షిరిడీలో బాబా లీలలు
01.05.2011 ఆదివారము
షిరిడీలో బాబా లీలలుఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులారందరకు బాబా వారి శుభాశీశ్శులు
ఈ రోజు మనము మరియొక బాబా లీలను తెలుసుకుందాము. బాబా గారు తన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తులు కాకపోయినా యేదోవిథంగా తన లీలను చూపి తనవారిగా చేసుకుంటారు. కాని యెవరికి యెవిథంగా లీలను చూపిస్తారో తెలియదు.
ఈ రోజు బాబా భక్తులైన శ్రీ వెలగలేటి వెంకట వర ప్రసాద రావు గారి యొక్క, షిరిడీలో వారి అనుభవాన్ని వారి మాటలలోనే తెలుసుకుందాము. శ్రీ ప్రసాద రావుగారు మా వియ్యంకుడుగారు. ఆయనది విజయవాడ దగ్గర ఉన్న వెలగలేరు గ్రామం.
" నేను గత 20 సంవత్సరాలనుండి, ప్రతీ సంవత్సరం షిరిడీ వెడుతూ ఉంటాను. షిరిడీ వెళ్ళగానే ముందర థూళి దర్శనం చేసుకోవడం అలవాటు. (థూళి దర్శనం అంటే షిరిడిలో దిగగానే కాళ్ళు కూడా కడుక్కోకుండా బయట నున్న కిటికీలోనించి బాబా ని దర్శించుకోవడం). తరువాత గురుస్థానం లోని వేప చెట్టు చుట్టూరా 18 ప్రదక్షిణాలు చేసి 2, 3 వేపాకులు తినడం అలవాటు. ఈ స్థానంలో బాబా గారు దీపాలను వెలిగించిన చోటుకాబట్టి ఇక్కడ ప్రదక్షిణలు చేసి, వేపాకులు తింటే చీకాకులు అవీ ఉండవని, ఆరోగ్యంగా ఉంటారని నాకు చాలా విశ్వాసం, నమ్మకం.
కిందటి సంవత్సరం నేను షిరిడీ వెళ్ళాను. యెప్పటిలాగానే గురుస్థానంలో వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను గాని, యెంత ప్రయత్నించనా ఒక్క వేపాకు కూడా దొరకలేదు. ప్రదక్షిణ చేస్తు మనసులో "బాబా యేమిటిది, ఇవాళ ఒక్క ఆకు కూడా దొరకలేదు, అనుకున్నాను. ప్రదక్షిణ పూర్తి అయ్యి యింక బయటకు వస్తూండగా అక్కడ గోడమీద వేపాకు మండల కట్ట సుమారు 40 ఆకుల దాకా ఉంటాయి, కనపడింది. నాకు చాలా అనందమేసింది. అక్కడున్నవారికి కొన్ని ఆకులను పంచి కొన్ని యింటికి పట్టుకుని వెళ్ళాను.
తిరుగు ప్రయాణంలో బాబా దర్శనం చేసుకుందామని మందిరం వద్దకు రాగానె, అక్కడి అథికారులు ఇవాళ బాబా హుండీ లెక్కిస్తున్నాము, మీరు కూడా లెక్క పెడతారా అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా గారు నాకు యింతటి బృహత్కార్యంలో నాకు భాగం కల్పించినందుకు. సంతోషంగా 4 గంటలు అక్కడ హుండి డబ్బు లెక్కించాను. తరువాత హారతి సమయం అవడంతో అథికారులు అక్కడున్నవారందరిని ఖాళీ చేయించారు. నన్ను అక్కడి అథికారి పక్కన నించోబెట్టి, హారతి అవగానే బాబా గారికి నైవేద్యం పెట్టిన చపాతీలు నన్ను తినమని ఇవ్వడమే కాకుండా, యింటికి కూడా పట్టుకెళ్ళమని ప్రసాదంగా మరికొన్ని ఇచ్చారు.
బాబా గారు, మా కుటుంబ సభ్యులు రాకపోయినా, అందరికీ ప్రసాదం ఇచ్చినందుకు సంతోషంతో యింటికి వెళ్ళాను.
వీరి థర్మ పత్ని శ్రీమతి సునీత గారు కూడా బాబా భక్తురాలు. మొట్టమొదటిసారిగా వీకు కూడా 20 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళారు. అప్పటి రోజులలో షిరిడీ లొ అంతగా భక్త జనం ఉండేవారు కాదట. సమాథి మందిరంలోపల బాబాకి స్వయంగా అభిషేకం కూడా చేసుకునేటంత వీలుగా ఉండేదట
ఆమె అక్కడ షిరిడీలో ద్వారకామాయిలో కూర్చుని చరిత్ర పారాయణం చేసుకుంటున్నారట. అప్పుడు తెల్లని చొక్క థోవతి, పైన టొపి పెట్టుకున్న వ్యక్తి ఈమె వద్దకు వచ్చి భుజం మీద తట్టి తనతో రమ్మన్నారట. ఆ వ్యక్తి ఈ మెను థుని వద్దకు తీసుకుని వెళ్ళి థునిలోని ఊదీని ఈమె నుదిటి మీద పెట్టారట. తరువాత అక్కడ కొళంబేలో ని నీటిని ఇచ్చారు. అక్కడ బాబా ఫొటొ వద్ద చిన్న డబ్బా ఉండేదట. అందులో వూరిలోనివారు, భక్తులు ఆహార పదార్థాలు వేసి ప్రసాదంగా తీసుకుంటూఉండేవారట. ఈ వ్యక్తి అందులోని పదార్థాలని ప్రసాదంగా ఈమెకు ఇచ్చారు. అక్కడ యింకా కొంతమంది పారాయణ చేస్తున్నవారు ఉన్నాగాని యెవరిని ఆ వ్యక్తి పిలవలేదట. తరువాత ఈమె తన భర్తకు జరిగినది చెప్పినప్పుడు, ఆ వ్యక్తిని నేను చూడలేదు అని చెప్పారట.
బాబా గారు తనని నమ్మిన వారిని, నమ్మనివారిని, ఒక్కొక్కరిని ఒక్కొక్క విథంగా అనుగ్రహిస్తూ, తన లీలలను చూపిస్తూ ఉంటారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment