23.04.2011 శనివారము
బాబా తో అనుబంథము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయిసాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీశ్శులు
గత రెండు రోజులుగా బాబా గురించిన లీలలు యేమి ఇవ్వడానికి సాథ్య పడలేదు. ఈ రోజు ఒక బాబా లీలను గురించి తెలుసుకుందాము.
ఈ రోజు మనము ఒక సాయి భక్తురాలి జీవితంలోకి బాబా గారు యెలా ప్రవేశించారో తెలుసుకుందాము. ఈ లీలని నెల్లూరు నించి సుకన్యగారు సేకరించి పంపించారు.
ఈ లీలని ఆ భక్తురాలి మాటలలోనే తెలుసుకుందాము.
బాబా గారు నా జీవితంలొ అన్ని విథాలుగా, ప్రతి క్షణం ప్రతిరోజూ సహాయపడుతున్నారు. మా అమ్మగారు ప్రతి గురువారమునాడు సాయిబాబా సత్సంగానికి వెడుతూ ఉండేవారు. మూడు సంవత్సరాలుగా కాలినడకన 45 నిమిషాలు నడిచి వెడుతూ ఉండేవారు. తరువాత మేము బాబా అనుగ్రహంతో సత్సంగానికి దగ్గిరలోనున్న ప్రాతంలో ఇల్లు కట్టుకున్నాము. తరువాత నేను మా అమ్మగారితో నెలకు ఒకసారి సాయిబాబాను దర్శించుకుంటు ఉండేదాన్ని. అప్పుడు నాకు బాబా మీద అంత నమ్మకం ఉండేది కాదు. ఒకానొక సమయంలో మేము చాలా కష్టాలనుభవించాము.నా సోదరుడికి బీ.టెక్. ఆయిన 2 సంవత్సరముల వరకు ఉద్యోగం లేదు. నేను కాంపస్ యింటర్వ్యుస్ లొ సెలక్ట్ అవలేదు. ఆ సమయంలో మేమంత స్థితిపరులం కాదు. బాబా దయ వల్ల నా సోదరుడికి ఉద్యోగం వచ్చింది.
కాలేజీ చివరి రోజున మా లెక్చరర్స్ లో ఒకరు మా నాన్నగారి మొబైల్ నంబరు అడగ్గా నేను ఇచ్చాను.
ఆయన ఫోన్ చేసి మాయింటికి వచ్చారు. ఆయన, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన సోదరునికి వివాహం చేయటానికి మంచి కుటుంబంలోని అమ్మాయికోసం వెతుకుతున్నామని, ఆస్తి విషయంలో పట్టింపు లేదని చెప్పారు. ఒక గురువారమునాడు వారంతా, అమెరికాలో ఉంటున్న అబ్బాయితో సహా మాయింటికి వచ్చారు. మా తల్లితండ్రులు, బంథువులు అందరూ కూడా ప్రొపోజల్కి ఒప్పుకున్నారు. ఆదివారమునాడు మాయింటికి ఒక వ్యక్తి వచ్చి తను షిరిడీ నుంచి వస్తున్నానని చెప్పాడు. ఆవ్యక్తి మా జీవితంలో జరిగిన సంఘటనలన్ని చెప్పాడు. అవన్నీ కూడా నిజాలే. మా అమ్మగారు ఆవ్యక్తిని ఈ పెళ్ళి సంబంథం గురించి అడిగారు. అతను ఈ పెళ్ళి జరుగుంతుందని చెప్పాడు. అతను రుద్రాక్ష, సాయిబాబా డాలరు ఇచ్చాడు. నాకు వివాహం జరిగింది. అతను సాయిబాబా అని నేను అనుకోలేదు. నేను 2008 లొ అమెరికాకి వచ్చాను. 2 నెలల తరువాత రెసిషన్ సమయంలో నా భర్తకి ప్రాజెక్ట్ అయిపోయింది. తనకి మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే పారాయణ చేస్తానని బాబాని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదంతో ఒక వారం రోజులలో మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చింది. మొట్టమొదటిసారిగా నేను పారాయణ చేశాను. అప్పుడు నేను మెల్లగా బాబాకి దగ్గరయ్యాను. మేము భగవద్గీత తరగతులకి కూడా వెడుతూ ఉండేవారము. అవై నా ఆథ్యాత్మిక చింతనని అభివృథ్థి చేయడానికి దోహదపడ్డాయి. యింకొక ముఖ్య విషయమేమంటే మంచి సంఘటనలన్నీకూడా గురువారమునాడే జరిగాయి. మాయింటికి వచ్చి రుద్రాక్ష, సైబాబా దాలరు ఇచ్చిన వ్యక్తి బాబాయే అని తెలుసుకున్నాను.నేను చాలా సంతోషించాను. బాబా మెల్లిగా నన్ను తనవైపుకు తిప్పుకున్నారు. నాకింకా సంతానం లేదు. నాకు సాయినాథ్ మీద పూర్తి నమ్మకం యేర్పడింది. నేను 3 వారాలు సఛ్ఛరిత్ర పారాయణ చేస్తున్నాను. తొందరలోనే ఆయన నాకు సంతానాన్ని ప్రసాదిస్తారు. సాయినాథ్ నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతినిమిషం,ప్రతిక్షణం ఉన్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment