06.05.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
మా అమ్మాయికి ఆపరేషన్ చేసిన డా.సాయి
14.01.2001 బాబా తో దివ్యానుభూతి . బాబా గారు శ్రిమతి ప్రియాంకా రౌతేలా గారి అమ్మాయి కి ఇచ్చిన దివ్యానుభూతిని చదివారు. ఈ రోజు ఆమెని బాబా గారు యెలా రక్షించారో తెలుసుకుందాము.
ఈ లీలను శ్రీమతి ప్రియాంకా గారి మాటలలోనే తెలుసుకుందాము.
ఇంతకుముందు నేను మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు, డాక్టర్.సాయి మా కుమార్తెను రక్షించిన లీల చెపుతాను. నేను దీని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఒక సంఘటన ద్వారా బాబా గారు గుర్తు చేశారు, అంచేత యిక ఆలశ్యం చేయకుండా ఇవాళ ప్రచురించడానికి నిశ్చయించుకున్నాను. ఇది 5 సంవత్సరాల క్రితం అంటే 2003 లో జరిగింది. నాకు 7 వ మాసంలోనే మా కుమార్తె పుట్టింది. పుట్టినప్పుడు బరువు 1.2 కే.జీ. పైగా పుట్టినప్పుడు ప్రేవులు శరీరం బయట ఉన్నాయి. బతికే చాన్సెస్ .001 శాతమే కాబట్టి మెర్సీ ఇంజక్షన్ చేస్తాము అని నా భర్తకు డాక్టర్ స్ సలహా ఇచ్చారు. కాని ఆపరేషన్ చేస్తే 2-3 లక్షల దాకా అవ్వచ్చు, కాని అదంతా దండగ, యెందుకంటే యిటువంటి కేసులు మేము ప్రతీరోజూ చూస్తూ ఉంటాము, ఆపరేషన్ వల్ల పిల్లకి నయమవదు అని చెప్పారు. నా భర్త యేమీ వినిపించుకోకుండా, యేమైనా సరే ఆపరేషన్ చేయమని డాక్టర్స్ తో చెప్పారు. డాక్టర్స్ పెద్ద మందుల జాబితా ఇచ్చి వాటిని వెంటనే తెప్పించమని చెప్పారు.
నా భర్త మందులు తేవడానికి ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న షాపుకి వెళ్ళారు. ఆయన, షాపులో అతను మందులు ఇచ్చేంత వరకూ వేచి చూస్తూ చాలా ఆందోళనగా ఉన్న సమయంలో, వెనుకనుంచి భుజం మీద యెవరో తట్టినట్లయి వెనక్కి తిరిగి చూసేటప్పటికి, బాబాని భౌతికంగా చూశారు. బాబా యెఱ్ఱని దుస్తులలో ఉండి నా భర్తకి యిలా అభయమిచ్చారు, "బిడ్డా, నీ బిడ్డకు యేమీ అవదు, నేను చూసుకుంటాను."
క్షణాలలో బాబా అదృశ్యమయిపోయారు. నా భర్త చాలా సంతోషించి, మా అమ్మాయికి యేమీ కాదనే థైర్యంతో ఉన్నారు. ఆయన అన్ని మందులతో తిరిగి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు డాక్టర్స్, "మీరు చాలా అదృష్టవంతులు, యెందుకంటే డా.శర్మ ఊరిలోనే ఉన్నారు, ఆయనకి వంట్లో బాగుండకపోయినా మీ అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు, ఈరోజే ఢిల్లీ వెళ్ళిపోతున్నారు" అని చెప్పారు.
మేము డా.శర్మ గారి రాక కోసం యెదురు చూస్తూండగా, బాగా వయసు మళ్ళినాయన ఆపరేషన్ థియేటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళడం చూశాము, ఆయన వయస్సు 70 సంవత్సరాలు ఉండవచ్చు.
ఆయన చేతులు బాగా వణుకుతున్నాయి. కొంతమంది డాక్టర్స్ వచ్చి ఆయనకు స్వాగతం చెప్పడం చూశాము, ఆయనే డా.శర్మ అని అర్థం చేసుకున్నాము. ఆయనని చూస్తూనే, నేను నా భర్తతో "ఆయన చాలా వయస్సు యెక్కువున్న వ్యక్తి, ఆయనే బాగా వణుకుతున్నారు, అరచేతిలో బొమ్మలా ఉండే మన అమ్మాయికి ఆపరేషన్ యెలా చేయగలరు? " అన్నాను.
యేమైనప్పటికి ఆపరేషన్ మొదలు కాబోతోంది, మరోసారి, డాక్టర్స్ నా భర్తతో, "ఈ ఆపరేషన్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు, మీరు మూర్ఖం గా ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నాము అంతే అసలు యేమీ లేనిదానికన్న .001 % చాన్స్, మీరు తరువాత రెండవ బిడ్డకోసం ప్రయత్నించవచ్చు" అని చెప్పారు. ఆపరేషన్ ప్రారంభమయింది, డా.శర్మ, నవ్వుతూ బయటకు వచ్చి, నా భర్తను అబినంధించి ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు. కూడా ఉన్న డాక్టర్స్ బృందం ఆశ్చర్యపోయారు, యెందుకంటే వారికి అసలు సకెస్స్ అవుంతుందని యేవిథమైన ఆశ లేదు. డాక్టర్ గా వచ్చిన వయసుమళ్ళిన వ్యక్తి , తనంతట తానుగా వచ్చిన బాబా తప్ప మరెవరూ కాదని మాకు తెలుసు. అందుకనే మేము మా చిన్నరికి సాయినా అని పేరు పెట్టుకున్నాము. తను సాయినాథ్ ఇచ్చిన వరప్రసాదం. ఇప్పుడామెకు 5 సంవత్సరాలు, మంచి ఆరోగ్యంతో ఉంది. అంతే కాదు తను చిన్నప్పటినుంచీ బాబా భక్తురాలు. యెన్నొ సాయి భజనలతో పాటుగా తనకి మరాఠీలొ బాబా ఆరతి కూడా తెలుసు. చాలా సార్లు తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు సాయి, సాయి, సాయి అని అంటూ ఉంటుంది. తన దివ్య హస్తాలతో ఆపరేషన్ చేసి బాబా మా అమ్మాయికి ప్రాణ దానం చేశారు. మా అమ్మాయి ఆపరేషన్ విజయవంతమవడంతో డాక్టర్స్ కి నోట మాట రాలేదు. నేనెప్పుడూ చెపుతున్న విథంగా బాబా , భౌతిక సంబంథమైన బాథలను మాత్రమే కాదు, మానసిక బాథలను కూడా నివారించగలిగలిగిన ప్రపంచలోకన్న గొప్ప వైద్యుడు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment