***************
మన సమస్య - బాబా జవాబు
ఇప్పుడు నేను చేస్తున్న పోస్టింగ్, గందరగోళంలో ఉన్నప్పుడు, సరియైన నిర్ణయం తీసుకోవడానికి ఉపకరిస్తుంది. మనమందరమూ కూడా కొన్ని విషయాలలో, సమస్యలతో ఉన్నప్పుడు మనకు అనుకూలంగా లేనప్పుడు , (యేది మంచో, యేది చెడో) ఏది యెంచుకోవాలో తెలియని పరిస్తితులలో సందిగ్థావస్థలో ఉంటాము. అటువంటి సందర్భాలలో మనం పెద్దవారి సలహా అడుగుతూ ఉంటాము, స్నేహితులని సంప్రదిస్తాము, లేకపోతే మన సొంత నిర్ణయాలు తీసుకుంటాము. ఇవన్నీ కూడా తప్పుడు పథ్థతులని నేననను. నిజానికి నేను కూడా ఇవన్నీ చేసినవే, కాని కొన్ని సంవత్సరాల క్రితం నించిబాబా ముందర చీటీలు వేయడం ప్రారంభించాను. నేను ఈ పథ్థతిని "బాబాగారి ఆదేశం" అంటాను. ఇది చాలా తేలికైన పథ్థతి, యింకా చెప్పాలంటే సరియైన పథ్థతి కనక మన సందిగ్థాలన్నీ తొలగించుకుని, బాబాగారు ఇచ్చే మంచి నిర్ణయాన్ని యెంచుకోవచ్చు.
పాఠకులారా, నేనెప్పుడైనా వ్యాకులతతో ఉన్నప్పుడు, లేక రెండు విషయాల మథ్య నిర్ణయం తీసుకొవలసినప్పుడు ఈ పథ్థతిని ఉపయోగిస్తూ ఉంటాను. నేను కూడా ఇప్పుడు మీతో మీతో పాలుపంచుకుంటున్నాను. యెవరయితే ఈ పథ్థతిని అవలంబించాలనుకుంటున్నారో ముందుకు సాగచ్చు, యెందుకంటే నా విషయంలో "బాబా గారి ఆదేశం" సరిగ్గా వచ్చింది, యింకా ఫలితం కనిపించింది కూడా.
కాని, మీరిది ప్రారంభించేముందు మీకు నేను మూడు విషయాల గురించి వివరించనివ్వండి, ఇవి యెక్కడా కూడా రాయబడలేదు. కాని నేను చాలా సంవత్సరాలు పరీక్షించిన తరువాత ఈ సూత్రాలని తయారు చేశాను. వీటిని ఆచరించాలా వద్దా అన్నది యెవరిష్టం వారిది.
మొదటి సూత్రం:
యెప్పుడూ మీరు తీసిన మొదటి చీటీయే బాబా గారు ఇచ్చే అంతిమ తీర్పు గా భావించండి. ఒకే ప్రశ్నకు యెక్కువ సార్లు చీటీలను తీయవద్దు, యెందుకంటే బాబా గారు తాను యేసమాథానమైతే ఇవ్వదలచుకున్నారో అది మొదటి చీటీలోనే తెలియచేస్తారు.
రెండవ సూత్రం:
ఒక ప్రశ్నకి రెందుకన్న యెక్కువ చీటీలు రాయవద్దు.
ఉదాహరణకి మీరు బాబా ని ఉద్యోగం గురించి ప్రశ్న ఉద్యోగం వస్తుందా రాదా అని అడగదలచుకున్నారనుకోండి అప్పుడు చీటీలను ఈ విథంగా రాయండి.
1.. ఒక చీటీ మీద ఇలా రాయండి :: అవును నీకు ఈ ఉద్యోగం వస్తుంది
2. ఇంకొక చీటీ మీద ఇలా రాయండి :: లేదు నీకు ఈ ఉద్యోగం రాదు
మూడవ సూత్రం :
మీరు వేసిన చీటీలలొ యేదో ఒకటి తీసేముందు, ఆ రెండు చీటీలమీద కొంచెం బాబా ఊదీని చల్లి, బాబా ని సరియైన సమాథానము ఇమ్మని ప్రార్థించండి. నేను చీటీలు తీసేముందు ఈ విథంగా అంటాను.
"" దయా సముద్రుడవైన నా సాయీ, నాకు యేది మంచో యేది చెడొ తెలియదు అందుచేత నువ్వే నాకు మార్గాన్ని చూపించు. కాని నువ్వు యేది నిర్ణయించిన అది నా మంచి కోసమే. దేవ నేను నీ చరణ కమలాల ముందు శరణాగతి చేస్తున్నాను. బాబా నాకు సరియైన మార్గాన్ని చూపించు. సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై, సఛ్ఛె సాయికీ జై, సఛ్ఛె సాయికీ జై.""
ఈ మూడు సూత్రాలని మనసులో పెట్టుకుని బాబా మీద, ఆయన అనంతమైన శక్తిమీద గట్టి నమ్మకం ఉంచుకోండి. బాబా ఆదేశం పొందడానికి ముందుకు సాగండి. ఈ పథ్థతి మీద నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. పాఠకులని కూడా దీనిని ప్రయత్నించమని శిఫారసు చేస్తున్నాను. క్లిష్ట సమయాలలో నించి బయట పడేటందుకు ఇదే మంచి పథ్థతి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, బాబా గారు మీ మంచి కోసం మీ ప్రయోజనం కోసం చీటీ ని తీస్తారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment