15.06.20011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు
షివపూర్ బాబా మందిరం మహిమలు -- 2
యింతకుముందు మనము షివపూర్ బాబా మందిరం యొక్క మహిమలు గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మరికొంత సమాచారం తెలుసుకుందాము.
షివపూర్ బాబా మందిరం కమిటీ చైర్మన్ గారయిన శ్రీ అమిత్ విశ్వాస్ గారు చెప్పిన వివరాలు.
శ్రీరామ నవమి పుణ్యదినాన ఈ సంవత్సరం (2010) గుడిలో పీఠం మీద కొత్త సాయి మూర్తి ప్రతిష్టించబడింది. ఈవిగ్రహంరావడం కూడా ఒక లీల. కొత్తగా నిర్మించిన గుడిలో కమిటీ సభ్యులు ఫైబర్ గ్లాసుతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టిద్దామనేయోచనలో ఉన్నారు. ఈ లోగా బాబా , చెన్నై లో ఉన్న శ్రీ కె.వీ. రమణి గారికి, శివపూర్ లో తన ఆవిష్కరణ గురించితెలియచేసి, షిరిడీలో సమాథిమందిరంలో ప్రతిష్టించబడిన విగ్రహం అదే కొలతలతో నిలువెత్తు విగ్రహాన్ని శివపూర్ కిపంపించవలసిందిగా ఆదేశించారు. బాబా గారి దివ్యమైన ఆదేశంతో ఆయన శివపూర్ కి బాబా విగ్రహాన్ని పంపించారు.
ఈ లీల విన్న తరువాత దేవాలయ కమిటీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకుని 24.03.2010 మార్చ్ శ్రీ రామనవమిరోజున ప్రతిష్టించారు. బాబా అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ ఆటంకంలేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి.
అదేరోజు రాత్రి గ్రామస్తులందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. బాబా గారు అమిత్ విశ్వాస్ గారితో సహామరికొంతమందికి కలలో కనపడి ఇలా చెప్పారు.." గ్రామస్తులు తమ తమ యింటి ప్రవేశ ద్వారముల యెడమవైపునకనక తవ్వినట్లయితే, నా దీవెనలుగా రేపు వారికి ఊదీ కనుగొంటారు"
మరునాడు వారు లేచేటప్పటికి ఈ విషయం గ్రామమంతా కార్చిచ్చులా అందరికీ తెలిసింది. గ్రామస్తులు జిజ్ఞాసతో బాబాకలలో చెప్పిన గుర్తులప్రకారం భూమిని తవ్వడం మొదలుపెట్టారు. నిరంతరంగా తవ్విన కొంత సేపటికి, ముందురోజుగుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో యజ్ఞంలోజరిగిన ఊదీ, బొగ్గు, కనపడేటప్పటికి వారికి నోట మాట రాలేదు. ఇదిశివపూర్ లోను, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రతి ఒక్కరి యింటిముందు జరిగింది. కొంతమంది తాము శాశ్వతంగానిర్మించిన సిమెంట్ నేల కింద కూడా చూద్దామనే ఆసక్తితో తవ్వగా వారికి కూడా అదేసమయంలో బొగ్గు, ఊదీకనిపించడంతో ఆశ్చర్యపోయారు. సమితి సభ్యులందరి నిర్థారణకోసం ఈ సంఘటనకి సంబంథించిన ఫోటోలు తీశారు. యింకా ఆశ్చర్యకరమైన విషయమేమ్నటే, వారు గుడి వద్దకి వెళ్ళి యజ్ఞ కుండంలో చూసినప్పుడు అందులో, ఊదీ, గానిబొగ్గుగాని లేవు. యిందులో యెవరికైనా సరే యేవిథమైన అనుమానాలు ఉన్నా, షివపూర్ చుట్టు పక్కల గ్రామాలలోనివారినందరినీ అడిగి తెలుసుకోవచ్చు.
ఈ విషయాన్ని షివపూర్ సమితి చైర్మన్ గారయిన శ్రీ అమిత్ విశ్వాస్ గారు చెప్పారు.
పైన చదివిన లీలలో ని విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. గ్రామస్తులు సిమెంట్ తొ చేసిన నేలను కూడా తవ్విచూశారు. ఇక్కడ వారు అయ్యో సిమెంట్ నేలను తవ్వేస్తున్నాము, పాడయిపోతుందేమో అనే సంకోచం లేకుండాతవ్వేశారు. అదే కనక వారు సంశయంతో అయ్యో సిమెంట్ నేల తవ్వేస్తున్నాము యెలాగ, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకోవాలి అని యేమీ అనుకోలేదు. ఇక్కడ కలలో కొంతమందికి కనపడ్డారు. అయినా మిగతావారు కూడాయెంతో నమ్మకంతో తవ్వి చూశారు. ఊదీ లభించింది. వారు యెంతటి అదృష్టవంతులో కదా. మనం కూడా బాబా మీదయెక్కువ శ్రథ్థ, భక్తి, విశ్వాసాలనుంచి ఆయనని ప్రసన్నుణ్ణి చేసుకుందాము.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment