Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 14, 2020

సర్వాంతర్యామి

0 comments Posted by tyagaraju on 3:44 AM





14.11.2020  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

దీపావళి శుభాకాంక్షలు


ఈ రోజు ఒక చిన్న లీల ప్రచురిస్తున్నాను.  బాబా వారు దేహధారిగా ఉన్న రోజులలో చూపించిన అధ్బుతమయిన చమత్కారమ్.  తాను షిరిడీలోనే కాదు సర్వాంతర్యామిననే విషయాన్ని ఋజువు చేస్తూ చూపించిన అధ్భుతమయిన లీల. 

షిరిడీసాయి ట్రస్ట్. ఆర్గ్.  నుండి గ్రహింపబడినది….

తెలుగు అనువాదమ్ ..  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట

సర్వాంతర్యామి

కాకాసాహెబ్ సోదరుడు రాజారామ్ దీక్షిత్ నాగపూర్ లో నివాసం ఉంటున్నారు.  వృధ్ధాప్యం వల్ల ఆయనకు ఆరోగ్యం క్షీణించింది.  ఆసమయంలో కాకాసాహెబ్ షిరిడీలో ఉన్నాడు.  అందుచేత రాజారామ్ తన ఆరోగ్యం గురించి తెలుపుతూ కాకాసాహెబ్ కు ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరం చివరలో “ ఇటువంటి విపత్కర పరిస్థితిలో నువ్వు నాగపూర్ లోనే ఉన్నట్లయితే నాకెంతో సహాయంగా ఉండేవాడివి.  అందుచేత ఈ ఉత్తరం అందినవెంటనే షిరిడినుంచి బయలుదేరి రా”  అని రాసారు.

Thursday, November 12, 2020

మనసులోని కోరికలను తీర్చిన బాబా...

0 comments Posted by tyagaraju on 4:28 AM

                        

                            (శాన్ జోస్ లోని బాబా మందిరమ్)

                  (BABA MANDIR AT SAN JOSE U S A)

12.11.2020 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

 మనసులోని కోరికలను తీర్చిన బాబా...

ఈ రోజు అధ్భుతమయిన రెండు లీలలను ప్రచురిస్తున్నాను.  ఒకటి అమెరికానుండి సాయి బంధు శ్రీ సుబ్రహ్మణ్యంగారు పంపించారు.  మరొకటి చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణిగారు పంపించారు.  రెండూ అధ్బుతమయిన బాబా లీలలు.  ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యంగారు ఆంగ్లంలో  పంపించినదానికి తెలుగు అనువాదమ్…

(Experience of Sai Devotee Sri Subrahmanyam gaaru from 

  U S A)

రెండువారాల క్రితం నాకు శ్రీ సాయి సత్ చరిత్రలోని 38వ.అధ్యాయాన్ని (బాబా గారి వంటపాత్ర) పారాయణకు కేటాయించారు.  నాపారాయణ పూర్తవగానే ఆ అధ్యాయానికి అనుగుణంగా ఉండే బాబా చిత్రంతో కూడిన సందేశాన్ని కూడా పెడుతూ పారాయణ గ్రూపులో పోస్ట్ చేస్తూ ఉంటాను.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago