Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 21, 2011

సాయిని తెలుసుకో -- ఆలోచనా శక్తి

Posted by tyagaraju on 3:32 AM




21.07.2011 గురువారము

సాయి బంథువులకు శుభాసీస్సులు

సాయిని తెలుసుకో -- &

ఆలోచనా శక్తి


ఈ రోజు సుమిత్ జీ గారి బాబా లీలను తెలుసుకుందాము. బాబా వారు యెవరిని యెప్పుడు యెలా అనుగ్రహిస్తారో, యేరూపంలో వస్తారో మనకి తెలియదు. సచ్చరిత్ర పారాయణ చేసి అందులోని సారాన్ని బాగా జీర్ణించుకున్నవారికే బాగా అర్థమవుతుంది. అందుకనే బాబా వారు సకల ప్రాణులలోను తనని చూడమన్నారు. మనం మన విచక్షణని కూడా కొంత ఉపయోగించాలి.

సుమిత్ జీ గారి లీల వారు చెప్పిన మాటలలోనే........


నేను శ్రీ సాయిబాబాకు కొత్త భక్తుడిని. మన చుట్టూ సాయిబాబా ఉంటారనటానికి నిదర్శనంగా నేను నా మొదటి అనుభూతిని మీకు చెపుతున్నాను. ఈ రోజులలో నేను చాలా తీవ్రమైన నొప్పితో బాథ పడుతున్నాను. నేనున్న చోటికి గుడి చాలా దూరంలో ఉండటం వల్ల యెప్పుడు అవకాశం వస్తే అప్పుడు బాబా గుడికి వెడుతూ ఉండేవాడిని, అంటే వేరే పట్టణంలో ఉండేది, కాని నేను ప్రతీరోజు బాబాని దర్శనం ఇవ్వమని నాకు మార్గం చూపమని అర్థిస్తూ ఉండేవాడిని.

మొన్న రాత్రి బాగా ఉరుములు, మెరుపులతో పెద్ద గాలి వాన వచ్చింది. బయట ఒక కుక్క అరుస్తూ ఉండటం విన్నాను. అది ఒక వీథి కుక్కలా అనిపించింది, కాని ఆస్ట్రేలియాలో యెక్కడా వీథి కుక్కలు కనపడవు. నేను బయటకు వెళ్ళి చూశాను అది ఒక నల్లటి కుక్క అది నావైపు వస్తోంది,

కాని నేను దానిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి పడుకున్నాను. మరలా పడుకునేముందు నాకు దర్శనం ఇవ్వమని బాబాని ప్రార్థించాను. నాకు కలలో ఒక నల్లటి శివలింగం 5 సెకండ్లు కనపడింది,

నాకు మెలకువ వచ్చి లేచాను. నేను ఆఫీసుకు వెళ్ళి తిరిగి వచ్చి, ఈ జరిగినదంతా సాయి భక్తురాలయిన నా కాబోయే భార్యకి చెప్పాను. అప్పుడామె, "ఆ చిన్న కుక్కని నిర్లక్ష్యం చేయడం వల్ల నువ్వు బాబాకి సేవ చేసే అవకాశాని పోగొట్టుకుని వుండవచ్చు, యెందుకంటే బాబా గారు యెప్పుడు యేరూపంలో వచ్చి దర్శనం ఇస్తారో నీకు తెలియదు" అంది. అది వినేటప్పటికి నాకు కొంచెం విచారం వేసింది. కాని ఈ రోజు పూజ అయినతరువాత నేను బాబా వారిని ఒక ప్రశ్న అడిగాను, పుస్తకంలో వచ్చిన సమాథానం ఇలా ఉంది రెండు వాక్యాలలో "యిద్దరు వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి వస్తారు, నీ జబ్బు నయమవుతుంది".

నేను మాయింటినించి ఆఫీసుకు వెళ్ళడానికి బయటకు వచ్చాను, రాత్రి నేను చూసిన కుక్క యింకొక చిన్న కుక్కతో నావైపుకు వచ్చింది. ఇది చూడగానే నాకు చాలా సంతోషం వేసింది, కాని పుస్తకంలో నాకు వచ్చిన సమాథానానికి ఈ రెండుకుక్కలకి మథ్యవున్న సంబంథం యేమిటొ నేను అర్థం చేసుకోలేకపోయాను. లోపలికి వెళ్ళి కొంచెం రొట్టె తీసుకుని వచ్చి వాటికి పెట్టాను, నాకు తృప్తిగా అనిపించింది. నేను ఆఫీసుకు వెళ్ళి కూర్చున్నాక, ఉదయం పుస్తకం లో నాకు వచ్చిన సమాథానానికి, ఈ రెండు కుక్కలు కనపడటానికి యేదో సంబంథం ఉండవచ్చని నాకు తోచింది. ఆ రెండు కుక్కలూ మా పొరుగింటివారివని కనుక్కున్నాను, కాని నేను వాటినెప్పుడూ ఇంతకు ముందు చూడలేదు.

కొంతమంది దీనిని కాకతాళీయం అనుకోవచ్చు, కాని నేను దీనిని లీల అనే గట్టిగా నమ్ముతున్నాను. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల నేను బాబా అనుగ్రహాన్ని పొందాను. బాబా అనుగ్రహంతో నా చింతలు, అనారోగ్యం నివారింపబడతాయనే మంచి ఆలోచనలో ఉన్నాను. ఆ అనుభూతిని కూడా నేను సాయి భక్తులందరితో పంచుకుంటాను.

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై
నిరంతరం సాయి చరణాల మీద
సుమిత్

ఆలోచనా శక్తి

ఒకసారి ఒక యోగి ఆయన శిష్యుడు ఒక పెద్ద పట్టణంలోకి ప్రవేశించారు. వారి వద్ద థనం లేదు. కాని వారికి తినడానికి తిండి, ఉండటానికి వసతి కావాలి. శిష్యుడు అనుకున్నాడు ఈ రోజుకి బిక్షమెత్తుకుని యేదైన ఒక పార్క్ లో పడుకోవాలిసిందే అని.

"
ఇక్కడనించి పార్క్ యెంతో దూరంలో లేదు, మనం ఈ రాత్రికి అక్కడ విశ్రమిద్దాం" అన్నాడు, శిష్యుడు.

"ఆరుబయల ప్రదేశంలోనా" అడిగాడు, యోగి

"
అవును" అన్నాడు శిష్యుడు.

"
లేదు, మనమీరాత్రికి ఒక హోటలులో భోజనం చేసి అక్కడే పడుకుంటాము కూడా" నవ్వుతూ చెప్పడు యోగి

"
యేమిటి? అది సాథ్యమేనా?" ఆశ్చర్యంతో ప్రశ్నించాడు శిష్యుడు

"
అవును, నీ మనస్సుని యేకాగ్రతగా ఒకే విషయం మీద కనక కేన్ ద్రీకరిస్తే అది నిజమయి తీరుతుంది" అన్నాడు యోగి.

అప్పుడాయోగి కళ్ళు మూసుకుని యేకాగ్రతతో తదేకంగా ధ్యానం చేశాడు. పది నిమిషాల తరువాత యోగి ధ్యానంలోనించి లేచి శిష్యుడు వెంట రాగా బయలుదేరాడు. వారు అన్ని సందులు, మలుపులూ అన్నీ తిరిగి ఆఖరికి ఒక హోటల్ వద్దకు వచ్చారు.

"
దా, మనం లోపలికి వెడదాము" అన్నాడు యోగి శిష్యుడితో.

వారు మొదట అడుగు పెట్టగానే మంచి దుస్తులు ధరించిన వ్యక్తి వారికి యెదురు వచ్చి, " నేనీ హోటల్ కి మానేజర్ ని మీరు యాత్రలు చేస్తున్న స్వామీజీలా ఉన్నారు, బహుశా మీవద్ద ధనం లేదనుకుంటాను. మీరు హోటల్ వంటగదిలొ పని చేసినట్లయితే మీకు తిండి పెట్టి పడుకోవటానికి కొంత చోటు చూపిస్తాను" అన్నాడు.

"
అలాగే" అని తన అంగీకారాన్ని తెలిపాడు యోగి.
శిష్యుడు విభ్రాంతికి లోనయ్యి అడిగాడు " మీదగ్గిర మాయలు మంత్రాలు ఉన్నాయా? యెలా చేయగలిగారు?"

యోగి నవ్వుతూ అన్నాడు "ఆలోచనా శక్తి యెటువంటిదో నీకు చూపించాలనుకున్నాను. నువ్వు యేవిషయం గురించైనా సరే పూర్తి యేకాగ్రతతో ఆ పని జరగాలని తదేక ధ్యానంతో అనుకుంటే కనక ఆ పని జరిగి తీరుతుంది. వ్యతిరేకత నీ మనసునుంచి రాదు."

"
ఇందులో ఉన్న రహశ్యం యేమిటనటే, యెక్కువ యేకాగ్రత, ఆ దృశ్యాన్ని ఊహించుకోవడం, నమ్మకం, మానసిక శక్తిని, భావాన్ని ఉపయోగించాలి. నీ మనసు యెటువంటి ఆలోచనలతో లేకుండా కేవలం ఒకే ఆలోచనమీద కేంద్రీకృతమవాలి. ఒకే ఆలోచన వుండాలి. అప్పుడది శక్తివంతమవుతుంది. అనుకున్నది సాథించవచ్చు. యెక్కువ యేకాగ్రతతో చేసిన ఆలోచన చాలా శక్తివంతంగా ఉంటుంది ఫలితం కూడా అలాగే ఉంటుంది అందుచేత ఆలోచన చాలా జాగ్రత్తగా చేయాలి.

అందుచేత మనమెప్పుడూ కూడా నిరాశని మన దరికి రానివ్వకూడదు. యెప్పుడూ ఆశా జీవిగా ఉండాలి. అంతే కాక పైన చెప్పినట్లుగా మనం యేకాగ్రతతో దేనినైనా సాథించవచ్చు. ఒకవేళ అనుకున్న పని సాథించలేకపోయామనుకోండి. అప్పుడే మనకి మన్స్థైర్యం కావాలి. ఆ మనస్థైర్యం మన వద్ద ఉన్నంత వరకూ మన జీవిత మంతా విజయ పథం వైపే ఉంటుంది.

మనం యేదైన పుస్తకం చదవడం మొదలు పెట్టామనుకొండి. యేకాగ్రతగా చదివితే అందులోని విషయాలన్నీ గుర్తుంటాయి. పుస్తకం చదువుతూ ఉంటాము, కళ్ళు పుస్తకాలలో ఉన్న అక్షరాల వెంబడి వెడుతూ ఉంటాయి. కాని మనసు మాత్రం యెక్కడో విహరిస్తూ ఉంటుంది. చదివిన పేరా గుర్తు ఉండదు. మళ్ళీ మొదటినుంచి చదవాల్సి వస్తుంది. యేకాగ్రత లేనప్పుడు అలాగే ఉంటుంది. అందుచేత మనసు పెట్టిచదవాలి.

ఇక్కడ మీకొక విషయం చెప్పదలచుకున్నాను. నేను ఫోర్థ్ ఫారం (అంటే ఇప్పుడు 9త్ క్లాస్) పరీక్షలప్పుడు హిందీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. అదులో ఒక ప్రశ్నకి పరీక్షకు ఇంకాసేపట్లో వెడతాననగా చదవడం మొదలుపెట్టాను. దానిని చదవడం అదే మొదటిసారి. ఒక్కసారే చదివాను. కాని చదివినదంతా బాగా గుర్తిండిపోయింది. యెలా గుర్తు ఉందో యెలా చదివానో నాకే తెలియదు. మరలా ఆవిథంగా మరెప్పుడూ చదవలేకపోయాను. అంటే ప్రతీదీ 4 లెక యెక్కువ సార్లు చదవడమో, బట్టీ వేయడమో జరిగింది.

అలాగే మనం సాథించదలచుకున్నది యేదైనా సరే ఒక పది నిమిషాలు మనసులోకి యెటువంటి ఆలోచనలకూ తావివ్వకుండా కేవలం ఆ విషయం మీదే ధ్యానం చేస్తే చక్కటి ఫలిస్తాలొస్తాయి.

యింకొక విచిత్రం యేమిటంటే మన మూడవ కన్ను కూడా తెరుచుకుంటుందనటంలో ఆశ్చర్యమేమీ లేదు. జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు కూడా తెలుస్తాయి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List