20.03.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి
సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు.
సాయి ప్రేరణ అన్ని అథ్యాయాలు ఒక్కరోజులోనే పోస్ట్ చేయడానికి సాథ్య పడకపోయినా రెండు రోజులలోనే పోస్ట్ చేయడం అంతా బాబా వారి అశీర్వాదం.
అంతా పోస్ట్ చేయలేమోనని సందేహించి, వేరే బాబా లీలలు పోస్ట్ చేద్దామని 4 లైన్లు టైపు చేసి మరలా విరమించాను. అలా రెండు సార్లు జరిగింది. మొదట 4 అథ్యాయాలూ 10 రోజుల క్రితమే తయారు చేసుకుని వుంచుకున్నవి పోస్ట్ చేయడం జరిగింది. మిగతా అథ్యాయాలు బాబా ఆశీర్వాదంతో వెనువెంటనే మరునాడు పోస్ట్ చేశాను.
ఈ సాయి ప్రేరణ లో మనం చదువుకున్నవి అన్నీ కూడ ఆణి ముత్యాలు. ఆచరణలో పెట్టడానికి చాలా సరళంగా ఉన్నాయి.
మనకి రత్నాలూ, మాణిక్యాలూ దొరికాయనుకోండి, మనం ఏ చేస్తాము? వాటిని భద్రంగా దాచుకుంటాము. ఇక్కడ మనలో చాలా స్వార్థం కూడా ప్రవేశిస్తుంది. అంటే అదంతా మన సొత్తు. యెవరికి వాటి మీద అథికారం లేదు అనే భావన మనలో ప్రవేశించి, ఆఖరికి మన స్వజనానికి కూడా, అందులో భాగం ఇవ్వడానికి మనసొప్పదు.
కాని ఈ సాయి ప్రేరణలోని విలువ కట్టలేని ఆణి ముత్యాలని మనం అందరితో పంచుకోవచ్చు. యెంతమందితో పంచుకున్నా
యెప్పటికి తరగని ఆస్తి. మనం యెంత మందికి పంచి ఇచ్చినా కూడా మన మనసులో ఈ ఆణిముత్యాలు రోజు రోజుకీ ప్రకాశిస్తూనే ఉంటాయి.
తరువాతి కాంప్: బెంగళూరు. బాబా లీలలు ప్రతిరోజూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment