11.04.2017 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –19 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 944037541
షిరిడీలో
సాయి ప్రదర్శించిన అద్వితీయమైన లీలలు
1987 వ. సంవత్సరం జూలై 22వ. తారీకున సాయిబాబా నాభర్తకు
ధ్యానంలో దర్శనమిచ్చారు. ఈ రోజు నీకు తీవ్రమయిన
గుండెపోటు వస్తుంది అని హెచ్చరించి, గ్లాసుడు పాలలో విభూది, చిటికెడు మంత్రాలయ రాఘవేంద్రస్వామివారి
మృత్తిక కలిపి త్రాగమని చెప్పారు.
ఉదయం పదకొండు గంటలవరకు మామూలుగానే ఉన్నారు. సోఫాలో మేము పెట్టిన శ్రీసాయిబాబావారి ఫొటోనుండి మంచి పరిమళం వ్యాపించడం మొదలయింది.
అప్పుడు
నాభర్తకి ఛాతీలో కొంచెం నెప్పి వచ్చి ఊపిరందక బాధపడసాగారు. ఆయన కాళ్ళు తిమ్మిరెక్కాయి. మెదడుకి రక్త సరఫరా తగినంతగా జరగటంలేదు. తల తిరగడం ఇంకా కొన్ని హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించాయి.
ఉదయం
గం.11.30 ని.కి స్పృహ కోల్పోయారు. ఒక గంట తరవాత
స్పృహలోకి వచ్చారు. కాని విపరీతమయిన ఛాతీ నొప్పితో
బాధపడసాగారు. ఆయనని ఆస్పత్రిలో చేర్పిద్దామనుకున్నాము. అక్కడయితే సరైన వైద్యం జరుగుతుంది, నెప్పికూడా తగ్గుతుందని
ఆలోచించాము. కాని నాభర్త ఆస్పత్రికి వెళ్ళడానికి
ఒప్పుకోలేదు. అప్పుడు మాకు బాబా చెప్పిన సలహా
గుర్తుకు వచ్చింది. గ్లాసెడు పాలలో విభూతి,
మంత్రాలయ రాఘవేంద్రస్వామివారి మృత్తిక చిటికెడు కలిపి మావారిని త్రాగమని చెప్పారు బాబా. నేను ఆవిధంగానే పాలలో కలిపి మావారికి ఇచ్చాను.
నేను మావారి ఛాతీమీద బాబా ఊదీని రాస్తూ బాబాని ప్రార్ధించసాగాను. మాకు ధైర్యాన్నివడానికి సాయి బందువులు శ్రీ వి.నారాయణరావుగారు, శ్రీ లక్ష్మణరావుగారు, శ్రీ అదృష్టరావుగారు మాతోనే ఉన్నారు. వారు కూడా బాబాని ప్రార్ధించారు.
నేను మావారి ఛాతీమీద బాబా ఊదీని రాస్తూ బాబాని ప్రార్ధించసాగాను. మాకు ధైర్యాన్నివడానికి సాయి బందువులు శ్రీ వి.నారాయణరావుగారు, శ్రీ లక్ష్మణరావుగారు, శ్రీ అదృష్టరావుగారు మాతోనే ఉన్నారు. వారు కూడా బాబాని ప్రార్ధించారు.
సాయంత్రం
గం.6.30 ని.కు నాభర్తకు కాస్త నిద్రపట్టింది.
7 గంటలకి బాబా నాభర్తకు కలలో కనిపించి “క్రితంసారి నేను నిన్ను షిరిడీకి రమ్మని
చెప్పాను. కాని నువ్వు రాలేదు. అందుకే నీకీ
శిక్ష” అన్నారు. వెంటనే నాభర్త నిద్రనుండి
లేచి "బాబా తప్పకుండా షిరిడీ వచ్చి నీదర్శనం చేసుకుంటాను" అన్నారు. అలా అన్నవెంటనే ఆయన ఛాతీనొప్పి తగ్గిపోయింది. బాబా ఆజ్ఞాపించిన ప్రకారం మేము ప్రతిరెండు నెలలకు
ఒకసారి షిరిడీ వెడుతున్నాము. ఒకోసారి నెలకు
ఒకసారి కూడా వెడుతూ ఉన్నాము.
ఈసారి
మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఫోన్ చేసి తను ఆగస్టు మొదటి వారంలో గుంటూరునుంచి హైదరాబాద్
వస్తున్నానని తనొచ్చేవరకు మమ్మల్ని ఆగమని చెప్పాడు. అందరం కలిసి షిరిడీ వెడదామని అన్నాడు. దానివల్ల జూలై నెలలో వెళ్ళవలసిన మా షిరిడీ యాత్ర
ఆగస్టు నెలకి వాయిదాపడింది. దానివల్ల బాబా
ఆయనకు వేసినశిక్షకి మేము చాలా ఆశ్చర్యపడ్డాము.
మావారికి వచ్చిన ఛాతీనెప్పికి కారణమేమిటోనని మేము చాలా వ్యాకులత పడుతుంటే, అది
బాబావారు విధించిన శిక్ష అని అర్ధమయింది.
2) ఈ సంఘటన జరిగిన వెంటనే నాభర్త, శ్రీ వి.నారాయణరావుగారు,
శ్రీఅదృష్టరావుగార్లతో కలిసి షిరిడీ వెళ్ళారు.
షిరిడీలో గురుస్ఠాన్ దగ్గర సంస్ఠాన్ వారి గెస్ట్ హౌస్ లో రూము తీసుకున్నారు. మరుసటిరోజు రాత్రి 8 గంటలకు వారు భోజనానికి బయలుదేరబోతుండగా
ఒక తెల్లని కుక్క వారి గదిలోకి ప్రవేశించింది.
“స్వామీ, రండి. మీకు తినడానికి ఏదయినా పెడదామనుకున్నా, మాదగ్గర ఏమీలేదు” అని శ్రీఅదృష్టరావుగారు అంటూ ఉండగానే ఆకుక్క బాబావారి పవిత్రమయిన ప్రసాదం ఉంచిన బల్ల దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అదృష్టరావుగారు బాబాకు నైవేద్యం పెట్టిన ఆప్రసాదాన్ని తన అరచేతులలో ఉంచుకుని కుక్కకు తినిపించారు. ఆతరువాత నారాయణరావుగారు పంచదార, స్వీట్ కార్న్ ఆకుక్కకి తినిపించారు. తినడం అయిపోయినా ఆకుక్క గదినుంచి వెళ్ళిపోకుండా అక్కడే ఉంది. నాభర్త మంచం మీద కూర్చుని జరుగుతున్నదంతా గమనిస్తూ ఉన్నారు. ఆయన తన భాగం ప్రసాదాన్ని నారాయణరావుగారికిచ్చి కుక్కకు తినిపించమని చెప్పారు. నారాయణరావుగారు నాభర్త వాటా ప్రసాదాన్ని ఆకుక్కకు తినిపించబోయారు. కాని అది చిన్నముక్క కూడా తినకుండా రెండుకాళ్ళమీద కూర్చుని నాభర్త వైపే తదేకంగా చూస్తూ కూర్చుంది.
“నీకంత పొగరుగా ఉందా? మంచం మీదనుంచి దిగి బాబా ప్రసాదాన్ని నాకు పెట్టు” అని అంటున్నట్లుగా అనిపించింది నాభర్తకు.
అప్పుడు శ్రీ నారాయణరావుగారు, “మీరు మంచం దిగండి. మీచేతులతో స్వయంగా మీరే తినిపించండి” అని నాభర్తతో అన్నారు. నాభర్త ఆయన చెప్పినట్లే చేసారు. ఆకుక్క కొంచెం ప్రసాదాన్ని మిగిల్చి, మిగిలినది తినేసింది. గిన్నెలో ఉన్న నీటిని కూడా త్రాగింది. ముగ్గురూ కూడా ఆకుక్క ప్రక్కనే కూర్చుని దాన్ని నిమురుతూ ఉన్నారు. అది నిద్రపోయింది. ఆకుక్కకి నిద్రాభంగమవుతుందని, వారికి ఆకలి వేస్తున్నా భోజనానికి వెళ్ళకుండా గదిలోనే ఉండిపోయారు. ఒక గంటగడిచినా అది కదలలేదు. అపుడు వారికి బాబాయే ఆకుక్క రూపంలో వచ్చారనే భావన కలిగింది. బాబా తినగా మిగిలిన ప్రసాదాన్ని, ఆయన త్రాగగా మిగిలిన నీటిని తీర్ధంగా స్వీకరిద్దామని అందరూ అనుకుని ఆవిధంగానే చేసారు. వారు అలా తీసుకోగానే ఆకుక్క గదిలోనుంచి బయటకు వెళ్ళడానికి లేచింది. నాభర్త అది వెళ్ళడానికి గది తలుపులు తెరిచారు. ఆ కుక్క వెనకాలే నాభర్త, అనుసరిస్తూ వెళ్ళారు. అది బయటకు వెళ్ళి కుడివైపు తిరిగింది. అది బయటకు వెళ్లగానే ఒక్క సెకనులోపులోనే అది అదృశ్యమయింది. అది ఎక్కడికో వెళ్ళి అదృశ్యమవడానికి దారిలేదు. అక్కడంతా టాయిలెట్స్ ఉన్నాయి. బయటకు వెళ్ళే దారి లేదు. అందరూ ఎడమవైపుకు వెళ్ళారు. అక్కడ అన్నీ గదులు ఉన్నాయి. గదులన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి. అటువంటప్పుడు ఆకుక్క ఏగదిలోకీ వెళ్ళే అవకాశమే లేదు. ముగ్గురూ మూడు వైపులకి వెతకడానికి వెళ్ళారు. కిందకి మెట్లు దిగి వెళ్లారు. కాని ఆకుక్క ఎక్కడా కనిపించలేదు. అది తప్పిపోయిన లేక మాములుగా తిరిగే కుక్కయినా అది ఒక్క క్షణంలోనే అదృశ్యమవడానికి ఆస్కారం లేదు. కారణం వారు ముగ్గురూ దాని వెనుకనే దగ్గరగా అనుసరిస్తూ వచ్చారు. అందువల్ల బాబాయే ఆరూపంలో వచ్చారని ప్రగాఢంగా నమ్మారు. బాబా ఆరూపంలో తమకు దర్శనం ఇచ్చినందుకు వారెంతో సంతోషంతో పొంగిపోయారు. శ్రీసాయి వారిని షిరిడీకి రప్పించి, ఒక కుక్క రూపంలో దర్శనమిచ్చారు. వారిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి వారిని అనుగ్రహించారు.
ఆతరువాత
మూడు రోజులు వారు ఆకుక్క కోసం ఎంతగానో వెదికారు.
కాని ఫలితం కనపడలేదు. బాబాయే ఆరూపంలో
వచ్చారని గ్రహించినా, మరలా ఆకుక్క కోసం వెదకటమంటె అది మనిషి బలహీనత తప్ప మరేమీకాదు.
రాత్రి
జరిగిన సంఘటనకు శ్రీశివనేశన్ స్వామీజీగారికి చెప్పి తమ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని,
మరుసటిరోజు ఆయన వద్దకు వెళ్ళారు
ఆయన
వద్దకు వెళ్ళి వారు నోరు తెరచి విషయం చెప్పకముందే స్వామీజీకి వారి అనుభవం గురించి,
వారెందుకని తన దగ్గరకు వచ్చారో అంతా అర్ధం చేసుకున్నారు. ఆయన తన అనుభవాన్ని ఈ విధంగా వివరించారు.
“నేను
షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజులలో విపరీతమయిన ఆస్త్మాతో బాధపడుతూ ఉండేవాడిని. సాయి మందిరంలోనే పడుకుంటు ఉండేవాడిని. శరీరానికంతా చర్మవ్యాధి సోకి ఉన్న కుక్క ఒకటి వచ్చి
మూడురోజులపాటు నాదగ్గరగా నాప్రక్కమీదే పడుకుంటూ ఉండేది. నాలుగవరోజున నాకు ఆస్త్మా మరీ ఎక్కువయి ఊపిరి కూడా
పీల్చలేక బాగా కష్టమయింది. ఆకుక్క నావొడిలో
పడుకొంది. అది అలా పడుకోవడంతో నాకు చాలా చిరాకు
వేసింది. “ప్రతిరోజూ నాదగ్గరకు వస్తున్నావు. నాకున్న ఈ జబ్బుకి తోడు నీవంటిమీద ఉన్న పురుగులు
కూడా నాగడ్డం వెంట్రుకలలోకి, నాజుట్టులోకి వ్యాపిస్తె వాటిని వదిలించుకోవడం నాకు చాలా కష్టమవుతుంది" అని అన్నాను.
ఈ
విధంగా అంటు నా వళ్ళోంచి ఆకుక్కని విసిరేసాను .
అదిపైకి ఎగిరి అదృశ్యమయిపోయింది. అప్పుడు
నిలువెత్తులో శ్రీసాయిబాబా సాక్షాత్కరించారు.
ఆవిధంగా దర్శనమిచ్చి అదృశ్యమయిపోయారు.
ఆవిధంగా శ్రీసాయిబాబా దర్శనమయిన తరువాత నా ఆస్త్మావ్యాధి తగ్గిపోయింది. నా వ్యాధిని నివారించడానికి సాయిబాబా ఆకుక్క రూపంలో వచ్చారనే నమ్మకం బలంగా కలిగింది. నావళ్ళోంచి ఆకుక్కని త్రోసేసినందుకు ఎంతగానో విచారించాను. నా అజ్ఞానానికి సిగ్గుపడ్డాను. నాఆస్త్మా వ్యాధి పూర్తిగా నివారణయింది. మరలా ఇంతవరకు ఆ రోగ ఛాయలే కనపడలేదు.”
ఆవిధంగా శ్రీసాయిబాబా దర్శనమయిన తరువాత నా ఆస్త్మావ్యాధి తగ్గిపోయింది. నా వ్యాధిని నివారించడానికి సాయిబాబా ఆకుక్క రూపంలో వచ్చారనే నమ్మకం బలంగా కలిగింది. నావళ్ళోంచి ఆకుక్కని త్రోసేసినందుకు ఎంతగానో విచారించాను. నా అజ్ఞానానికి సిగ్గుపడ్డాను. నాఆస్త్మా వ్యాధి పూర్తిగా నివారణయింది. మరలా ఇంతవరకు ఆ రోగ ఛాయలే కనపడలేదు.”
గత
మూడు సంవత్వరాలుగా మేమాయనను కలుసుకుంటున్నా గాని ఇంతకు ముందెప్పుడు శ్రీశివనేశన్ స్వామీజీ
గారు తన అనుభవాలని ఎప్పుడూ చెప్పలేదు. గతరాత్రి
కుక్క రూపంలో గదిలోకి వచ్చినది సాయిబాబాయే అని శ్రీస్వామీజీ చెప్పారు.
తిరుగు
ప్రయాణంలో షిరిడీనుంచి హైదరాబాదుకు రైలులో
వస్తున్నపుడు, శ్రీసాయిబాబా అదృష్టరావుగారికి దర్శనమిచ్చి కుక్క రూపంలో వచ్చినది తానేనని
చెప్పారు బాబా.
(దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఎంతటి అంకిత భక్తుడయినా బాబా ఆజ్ఞను జవదాటితే శిక్షను అనుభవించవలసినదే...ఎంతటి భక్తుడయినా గర్వం పనికిరాదు, అహంకారం ఉండకూడదు. భగవంతునికి వినయవిధేయతలతో మెలగుతూ ఉండాలి.)
(రేపటి సంచికలో శ్రీ ఉమామహేశ్వరరావుగారు తిలకించిన అనసూయ మాత అద్భుత లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో శ్రీ ఉమామహేశ్వరరావుగారు తిలకించిన అనసూయ మాత అద్భుత లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment