ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి
09.05.2011 సోమవారము
సాయి బంథువులకు శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక బాబా లీలకు తెలుగు అనువాదం పోస్ట్ చేస్తున్నాను.
ప్రతీ రోజు నాకు సాయి అనుభవాలు -- రవి
కొంతమంది సాయి భక్తులు ప్రతీరోజూ ఆయన లీలలను అనుభవిస్తున్నారన్నది నిజం. ఈ రోజు నేను ఒక భక్తునికి బాబా వారు ప్రతీరోజు యేదో విథంగా తమ దర్శనాన్ని కలుగచేస్తున్న లీలని మీకు చెపుతాను. నేను రవిగారి మైల్ చదువుతున్నప్పుడు ఆయన యెన్నో విషయాలని చెపుతున్నట్లుగా నా కనిపించింది.
నేను రవి మైల్ చదువుతున్నప్పుడు అందులో నాకు అతనికి బాబా మీద ఉన్న ధృఢ భక్తి కనపడింది. నేను రవి మైల్ మరియు అతని బాబా మందిరం ఫొటొలు జత చెస్తున్నాను.
"ప్రియాంకా గారు, నేను మీ బ్లాగు చూశాను, నేను కూడా, ప్రతీరోజు బాబాతోకలిగే నా అనుభవాలని మీతో పంచుకుంటాను.
బాబా దయవల్ల నేను కూడా బాబా భక్తుడినే.నాకు ప్రతీరోజు ఆయన అనుభవాలు కలుగుతున్నాయి. ఆయన కటాక్షం నామీద, నా కుటుంబం మీద ఉన్నందుకు నేను మనస్పుర్తిగా కృతజ్ణుడను. మనం కనక ప్రతీ క్షణం గడిచేకొద్దీ సాయిని ప్రార్థించినా, గుర్తుచేసుకుంటూఉన్నా, అప్పుడు బాబా తప్పకుండా ప్రతీరోజు చక్కటి లీలలతో మనలని అనుగ్రహిస్తూ ఉంటారని నేను భావిస్తున్నాను.
ఆయన విథానం కొంచెం వేరుగా ఉంటుంది. ఒకోసారి ఆయన తన ఉనికిని , ఈ మైల్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, లేక యేమైనా బాథాకరమైన అనుభవాల ద్వారా, కలలు, ఆర్థిక నష్టాలు వగైరా, ఇలా ఆయన దివ్య చర్యల జాబితా అంతం లేనిది. సాయి బోథనలనించి నా అనుభవం 1990 నించి ఉంది. ప్రతీ సంఘటన కూడా మంచి అవనీ చెడు అవనీ నాకు గురువారమునాడే (బాబా వారము)_ జరుగుతున్నాయి. నా వివాహము గురువారము నాడు జరిగింది. మా యిద్దరు అబ్బాయిలు కూడా గురువారమునాడే జన్మించారు.
నేను భారతదేశానికి వచ్చేముందు చాలా విపరీతమైన నడుము నొప్పిగా ఉండేది. అప్పుడు నేను సచ్చరిత్ర చదువుతున్నాను, దాని వల్లే బాబా నా నడుము నొప్పిని తీసివేశారు. నాకు మెడకూడా తిప్పలేనంతగా స్పాండిలైటిస్ ఉంది. ఆఖరికి బాబా ఊదీ వల్ల ఆపరేషన్ లేకుండా ఒక అద్భుత లీలగా నయమయింది.
2004 ఫిబ్రవరిలో బాబా దయవల్ల షిరిడీ దర్శించుకున్నాను. షిరిడిలో 7 రోజులు ఉన్నాను. నేను షిరిడీ నించి తిరిగివచ్చిన తరువాత, నేను ఊ.ఎస్.ఏ. లో అడుగుపెట్టగానే సాయి నాకు ఉద్యోగం ఇచ్చారు.
సాయి నాకు మంచి విద్యనిచ్చారు. విజయవంతంగా నేను ఫుడ్ మరియు న్యూట్రిషన్ డీటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను.
చిన్న విగ్రహం కొనుక్కోవడానికి సాయి నాకు అవకాశమిచ్చారు, అది యెన్నోవిథాలుగా అద్భుతమైనది. సుందరమైన ఆ చిన్న విగ్రహంలో బాబా సజీవంగా ఉన్నారు.
ఇక్కడ నా చిన్న మందిరం ఫోటో జత చేస్తున్నాను. జీవితంలో నాకెప్పుడైనా ప్రశ్న గాని, సమస్య గాని యెదురైనప్పుడు సంజ్ణలకోసం ఆకాశంలోకి చూస్తాను. బాబా తగిన సూచన చేస్తారు. చాలా సార్లు నేను "ఎస్" ( "S" ) గుర్తులు ఆకాశం లో చూశాను.
అప్పుడప్పుడు నేను కాగితం మీద, "అవును" "కాదు" అని రాసి చీటీలు వేసి మా అబ్బాయి చేత బాబా సమాథానం కోసం తీయిస్తాను. మీతో నా అనుభవాలని పంచుకుంటున్నందుకు నాకు చాలా అనందంగా ఉంది. జీవితంలో ప్రతీవారికి బాబా అనుభూతులనిచ్చుగాక. యేలీలలను చదివినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకేసారి తన బిడ్డలనందరినీ సమంగా రక్షిస్తున్నందుకు సాయికి కృతజ్ణతలు చెపుతున్నాను.
మీకు కూడా యేమైనా అనుభవాలు ఉంటే రవిగారిలాగే అందిరితో పంచుకోండి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment