15.04.2017 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –23 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 9440375411
సాయి బంధువులకు మనవిః రేపు దుబాయి నుండి
హైదరాబాదుకు తిరిగి వస్తున్నాముక్. హైదరాబాదుకు
వచ్చిన
తరువాత తిరిగి ప్రచురిస్తూ ఉంటాను.
శ్రీచక్రపూజ ప్రాముఖ్యత
శ్రీ
సాయినాధులవారు సమస్త దేవీ దేవతల అవతారం. “నేనే
జగన్మాతను” వారికి నాకు మధ్య ఎటువంటి భేదము లేదు అని బాబా పలుమార్లు చెప్పారు. ఒకసారి బాబా శ్రీ చక్రాన్ని పూజించమని మావారికి
సందేశాన్నిచ్చారు.
మావారు చేసే పూజలను బాబా జగన్మాత అవతారంలో స్వీకరించదలచారని అందుకనే శ్రీచక్ర పూజ చేయమని ఆదేశించారని నేను భావించాను. ఆ తరువాత నా భర్త ‘శ్రీసాయి సప్త సప్తాహానికి’ మచిలీపట్నం వెళ్ళారు. అక్కడ శ్రీ దత్తాత్రేయులవారి భక్తుడయిన శ్రీ పోతాప్రగడ సుబ్బారావుగారిని కలుసుకున్నారు. ఆయనని శ్రీచక్రం ఎక్కడ లభ్యమవుతుందని వివరాలు అడిగారు. శ్రీ సుబ్బారావు గారు శ్రీ చక్రం మద్రాసులో దొరుకుతుందని చెప్పారు. నాభర్త త్వరలో మద్రాసులో జరగబోయే అఖిలభారత సాయి భక్తుల సమ్మేళనంలో పాల్గొనవలసి ఉంది. ఆ సమయంలో మద్రాసు వెళ్ళినపుడు శ్రీ చక్రాన్ని కొని తెచ్చుకోవచ్చని అనుకున్నారు.

నాలుగు రోజుల తరవాత నాభర్త మచిలీపట్నం నుండి తిరిగి వచ్చారు. ఆయన వచ్చిన తరువాత శ్రీ సుబ్బారావుగారి అబ్బాయి జూబ్లీ హిల్స్ లో ఉన్న మాయింటికి వచ్చాడు. అతను ఎఱ్ఱరంగు ప్లాస్టిక్ భరిణ, ఒక ఉత్తరం తీసుకునివచ్చి నాభర్తకు ఇమ్మని చెప్పాడు. ఆ అబ్బాయి తన నాన్నగారు ధ్యానంలో ఉన్నపుడు శ్రీదత్తాత్రేయస్వామి దర్శనమిచ్చి
“నీ వద్ద రెండు శ్రీచక్రాలు ఉన్నాయి కదా. ఒకటి ఉమామహేశ్వరరావుగారికి ఇవ్వచ్చు కదా” అని చెప్పారట. వాళ్ళ నాన్నగారు వెంటనే మావారు బస చేసిన హోటల్ కి వచ్చారని, అప్పటికే నాభర్త హోటల్ ఖాళీ చేసి బయలుదేరినట్లు తెలిసిందిట. అందుకనే తనతో ఆ శ్రీచక్రం ఉన్న భరిణ, ఉత్తరం పంపించారని చెప్పాడు.
శ్రీ
సుబ్బారావుగారు శ్రీచక్రాన్ని నా భర్తకి ఇద్దామని నిర్ణయించుకుని తన కొడుకు ద్వారా
పంపించారు. శ్రీదత్తాత్రేయులవారికి సాష్టాంగ
ప్రణామాలను అర్పించుకుని శ్రీసుబ్బారావుగారి మంచి మనసుకు మాకృతజ్ఞతలను తెలుపుకున్నాము. ఆవిధంగా నాభర్త ఈ చరాచర సృష్టికి మూలకారణమయిన ఆ
జగన్మాత రూపంగా శ్రీసాయిని భావించుకుంటూ శ్రీచక్రాన్ని పూజించటం మొదలుపెట్టారు. బాబా అనుగ్రహం వల్ల నాభర్తకి ధ్యానంలో అప్పుడప్పుడు
అమ్మవారి దర్శనం కలిగే అదృష్టం లభించింది.
2) 1991 వ.సంవత్సరంలో కార్తిక పౌర్ణమి ముందురోజు రాత్రి
శ్రీసాయిబాబా నాభర్తకు ధ్యానంలో దర్శనమిచ్చి, మరుసటి రోజంతా పూర్తిగా ద్రవాహారమే తీసుకొమ్మని,
ఏవిధమయిన ఘనపదార్ధాలను తీసుకోవద్దని ఆదేశించారు.
పగలు రాత్రి పూజాగదిలోనే ఉండమని చెప్పారు.
నా
భర్త బాబా చెప్పిన ప్రకారమే ఆచరించారు. తరువాత
ఉదయం మూడు గంటలకు నాభర్తకు కాస్త నిద్రగా ఉన్నట్లనిపించింది. అపుడాయనకు దేవి ఎఱ్ఱటి సిల్కు జరీ దుస్తులను, అనేక
రకములైన ఆభరణాలను ధరించి దర్శనమిచ్చింది. నాభర్త
“అమ్మా! నువ్వెవరు? నీపేరేమిటి?” అని ప్రశ్నించారు. అపుడాదేవి “నేను ప్రత్యంగిరదేవిని. నేను నిన్ను కాపాడుతూ ఉంటాను” అని చెప్పి ఆయనను దీవించి అదృశ్యమయింది.
బాబా మమ్మల్ని కాపాడుతూ ఉండటమే కాక, ప్రత్యంగిరదేవి అనుగ్రహాన్ని కూడా మాకు లభించేందుకు దోహద పడ్డారు. ఈ దేవియొక్క దర్శనం నాభర్తకు లభింపచేసేటందుకే బాబా మావారిని అత్యంత నిష్టతో పూజాగదిలోనే ఉండమని ఆదేశించారు.

1992
వ.సంవత్సరంలో పౌర్ణమి రోజున సూర్యాస్తమయంలో నాభర్త శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేసి,
లలితా త్రిపుర సుందరినీ, రాజరాజేశ్వరీ దేవి అమ్మవార్లను కూడా పూజించారు.
తరువాత ఆయన తీవ్రమయిన ధ్యానంలోకి వెళ్ళారు. ఆయన ఆవిధంగా మరుసటిరోజు ప్రాతఃకాలం వరకు ఉన్నారు. మేమాయనను ఎత్తుకుని మంచంమీద పడుకోబెట్టాము. ఉదయం మేము పూజాగదిలోకి వెళ్ళగానే అధ్భుతమయిన దృశ్యం కనపడింది. మాకళ్ళని మేమే నమ్మలేకపోయాము. రాత్రి నాభర్త శ్రీచక్రానికి చేతినిండా పట్టేటంత (50 గ్రా.) కుంకుమతో పూజ చేశారు. కాని ఉదయం చేసేటప్పటికి ఒక అడుగు ఎత్తువరకు కుంకుమ ఉంది. పూజాగదంతా ఆకుంకుమ నుంచి మంచి సువాసన వ్యాపిస్తూ ఉంది.

ఆరోజున
నాభర్త ధ్యానం చేసుకుంటున్నపుడు బాబా దర్శనమిచ్చి, గుట్టగా ఉన్న ఆ కుంకుమను కార్తిక
మాసమంతా ఆవిధంగానే ఉంచి, ఆతరువాత భక్తులందరికీ పంచిపెట్టమని చెప్పారు. మేము బాబా చెప్పినట్లుగానే చేశాము. అటువంటి పవిత్రమయిన సంఘటన అనంతమయిన బాబా అనుగ్రహం
వల్లనే సాధ్యపడుతుంది. ఆయనకు మా హృదయపూర్వకమయిన
నమస్కారాను తెలుపుకుంటున్నాము.
1992
వ.సంవత్సరంలో మాబంధువుల ఇంటికి విశాఖపట్నం వెళ్ళాము. అక్కడ నాభర్తకి మూడు రోజులపాటు వరుసగా రాజరాజేశ్వరీ
దేవి దర్శనమిచ్చింది.
(దేవీపురం )
ఆ
సంవత్సరమే మేమందరం విశాఖపట్నం జిల్లాలో ఉన్న దేవీపురం వెళ్ళాము రాజరాజేశ్వరీదేవి ఆజ్ఞాపించిన ప్రకారం శ్రీచక్ర
ఆకారంలో ఒక గుడిని అమెరికానుంచి వచ్చిన ఒక సత్పురుషుడు డా.ప్రహ్లాద శాస్త్రిగారు నిర్మించారు. ఆయన గొప్ప యోగి. అక్కడ నాభర్త ధ్యానం చేసుకున్నపుడు కామాఖ్యదేవి
ఆయనకు దర్శనమిచ్చింది.
(శ్రీ ప్రహ్లాద శాస్త్రి గారు)
************
క్రిందటి సంవత్సరం నేను మా బంధువుల ఇంటికి జూన్ 2016 వ. సంవత్సరంలో విశాఖపట్నం వెళ్ళాను. అనుకోకుండానే మేము కూడా దేవీపురం వెళ్ళాము.
( జూన్ 2016 లో నేను దేవిపురమ్ వెళ్ళినపుడు
తీసిన ఫొటో)
ప్రహ్లాద శాస్త్రి గారిని కలుద్దామని ఆయన గురించి అడిగాను. కాని ఆయన నాలుగు నెలల క్రితమే కాలం చేసారని చెప్పారు. అక్కడ గుడిని మంచి ఆహ్లాదకరమయిన ప్రదేశంలో నిర్మించారు. ఆ ప్రదేశాన్ని కూడా రాజరాజేశ్వరీదేవే శ్రీ శాస్త్రిగారికి ధ్యానంలో సూచించిందని అక్కడివారు చెప్పారు. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలన్నిటిని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి.
యూ
ట్యూబ్ లో దేవీపురం గురించి మీరు సమగ్రంగా తెలుసుకోవచ్చు. ... త్యాగరాజు
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment