అందువల్లనే నీకు ఆ తత్వాన్ని గురించి బోధపరచడానికి
ఆగురువు వద్దకు వెళ్ళమని సందేశాన్నిచ్చాను.
కాని, ఆయన శిష్యుడు నన్ను, నాతత్వాన్ని అర్ధం చేసుకోకుండా తన గురువుకి నువ్వు
వచ్చిన విషయం సరైన పద్దతిలో వివరించలేదు. అందువల్లనే
ఆయన ఉపదేశాలను వినే భాగ్యంనీకు కలగలేదు. కాని
నువ్వు మరలా ఆయన వద్దకు వెళ్ళనవసరం లేదు. ఆయనే
నీవద్దకు వచ్చి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు.”
ఇది
జరిగిన మూడు నెలల తరువాత ఒక రోజు సత్సంగంలో నాభర్త గాఢమయిన ధ్యానంలో ఉన్నారు. ఆధ్యానంలో
శ్రీరత్నపురి స్వామీజీ బ్రహ్మాండమయిన తేజస్సుతో దర్శనమిచ్చి, చాలాసేపు మావారికి ఆత్మజ్ఞానాన్ని
బోధించారు. మావారు తను ఎప్పుడూ వినని శ్లోకాలను
యధాతధంగా తిరిగి చెప్పారు. నాభర్త ప్రక్కనే
కూర్చుని ఉన్న సాయిభక్తులు వాటినన్నిటినీ వెంటనే రాయడం మొదలుపెట్టారు. ఈ శ్లోకాలన్నిటినీ విన్న తరువాత నాభర్తతోపాటు మేము
కూడా ఎంతో అదృష్టవంతులమని పొంగిపోయాము.
శ్రీసాయిబాబా
నాభర్తకు దర్శనమిచ్చి, స్వామీజీ గారే వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారని చెప్పినపుడు,
స్వామీజీయే హైదరాబాదు వచ్చి నాభర్తకు బోధ చేస్తారనుకున్నాము. కాని, ఆయన ధ్యానంలో దర్శనమిచ్చి నాభర్తకు ధ్యానంలోనే
ఆత్మజ్ఞానం గురించి బోధిస్తారని అస్సలు ఊహించలేదు.
ఆతరువాత
కొంత కాలానికి శ్రీరత్నపురి స్వామీజీని దర్శించుకోవటానికి నాభర్త బెంగళూరు వెళ్ళారు. ఆయన ఎంతో అభిమానంగా ఆహ్వానించారు. నాభర్త ఆయనకు జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్లు
వివరించి చెప్పారు. అపుడు స్వామీజీ నవ్వుతూ
తన శిష్యులతో ఈవిధంగా చెప్పారు.
“ఆయన
చెప్పేదంతా వింటున్నారా?”
అప్పుడు
శిష్యులు “మా స్వామీజీ గారు ఇక్కడే ఉంటారు.
ఇక్కడే ఉన్నా, ఆయన అమెరికాలో ఉన్న తన భక్తులకు కూడా దర్శనమిస్తారు. ఆయన సమర్ధత, శక్తి మాకందరికీ తెలుసు. అందువల్ల ఈ దేశంలో స్వామీజీ మీకు దర్శనమిచ్చి ఆత్మజ్ఞానాన్ని
బోధించారంటే అందులో మాకు ఎటువంటి ఆశ్చర్యం లేదు.”
స్వామీజీ
తన మీద నమ్మకం ఉన్న తన శిష్యులకు మాత్రమే దర్శనమివ్వగలరని భావించాము. ఆయనకు నాభర్త
గురించి గాని, కనీసం ఆయన పేరుగాని తెలియదు.
కాని, ఆయన నాభర్తకు ధ్యానంలో దర్శనం ఇచ్చారంటే అది భగవంతుని కృప, ఆయన మాకనుగ్రహించిన
వరం తప్ప మరేమీ కాదు.
(రేపటి సంచికలో శ్రీచక్ర పూజ -
పూజా గదిలో అధ్భుతమైన దృశ్యం)
(సర్వంశ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment