ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్శులు
25.04.2011 సోమవారము
మీకోరికలు సిథ్థించడానికి సాయిబాబా
లిఖిత నామ జపం చేయండి
లిఖిత నామ జపం అంటే మనకందరకు తెలుసు. మన ఇష్టదైవముయొక్క నామాన్ని, రాముడు కానివ్వండి, శివుడు కానివ్వండి, బాబా కానివ్వండి, వారి నామాన్ని మనం ఒక పుస్తకంలో వేయి సార్లుగాని, లక్ష సార్లు గాని, కోటి సార్లు గాని రాయడం. అదే మనం రాసే రామకోటి, శివకోటి, సాయికోటి.
మరి యివన్ని తెలుసున్నవేకదండీ, కొత్తగా మీరు యిందులో చెప్పేదేముంది, మేము తెలుసుకునేదేముంది అని అనుకోకండి. మనమందరము ముందర రామ కోటి గాని, సాయికోటి గాని పుస్తకాలు చూడగానే యెంతో ఉత్సాహంతో రాసేద్దామని ప్రయత్నిస్తాము. పట్టుదలగా ప్రయత్నించి పూర్తిచేసేవారు కొందరైతే, మథ్యలో అసంపూర్తిగా వదిలివేసేవారు కొందరు. అందుచేత ప్రియంకాగారు చెప్పిన పథ్థతి లొ రాయడానికి ప్రయత్నిద్దాము.
మనం యే భగవంతుని నామాన్ని రాసినా యెంతో భక్తితో రాయాలి. అది ఒక పేజీ కావచ్చు, లేదా ఒక లైను మాత్రమే కావచ్చు. కాని రాసేటప్పుడు మాత్రం దానిమీదే మనసు లగ్నం చేసి రాయాలి. తొందరగా లక్ష పుర్తిచేసేద్దాము, లేక కోటి పుర్తి చేసేద్దాము అని తొందర తొందరగా రాయకూడదు. లేక యితరుల మెప్పుకోసం, అబ్బ ఈయన యెంత తొందరగా లక్ష పూర్తి చేశాడు, కోటి పూర్తిచేశాడు అని అనుకునేందుకు కాదు మనం రాసేది.
సాయి నామాన్ని మనం రాసేటప్పుడు ఆయనకు ముందుగా భక్తితో నమస్కరించండి. విఘ్నం లేకుండా పూర్తి కానిమ్మని విఘ్నేశరుడికి కూడా నమస్కరించండి. మీకోరిక యేమిటొ మీరు ముందుగా రాయడానికి పెట్టుకున్న పుస్తకంలో రాయండి. దీని కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజులో యెంత సమయం వ్యర్థంగా గడుపుతున్నామో. దానిలో కనీసం ఒక 15 నిమిషాలు వెచ్చించలేమా? వార్తా పత్రిక చదవడానికి యెంత సమయం కేటాయిస్తున్నాము. అందులో మనకి ఉపయోగించే విషయాలు చాలా తక్కువ. యెందుకంటే రాజకీయాలు మనకు వద్దు. టీ.వీ చూడటానికి యెంత సమయం కేటాయిస్తున్నాము? పనికిరాని కబుర్లకి యెంత సమయం కేటాయిస్తున్నాము. ఆలోచించి చూస్తే ఒక 15 నిమిషాలు మనం సాయి నామ లిఖిత జపం చేయగలము.
మనము యేపని చేసినా సరే చాలా శ్రథ్థతో, ఆ పనిమీదే మనసు లగ్నం చేసి చేయాలి. ఆఖరికి మనం భోజనం చేసున్నప్పుడు కూడా మనసు దానిమీదే లగ్నం చేయాలి. అంటే ఊరికే కబుర్లు చెపుతూనో లేదా టీ.వీ. చూస్తునో కాదు. నేను ఒక పుస్తకంలో చదివాను. జెన్ సన్యాసులు ఉంటారు. (వీరు బుథ్థుని బోథనలను అనుసరిస్తూ ఉంటారు). ఒకసారి ఒక హోటల్ నడిపే వ్యక్తి జెన్ సన్యాసులని కలుసుకోవాలనుకున్నాడట. వారు ప్రత్యేకంగా యెటువంటి దుస్తులను థరించరట. అందుచేత తన హోటలికి వచ్చేవారినందరిని పరిశీలిస్తూ ఉండేవాడట. ఒకరోజు ఇద్దరు జెన్ సన్యాసులు వచ్చి టీ తాగుతుండగా హోటలు యజమాని వారిని కలుసుకోవడం యెంతో సంతోషంగా ఉందని చెప్పాడట. అప్పుడు ఆ సన్యాసులు మమ్మలిని యెలా గుర్తుపట్టారు అని అడగ్గా, మీరు టీ తాగే విథానం చూసి గుర్తు పట్టానని చెప్పాడట. అంటే వారు టీ కప్పు రెండు చేతులతో పట్టుకుని పవిత్రంగా దాని మీదే దృష్టి పెట్టి తాగుతారట. చూశారా, టీ తాగడం కూడా యెంతో పవిత్రంగా దానిమీదే మనసు లగ్నం చేసి ఆస్వాదిస్తారు. కాని మనం యేమి చేస్తున్నామో అలోచించండి.
అందుచేత కనీసం మనం ఈ లిఖిత నామ జపాన్నైనా యెంతో పవిత్రంగానూ, శ్రథ్థగానూ చేద్దాము.
ఈ రోజు మనము సాయి నామ లిఖిత జపం గురించి తెలుసుకుందాము. ఈ పథ్థతిని శ్రీమతి ఫ్రియంకా రౌతేలా గారు తమ ఆంగ్ల బ్లాగులో పోస్ట్ చేయడం జరిగింది. దానిని యథాతథంగా మీకు అందిస్తున్నాను.
చాలా సార్లు భక్తులందరూ బాబాని యేవిథంగా సంతోషపెట్టాలి, దానికోసం ప్రత్యేకమైన పూజా విథానం యేమైనా ఉంటే సలహా ఇమ్మని నాకు మైల్స్ ఇస్తూ ఉంటారు. నేను వారికి సమథానాలు ఇస్తూ ఉంటాను. కాని ఇదే విషయం మీద నేను ఈ బ్లాగులో పోస్ట్ చేద్దామనుకుంటున్నాను.
నేను వ్యక్తిగతంగా నమ్మేదేమిటంటే, జీవితంలో మన ప్రవర్తన థర్మంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాము, మన సాయి కూడా సంతోషిస్తారు, యెందుకంటే సత్యవంతమైన జీవితం గడపటమే మన సాయికి ఇచ్చే మంచి బహుమతి. కనీసం మానవత్వంతో ఉండి బాబా ముందు చేతనయినంతగా సక్రమమంగా జీవించాలి.
ప్రార్థించడానికి కొన్ని పథ్థతుల్లో నేను అనుసరించేవి యెప్పుడు మంచి సత్ఫలితాలిస్తున్నాయి. వాటిని నేను ఒకటొకటిగా పోస్ట్ చేస్తాను. ఈ రోజు నేను షిరిడి సాయిబాబావారి లిఖిత నామ జపం యొక్క శక్తి తో ప్రారంభిస్తాను.
ఈ ప్రపంచంలో మనకి యేది చేద్దామనుకున్న, యేమి చేయాలనుకున్న చాలా సమయం ఉంటుంది గాని, ఒక్క నిమిషం కూడా బాబా పూజకి గాని, కనీసం దీపం వెలిగించడానికి గాని సమయాన్ని కేటాయించలేకపోతున్నాము. జీవితంలో ఇది చాలా పెద్ద తప్పు. మెల్ల మెల్లగ పూజ దగ్గిరకి వచ్చేటప్పటికి మనం బథ్థకస్తులుగా మారిపోతూంటాము. కాని మనం కష్టాలలో బాథలలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి విషయాన్ని మర్చిపోయి, బాబా ముందు గంటలతరబడి పూజలు, వ్రతాలు చేసేస్తూ ఉంటాము. మనం సాయిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నామా? నిజంగా మనం అల్లా చేయగలమని అనుకుంటున్నారా? లేదు.
నేను అసలెప్పుడూ ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేయలేదని కాదు, కాని నేను వాటినుంచి నేర్చుకున్నాను, అందుకనే నేను చేసే పూజకి ఒక పథ్థతికి అలవాటుపడిపోయాను. సాయి పూజకి గంటల తరబడి సమయం కేటాయించమని నేను చెప్పటల్లేదు, కాని మనం వేరే పథ్థతిలో యెక్కువ సమయం కేటాయించకుండానే పూజ చేయవచ్చు, అది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది.
నేను మీకిప్పుడు సాయి లిఖిత జపం యెలా చేయాలో చెపుతాను. దాని పేరుకు తగినట్టుగానే, మీరు బాబా పేరుని ఒక నోట్ పుస్తకంలో రాయాలి. ఒక ప్రత్యేకమైన విషయం మీద బాబా గారు నేను చెప్పేది వినాలనుకున్నప్పుడల్లా, ఒక నోట్ పుస్తకంలో ఆ కోరికను రాసి అదె పుస్తకంలో బాబా నామాన్ని రాస్తూ ఉంటాను. నేను రాసేది అంతే. దీని వల్ల నా దైనందిన జీవితానికి యెటువంటి ఆటంకము ఉండదు. ఒక్కొక్కసారి రోజుకి రెండు పేజీలు, ఒకోసారి 21 లైనులే రాస్తూ ఉంటాను. ఇందులో నియమ నిబంథనలేమీ లేవు.
కాని ఇది మట్టుకు నేను క్రమం తప్పకుండా రాస్తూ ఉంటాను.
నా ఉద్దేశ్యం ప్రకారం మన పనులన్నీ అయిపోయాక రాత్రి కూర్చుని రాస్తే యేకాగ్రతగా రాయచ్చు.
అప్పుడప్పుడు నేను రాత్రి 2 గంటల సమయంలో రాస్తూ ఉంటాను. యెందుకంటే నాకు పగలంతా నా యింటిపనులతోనే సరిపోతుంది. పనులన్ని అయినతరువాత రాత్రి సమయమే నా బ్లాగు పనికి, నామ జపం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నేను నామ జపం యెలా చేస్తానో పైన ఇచ్చిన చిత్రంలో చూడండి. ఈ విథంగా చేసే ప్రత్యేకమైన ప్రార్థన సత్ఫలితాలనిచ్చింది. మీరు కూడా మీరు చేసే మంచి పనులతో పాటు ఈ పథ్థతిని ఆచరిస్తారని నాకు తెలుసు. ఇది మీకు మంచి సత్ఫలితాలనిస్తుంది. ఇది నేను మీకిచ్చే సలహా.
ఈ రోజునుంచే మీరు దీనిని యెక్కువ శ్రథ్థ, నమ్మకంతో చేయండి. బాబ మిమ్ములనెప్పుడు చెదు మార్గమువైపు వెళ్ళకుండా ఉంచెదరు గాక.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment