29.04.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరకు బాబావారి శుభాశీశ్శులు
బాబాతో నా పరిచయం
ఈ రోజు మనము సుకన్య గారు సేకరించి పంపిన ఒక బాబా భక్తురాలు చెప్పిన బాబా లీలను గురించి తెలుసుకుందాము. మనం యింతకు ముందు బాబా గురించి తెలియని వారిని కూడా బాబా గారు ఒక చిన్న లీల లేక అద్భుతం చూపించి, తనకు దగ్గిరగా చేసుకుంటారని, యిక మనం ఆయనని విడిచి పెట్టము అని, తెలుసుకున్నాము. అటువంటిదే ఈ లీల.
యూ.ఎస్. నించి సాయి సిస్టర్ మాయా గారు చెప్పిన బాబా లీల.
నిజానికి మన ప్రియమైన బాబా గారిగురించి నాకు కిందటి సంవత్సరం మథ్యలోనే తెలిసింది. ప్రతి రెండునెలలకు నా భర్తకి కన్ను ఎఱ్ఱగా అవుతూఉండేది. . అటువంటప్పుడు ఆయనకి చాలా బాథగా ఉండేది, ఆఫీసుకు వెళ్ళలేకపోయేవారు, విపరీతమైన్ నొప్పి, వెలుతురు కూడా చూడలేకపోయేవారు. నేను వర్ణించలేను. ఇలా, మా పెళ్ళైన రోజునుంచే జరుగుతూ ఉండేది. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలుగా ఆయన బాథను చూస్తూ, యేడ్చినా, ప్రార్థించినా, యేమీ ఉపయోగం లేకపోయింది.
ఒకరోజున నేను మా అబ్బాయిని స్కూల్ నించి తీసుకురావడానినికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒకావిడ, " నీకు బాబా గారి గురించి తెలుసా, నువ్వు బాబాని యెందుకు ప్రార్థించకూడదు" అని అడిగింది. బాబాని ప్రార్థిస్తే తనకు మనశ్శాంతి లభిస్తుందని చెప్పింది. నేను యింటికి వచ్చి గూగుల్ లొ బాబా గురించి వివరాలన్ని తెలుసుకున్నాను. మొదట్లో నేను సందేహించాను, కాని మా యింటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి ప్రార్థించాను. ఈ లోపున మా ఆయనకి అన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది, కాని బాబా దయ వల్ల వైద్య పరీక్షలన్నీ అనుకూలంగా వచ్చాయి.
నేను బాబా గుడికి వెళ్ళడం మొదలు పెట్టిన తరువాత, నా భర్తకి కొంచెం బాగున్నట్టుగా ఉన్నట్టు అనిపించింది నాకు, ఇప్పటి వరకు తనకి కళ్ళు ఎఱ్ఱ పడటం లక్షణాలు కనిపించలేదు ఒక్కసారి మాత్రం కన్ను ఇరిటేషన్ గా ఉందని చెప్పడం తప్ప. అప్పుడు నాకు భయం వేసింది, బాబాని ప్రార్థించాను, కన్ను ఇరిటేషన్ అలర్జీ వల్ల వచ్చింది, మరునాటికి తగ్గిపోయింది.
బాబాగారు, నన్ను కారు ప్రమాదం నించి కూడా తప్పించారు, ఆయన దయవల్ల పోలీస్ కేసు అవలేదు. అప్పుడు ఒకరోజు సాయి సోదరుడు శిరీష్ ద్వారా ప్రార్థన కోరికని పంపించాను. నేను నా కుటుంబ సభ్యులవల్ల, ప్రియమైనవారి వల్ల నొచ్చుకున్నప్పటికి వారిని రక్షించమని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. మా ఆడపడుచుకి యెన్నాళ్ళయినా పెళ్ళి సంబంథం కుదరలేదు. సాయి సోదరుడు శిరీష్ భక్తులందరి ప్రార్థన కోరికలన్ని 3 రోజులలో షిరిడీ చేరాయన్న సంగతి నేను చదవడం జరిగింది. ఉదయం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భారతదేశం నించి ఫోన్ వచ్చింది, ఆమెకు పెళ్ళి సంబంథం ఒకటి వచ్చిందని దానిని నిశ్చయం చేసుకుంటున్నారని చెప్పారు. బాబా ఆశీర్వాదంతో తను తొందరలోనే జీవితంలో స్థిర పడుతుంది.
ఇంకొక విషయమేమంటే, నాకు బాబాని పరిచయం చేసిన ఆమెకు నా కృతజ్ఞతలు చెపుదామనుకున్నాను కాని యెందుకనో మరచిపోయాను. నేను మా కుటుంబంతో షాపింగ్ కి వెళ్ళాను. అక్కడ షాపులో ఆమెను చూశాను. కాని ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం మరిచాను. మరునాడు నేను వేరే షాపుకి వెళ్ళాను. అక్కడ కూడా ఆమె కనపడింది. అప్పుడూ నేను కృతజ్ఞతలు చెప్పలేదు. మూడవరోజున మేము షాపింగ్ కి వేరే చోటకి వెళ్ళాము అక్కడ కూడా ఆమె కనపడింది. వరుసగా మూడు రోజులుగా నేనామెను యెందుకు చూస్తున్నానో నాకు ఆశ్చర్యం గా ఉంది. యింటికి వస్తూ ఆమె యెందుకు అలా తరచూ నాకు కనపడుతోందని ఆలోచించాను. అప్పుడు గుర్తుకువచ్చింది, బాబా ని పరిచయం చేసిన ఆమెకు కృతజ్ఞతలు చెపుతానని బాబాకి ఇచ్చిన మాట. మరునాడు స్కూల్ వద్ద ఆమెను కలిసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను.
బాబా గారు నాతో ఉన్నారనడానికి, నాకు దగ్గరగా ఉన్నారనడానికి చాలా అనుభవాలున్నాయి. కొన్ని గమనించకుండానే పోతూ ఉంటాయి, కొన్ని మాత్రం నేను ఆలోచించిన తరువాత, అవును నాకు సహాయం చేస్తున్నది బాబాయే అని అనిపుస్తూ ఉంటుంది. కాని తెలిసో తెలియకో ఈ జన్మలో గాని, కిందటి జన్మలో గాని బాబాకి మాత్రమే తెలిసున్న నేను చేసిన నా తప్పులన్నిటిని క్షమించమని నేను సవినయంగా బాబాని వేడుకుంటున్నాను. బాబా ఈ లీలని పోస్ట్ చేయడంలో ఆలశ్యం చేసినందుకు నన్ను మన్నింపు బాబా. నాకింకా కొన్ని సమశ్యలున్నాయి, బాబా దయ వల్ల అవి తొందరలోనే తీరతాయి. బాబా నువ్వెప్పుడూ మాతోనే వుండమని వినయంగా వేడుకొంటున్నాను, మాకు ఈ ప్రాపంచిక అడ్డంకులని నమ్మకంతో, భక్తితో యెదుర్కొనే శక్తిని ప్రసాదించు. మా బుథ్థి నిశ్చలంగా ఉండి మా మనసంతా భక్తితో నిండి చివరికి గమ్యాన్ని చేరేలా చెయ్యి.
మా ప్రియమైన సాయి చరణాలు, మన ప్రియమైన బాబా మనలనందరిని అనుగ్రహించు గాక.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment