27.04.2011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఇంతకు ముందు మనము బాబా ఊదీతో రోగాలు నయం కావడం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనము సాయి చరిత్ర పారాయణ చేయమని బాబాగారే చెప్పిన లీల గురించి ఈ రోజు తెలుసుకుందాము. బాబా లీలలు అనుభవించినవారికే చక్కగ అర్థమౌతాయి.
షిరిడి నివాసి అప్పాజి సుతార్ 1929 సంవత్సరంలో కాలి మీద కురుపు వేసి ఎగ్జిమాతో బాథ పడుతూ కోపర్గావ్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారట. కాని లాభం లేక మాధవరావ్ దేశ్పాండేతో వైద్యం చేయించుకున్నాలాభం లేకపోయిందిట. అప్పుడు నాసిక్ చేరారట. అక్కడకి చేరిన 8 రోజున ఆయనకు కలలో బాబా దర్శనం ఇచ్చి " నువ్వు షిరిడి వెళ్ళి సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఊదీ ని సేవించు" అని చెప్పారట. అప్పాజీ సుతార్ గారు షిరిడీ వెళ్ళారు. అప్పటిదాకా షిరిడీలో సాయి చరిత్ర పారాయణ చేస్తున్న విఠల్రావ్ అనే భక్తుడు, సిరివాల్ అనే చోటికి వెళ్ళాడట. అప్పాజీ సుతార్ షిరిడీ రాగానే అక్కడున్నవారు బాబా చరిత్ర పారాయణ చెయ్యమన్నారట. చూశారా, బాబా గారు కలలో కనపడి చరిత్ర పారాయణ చేయమని చెప్పి, దానికి తగిన యేర్పాటు కూడా ఆయనే చేసి ఉంచారు.
ఆవిథంగా అప్పాజీ గారు యితర గ్రంథాలతోపాటుగా, సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఊదీ రాసుకోగా, ఆయన వ్యాథి వారం రోజులలో తగ్గిందిట. ఆరోగ్యం చేకూరటానికి చరిత్ర పారాయణ చేయడం కూడా వైద్యంగా బాబాగారు తెలియచేశారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment