ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు శివపూర్ బాబా మందిరం లీలలలో మరికొన్నిటిని తెలుసుకుందాము.
షివపూర్ బాబా మందిరం లీలలు - 3
షివపూర్ బాబా మందిరానికి పక్కనే యిల్లు కట్టుకున్న ఆ గ్రామ నివాసి గుడిలో రాత్రి 2-3 గంటల మథ్య గుడిలో యెవరూ లేనప్పుడు, కాంతి కిరణాన్ని గమనించాడు. ముందర అతను గుడిలో యెవరో దొంగ ప్రవేశించి ఉంటాడు అనుకున్నాడు, మరునాటి రాత్రి కూడా అదేవిథంగా జరిగింది. ఈ సారి అతను ఆ రాత్రి గుడిలో కి వెళ్ళి , ఆ కాంతి వెంబడే వెడదామని నిర్ణయించుకున్నాడు. అతను గుడిలోకి ప్రవేశించినప్పుడు, యింకా యెవరో టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నట్లుగా లైట్ కనపడింది. అతను ఆ కాంతిని అనుసరించి వెళ్ళడం ప్రారంభించాడు, అలా వెడుతుండగా, అతనికి మంచి సుగంథ పరిమళభరితమైన సువాసన వచ్చింది. అటువంటి సువాసన తన జీవితంలో యింతకు ముందెప్పుడూ ఆఘ్రాణించలేదు. యిదే విషయాన్ని ఆయన అమి అమిత్ గారితో చెప్పారు. ఆయన అనుకున్నదేమంటే బాబా గుడిచుట్టూ తిరుగుతున్నారని, ఆయన మాత్రమే అటువంటి సుగంధ పరిమళాన్ని యివ్వగలరని భావించారు.
వెదురు కఱ్ఱలతో నిర్మించబడిన ఈ మందిరాన్ని తిరిగి మరలా నిర్మిస్తున్నారు. నిర్మాణం యింకా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పెద్ద గాలివాన వచ్చి రెండుగంటలపాటు పెద్ద వర్షం పడింది. అది మథ్యాన్న సమయం, పనిచేసేవాళ్ళు, గ్రామస్తులు అందరూ కూడా అది నిద్ర పోయే సమయం. గుడిలో యెవరూ లేరు. వర్షం తగ్గగానే పనిచేసేవాళ్ళంతా గుడిలోకి దూసుకుని వెళ్ళారు కట్టిన కట్టుబడి యెలా ఉందో చూద్దామని. బాబాని ఉంచడానికి కొత్తగా కట్టిన పీఠం వర్షానికి పూర్తిగా కొట్టుకునిపోవడం చూడగానే వారు ఖిన్నులయారు. గ్రామస్తులంతా కూడా బాబా యిక్కడున్నా యెలా జరిగిందని కలవర పడ్డారు. కూలీలంతా చాలా విచారించారు, యెందుకంటే యిక వారివద్ద థనంలేదు, యిక ముందు నిర్మాణం జరుగుతుందని కూడా ఖచ్చితంగా తెలీదు. మరునాడు ఉదయం, కూలీలు, గ్రామస్తులు అందరూ మరలా కట్టడం పని ప్రారంభించడానికి వచ్చినప్పుడు, యింతకుముందు పాడయిపోయిన పీఠం పూర్తిగా తిరిగి నిర్మించబడి ఉండటంతో చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు, కాని పాడయిపోయిన మిగతావి మట్టుకు అలాగే పాడయిపోయి ఉన్నాయి. ఈ కార్యం బాబా వారు తప్ప యెవరు చేయగలరు?
మేము ప్రతీ శనివారము సత్సంగం చేస్తాము. ఒక శనివారమునాడు మాఊరిలో ఉన్న బాబా గుడిలోనే సత్సంగం పెట్టుకున్నాము. అప్పుడు అక్కడ అగరువత్తులు వెలిగించారు. ఆ సువాసన చాలా బాగుంది. నేను కూడా అటువంటిదే కొందామని దాని పేరు చూసి కొన్ని రోజుల తరువాత కొని వెలిగించాను. కాని ఆ సువాసన లేదు. గుడిలో వెలిగించినది యే రకమైన అగరువత్తులో తెలియదు. కొన్నొ రోజుల తరువాత నేను సోఫాలో కూర్చున్నాను. నేను మా అమ్మాయి, అల్లుడు, కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నాము. నా వెనుక గోడమీద పెద్ద బాబా ఫొటొ ఫ్రేం కట్టించి ఉన్నది ఉంది. అప్పుడు రాత్రి 8 అయింది. హటాత్తుగా నాకు గుడిలో వెలిగించిన అగరుబత్తీల సువాసన వచ్చింది కొంతసేపు. యింటిలో అటువంటి అగరువత్తులు లేవు ఆరోజు సాయంత్రం కూడా యేమీ అగరువత్తులు వెలిగించలేదు. నేను మిగతా వారిని అడిగాను, వారికి అగరువత్తుల సువాసన వస్తోందా అని, రాలేదని చెప్పారు.
తరువాత నేను ఆలోచించాను. ఒక వేళ మరొక విథమయిన సువాసన వచ్చి ఉంటే అది బాబా అనుగ్రహమని నాకు తెలియకపోవచ్చు. మరి గుడిలో వచ్చిన పరిమళమే వచ్చిందంటే బహుశా బాబా తన ఉనికిని చాటుకున్నారని భావించాను.
2 సంవత్సరాల క్రితం మా యింటిలో సత్సంగం యేర్పాటు చేసుకున్నాము. సత్సంగాన్ని మొదటగా ప్రారంభించిన శ్రీమతి మీనాక్షి గారికి మా యిల్లు సరిగా తెలియదు. మేము సాయంత్రం 4 గంటలకు సత్సంగం యేర్పాటు చేశాము. మీనాక్షి గారు రావడం కొంచెం ఆలశ్యమయింది. మాయింటికి కొద్ది దూరంలో వీథి మలుపులో కొంచెం దూరంలో ఒక బాబా గుడి ఉంది. మీనాక్షిగారు వస్తూండగా గుడివద్దకు వచ్చేటప్పటికి అగరువత్తుల వాసన వచ్చిందిట. గుడిలో నుంచి వస్తోందేమో అనుకున్నారు గాని, అప్పటికి గుడి యింకా తెరవలేదు. తరువాత ఆ సువాసన మాయింటికి కొద్ది దూరంలో ఉన్న చిన్న కొట్టువద్ద వచ్చిందిట, మాయింటి గేటు దాకా వచ్చిందిట. మా యిల్లు రోడ్డుకు కొంచెం దూరంలో ఉండి బయట గేటు ఉంటుంది. తరువాత ఆ సువాసన మాయింటిలో వచ్చింది. ఆ సువాసన మేము వెలిగించిన అగరువత్తులదే. ఆ సువాసన అంత దూరం బాబా గుడి దాకా, కొట్టువద్దకు వ్యాపించేటంతటి గాఢమైన అగరువత్తులు కాదు. బాబా గారే ఆమెకు యింటి కి దారి అగరువత్తుల పరిమళం ద్వారా చూపించారు.
సర్వం శ్రీ సాయినాథారపణమస్తు
0 comments:
Post a Comment