28.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి
బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
శ్రీసాయి పుష్పగిరి
– ఆధ్యాత్మికం – 11వ.భాగమ్
15.04.2011
101. మనస్సుకు ప్రశాంతత కావాలని కోరుకునేవారు ఏకాంతవాసములో భగవంతుని పూజలు చేస్తారు.
ఈ ఏకాంతవాసంలో ఎటువంటి పూజా విధానం చేయాలనేది ఆ భక్తుడే నిర్ణయించుకోవాలి.
28.04.2011
102. ఆకాశ గంగ పరమశివుని జటాజూటములో మొదటి మజిలీ చేసి
ఆతరవాతే భూమిపై ప్రవహించింది. మన
బాబా పరమశివుని అంశము. అందుచేత
మేఘుడు ఆయన శిరస్సుపై బిందెతో
నీరు పోసినా శిరస్సు మాత్రమే తడిసినది. శరీరము
తడవలేదు.
సాయిబానిస




