24.07.2011 ఆదివారము
మన మనసుని చదివే బాబా
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
రెండు రోజులుగా బాబా లీలను ఇవ్వలేకపోయాను. శుక్రవారము ప్రచురిద్దామని ఒక విషయం తయారుచేసాను గాని, కంప్యూటర్లో నాకు కొంత అవగాహన లేమి (అజ్ఞానం) వల్ల తయారు చేసినదంతా తొలగి పోయింది.
ఈ రోజు ఒక అద్భుతమైన బాబా లీలను మీముందు ఉంచుతున్నాను. బాబా వారు జీవించి ఉన్నాప్పుడు, ఆయనతో కలిగిన అనుభూతిని భక్తుడు స్వయంగా అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారికి సాయి లీలలో ప్రచురణ నిమిత్తం పంపిన లీల.
మనం సాయికి అంకిత భక్తులం కాకపోయినప్పటికి, ఒకసారి సాయిని పూజిస్తే చాలు, ఆయన మనని తన భక్తుడిగానే గుర్తిస్తారు. మన మనసులో యేమున్నదో కూడా చెప్పగలరు. అటువంటి అద్భుతమైన లీల.
ఈ సాయి లీల శ్రీ వినాయక్ సీతారం మూలేర్కర్ గారు శ్రీ అన్నాసాహెబ్ ధాబోల్కర్ గారికి సాయి లీల పత్రికలో ప్రచురణ నిమిత్తం పంపిన అనుభవం.
నేను థానే ఫారెస్ట్డి డివిజన్ ఆఫీసులో హెడ్ క్లర్క్ గా పని చేస్తున్నాను. మా ఆఫీసు బాంద్రాలో ఉంది.
ప్రతీరోజు పాసెంజర్ రైలులో లొయెర్ పరేల్ నించి బాంద్రాకు వెడుతూ ఉండేవాణ్ణి. బాంద్రాలో ఉన్న నా స్నేహితులలో చాలా మంది బాబా దర్శనానినికి షిరిడీ వెళ్ళి వస్తూ ఉండేవారు. వారు, ఊదీ, ప్రసాదం, ఇంకా కొన్ని వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ,ప్రసాదం ఇస్తూ ఉండేవారు. కొంతమంది నా నుదిటి మీద ఊదీ పెడుతూ ఉండేవారు. నేను వాటిని తీసుకుంటున్నప్పటికి, కొంత నా అజ్ఞానం వల్ల అభిప్రాయం వల్ల నాకు అటువంటివాటిల్లో నమ్మకం లేదని చెప్పేవాడిని.
బాబా నాలో ఆసక్తి ప్రేరేపించేంత వరకు నేను షిరిడి దర్శించనని చెప్పేవాడిని.
ఈ పర్తిస్తితుల్లో చాలా రోజులు గడిచిపోయాయి. చాలా మంది షిరిడీ ని దర్శిస్తూ ఉండేవారు, వారు వూహించలేని బాబా లీలలను వర్ణిస్తూ ఉండేవారు. తదనంతరం ముంబాయి, బాంద్రా, వాసి, విరార్, ఆగాషీ, దహను, మరియు అంబర్గావ్ ల నుంచి ప్రజలు షిరిడీకి దర్శనంకోసం వెళ్ళడం కూడా మొదలైంది. కాని నేను నా నిశ్చయానికే కట్టుబడి ఉండి బాబా ప్రేరణ కలిగిస్తే తప్ప షిరిడీ వెళ్ళకూడదనుకున్నాను.
కొద్ది రోజుల తరువాత ఒక గురువారమునాడు యేమి జరిగిందంటే (నేను మామూలుగా ఉపవాసం ఉంటాను) నేను నా రోజువారీ కార్యక్రమాలను ముగించుకుని నిద్రపోయాను. ఈ రోజు బాబాని తప్పకుండా చూడాలి అనే భావంతో నిద్ర లేచాను. తెల్లవారే ముందు నాకు నేను వర్ణించలేనటువంటి దైవ సంబంథమైన దృశ్యం కనబడింది. ఉదయాన్నే టీ తాగి 8 గంటలకి ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాలమీద నా యజమాని సంతకాలు తీసుకున్నాను. నేనాయనని సెలవు కావాలని అడిగినప్పుడు వెంటనె ఇచ్చి ఇలా చెప్పారు "సరే ఒక మంచి పనికోసం వెడుతున్నావు కనక నీకు 3 , 4 రోజులు సెలవు ఇస్తాను".
ఇంకా , "నేను కూడా నాసిక్ లో ఉన్న మా బంథువుని కలుద్దమనుకుంటున్నాను, అందుచేత మనమిద్దరం ఒకే రైలులో వెడదాము" అన్నారు.
ఉదయం 11 గంటలు అవుతుండగా యింటికి వచ్చి నా భార్యతో "ఇవాళ బాబా వెళ్ళడానికి నాకు సంకల్పం కలిగించారు అంచేత మథ్యాన్నం రైలుకు బయలుదేరుతున్నాను" అన్నాను. ఆమె వెంటనే ఒప్పుకుంది కాని, దూర ప్రదేశం, తెలియని కొత్త చోటు, అంత దూరం యెవరూ తెలియని వ్యక్తితో వెళ్ళరు పైగా చలి వాతావరణం అని కొంచెం కలవర పడింది. ఈ విషయాలన్ని నిజమైనప్పటికి , నా మదిలో కలిగిన ప్రేరణ ప్రాథాన్యత పొందింది, అందుచేత గురువారమునాడు నేను చేసే ఉపవాసం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయలుదేరాను.
ఉదయానికి కోపర్గావ్ స్టేషన్ కి చేరుకున్నాను. షిరిడీ వెళ్ళడానికి టాన్ గా కోసం చూస్తూ ఉండగా , అదే రైలు లోంచి దిగిన నా చిన్ననాటి స్నేహితుడైన డాక్టర్. ఆర్. ఆర్. చౌబాల్ కనిపించారు. మేమిద్దరం వెళ్ళేది షిరిడీకే కాబట్టి మా యిద్దరి ఉద్దేశ్యం బాబాని కలుసుకోవడం, దానితో మా సంతోషానికి అవధులు లేవు. మా టాంగా గోదావరి ఒడ్డుకు చేరుకునేటప్పటికి నేను నా చిన్ననాటి స్నేహితుడైన శ్రీ గజానన్ కనేకర్ ని కలుసుకున్నాను. ఆయన నా రాక గురించి తెలుసుకుని టాంగా దగ్గిరకి తన సేవకుడిని పంపి తన అతిథులుగా తన యింటికి ఆహ్వానించాడు. టాంగాలో ఆయన బంగళాకి వెళ్ళగానె ఆయన మమ్మల్ని చూసి చాలా సంతోషించారు. ఆయన మా సామనంతా కిందకి దింపి, అక్కడే ఉండమని బలవంతం చేశారు. ఆఖరున వెళ్ళేటప్పుడు ఆయన మాకు టీ, కొంచెం పలహారం పెట్టారు. ఆరతి సమయానికి మేము బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి యింక మేము వెళ్ళాలని అక్కడికి తొందరగా చేరుకోవాలని యెక్కువ సేపు వుండలేమని యింక వెళ్ళనివ్వమని కోరాము.
యిక మేము ఆరతి సమయానికి 30-45 నిమిషాల ముందుగా షిరిడీ చేరుకున్నాము. మేము కాకా సాహెబ్ డీక్షిత్వాడాలో బసకు దిగాము. కాకా సాహెబ్ గారిని కలుసుకున్నాము ఆయన మాకు అన్ని యేర్పాట్లు చేశారు. కొద్ది సేపటి తరువాత మేము ఆరతికి వెళ్ళాము. బాబాని దర్శించాక నేను యింతకు ముందెన్నడు అనుభవించని బ్రహ్మానందాన్ని సంతోషాన్ని పొందాను.నేను బాబా పాదాలను ముట్టుకోవడానికి సాష్టాంగ పడినప్పుడు "నువ్విక్కడికి రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా" అని బాబా అనేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవే ఆలోచనలు నా మదిలో సుడులు తిరుగుతున్నాయి. బాబా సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకొని మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసాను. బాబా తన కన్నులతోనే నన్ను దీవించారు, తన చేతులతో నా శరీరాన్ని లాలించారు. అప్పుడాయన నన్ను లెమ్మన్నారు. డా.చౌబాల్ గారు కూడా అదే సమయంలో దర్శనం చేసుకున్నారు.
తరువాత, మేము బాబావారి సెలవు తీసుకోవాడానికి బాబా వద్దకు వెళ్ళినప్పుడు (మేమిద్దరం పూనా వెళ్ళడానికి) బాబా గారు డాక్టర్ గారిని అడిగారు "బాంద్రాలో ఉన్న నాభక్తులలో ఒకరు నీ వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు బాగానే ఉన్నాడా?" బాబాగారికి చౌబాల్ గారు డాక్టర్ అని గాని, బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని తెలియదు, కాని ఆయన తన భక్తుని యోగ క్షేమాల గురించి అదిగారు. డా.చౌబాల్ గారు ఆశ్చర్యపోయారు. దీనివల్ల బాబా భగవంతుని అవతారమే అనే మానమ్మకాన్ని బలపరిచింది.
బాబాతో మొదటిసారి కలయిక. బాబా తన భక్తుల యోగక్షేమాల గురించి యెంత జాగ్రత్త తీసుకుంటారో, వారి మనసులను చదవగలరని, దానికి తగ్గట్లుగా సూచనలు చేస్తూ ఉంటారని, వారి మనసులో యేముందో తెలుసుకోగలరనీ దీనివల్ల ఋజువయింది. నా భార్యకు నా షిరిడీ యాత్రకి తగిన సాకులు చెప్పినప్పటికీ, సాయి దర్శనానికి నా షిరిడీ యాత్రలో యెటువంటి చిక్కులు యేర్పడలేదు.
రెండవ అనుభవం: నేను చాలా సార్లు షిరిడీ వెడుతూ ఉన్నానని నా భార్య అనటంతో , నా కుటుంబాన్ని కూడా ఒకసారి షిరిడీకి తీసుకువెళ్ళాలి,
అందుచేత, వారిని షిరిడీ తీసుకుని వెళ్ళాను. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు, నా భార్య స్త్రీలు కూర్చునేచోట వారితో కలిసి కూర్చుంది. కుటుంబలోని రోజువారి కార్యక్రమాల గురించి బాబా వారు వివరిస్తున్నప్పుడు, నా భార్యకు ఆ వివరణ తన స్వంత జీవితం గురించేనని అర్థమైంది. వర్ణించనలవికాని, ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించింది. బాబా వారు మానవుడు యెలా ప్రవర్తించాలో వివరించి చెప్పారు. నా భార్య యెంతటి నిజమైన భక్తురాలయిందంటే, ఆమె యెప్పుడూ " బాబా ని అడగండి, ఆయన చెప్పినట్లు చేయండి" అనేది. అందుచేత, నేను ఒకసారి మా అమ్మాయి వివాహం కోసం అడిగాను. "నీ మనసులో యేమున్నదో అదే మంచిది. వివాహం కూడా అక్కడే అవుతుంది. అమ్మాయి యెల్లప్పుడు సంతోషంగా జీవిస్తుంది" అన్నారు. అమ్మాయికి అనుకున్న ఆబ్బాయితోనే వివాహం జరిగింది, అమ్మాయి వైభవంగా సంతోషంగా ఉంది. బాబా నాభార్య శిరసుమీద చేయి ఉంచి దీవించారు, అది ఆమె మనసులో బాగా గుర్తుండిపోయింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
Sai Reunite You With Your Loved Ones - Experience By Sister Saba Khan
-
[image: shirdisaideva.com]
Sairam to all readers ,
When we develop our own spiritual health with our reflection the things
around us will also change an...
6 years ago
0 comments:
Post a Comment