07.05.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్శులు
బాబా యెప్పుడు యెవరిని యెలా అనుగ్రహిస్తారో మనకు తెలియదు. ఈ విషయాన్ని మనము ప్రతీ లీలలోనూ చుస్తున్నాము. మము ఒక విథంగా అనుకొంటే మరొక విథంగా ఆయన తన లీలలను ప్రసాదిస్తారు. ఈ లీలలు మన ఊహకందనివి. అనుభవించినాక పదే పదే మరలా గుర్తుకు తెచ్చుకునేవిగా ఉంటాయి. అటువంటి మరొక అద్భుతమైన లీల ఈ రోజు మీకందిస్తున్నాను.
ఈ లీలను చెప్పినది మా మేనమామగారయిన శ్రీ పెయ్యేటి రంగారావు గారు. దీనిని వారి మాటలలోనే తెలుసుకుందాము.
"నేను కొన్ని సంవత్సరాల క్రితం షిరిడి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గురువారం (చావడి ఉత్సవం) పల్లకి ఉత్సవం జరుగుతోంది. నేను ద్వారకామాయి మెట్ల మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఒక పూజారి గారు, ఇలా రా అనినన్ను పిలిచి ద్వారకామాయి లోపలనున్న బాబా వారి పల్లకిని బయటకు తీసుకురమ్మన్నారు. నేను యెంతో సంతోషంతో
యింకా కొంతమందితో కలిసి పల్లకీని బయటకు తెచ్చాను. తరువాత నేను పూజారితో పల్లకి నేను కూడా మోస్తాను అని అన్నాను.అప్పుడు పూజారిగారు పల్లకీ సేవ, "కోటిమందిలొ యేవొక్కరికో అవకాశం వస్తుంది. ఇది ఇవ్వడమే గొప్ప " అని
పల్లకీ మోయడానికి అవకాశం ఇవ్వలేదు. . తరువాత నేను పల్లకి ఉత్సవం జరుగుతుండగా, పల్లకిమోసేఅతనితో నేను కూడా మోస్తాను ఒక్కసారి నా భుజం మీద పెట్టుకుంటాను అని అడిగాను. అతను నేను కూడా మోయడానికి కొంచెం సేపు అవకాశం ఇచ్చాడు.
తరువాత ఆంధ్రా నించి యెవరో రాజకీయ నాయకుడు రాగా ఆయన కూడా ఉన్నవారితో పాటుగా వారి వెనకాలే వెళ్ళి నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment