02.11.2011 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
శిఖరాలు - లోయలలో శ్రీ సాయి
మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు
కూర్పు : సాయి. బా. ని. స.
61. జీవితము ఒక ఖాళీ కుండ వంటిది. కుండలో నీరు నింపకపోతే దాని తయారీకి అర్థము లేదు. అలాగే మానవుడు తన మనసులో భగవంతుని గురించి ఆలోచించకపోతే ఆ జన్మకు అర్థము లేదు.
26.06.93
62. జీవితము విక్రమాదిత్యుడు - భేతాళుడు కధ లాంటిది. నీవు విక్రమాదిత్యుడివి. నీపని నీ గమ్యం (మోక్షము) చేరే వరకు కష్టాలు సుఖాలు అనే భేతాళుడిని మోయటమే.
29.06.93
63. జీవితములో కోరికలు గోడమీద నిలబడియున్న మేకవంటిది. ఆకుకూరలు, పండ్లు, కూరగాయల గంపలు నేలమీద యున్న లంచాలు వంటివి. కోరికలను అదుపులో పెట్టలేక లంచాలు తినాలి అనే కోరికతో మేకలాగ గోడ పైనుండి క్రిదకు దూకిననాడు విరిగేది యెవరి కాళ్ళు అనేది ఆలోచించాలి.
06.10.93
64. జీవీతము ఒక సైకిలు ప్రయాణము వంటిది. ఎల్లపుడు నీ జీవిత భాగస్వామిని వెనుక సీటులో కూర్చుండబెట్టుకొని జీవిత ప్రయాణము కొనసాగించి ప్రయాణములోని కష్ట సుఖాలు పాలు పంచుకో.
10.07.93
65. జీవితము సముద్ర తీరమువంటిది. సముద్రానికి పోటు, ఆటు వస్తాయి. అటువంటప్పుడు సముద్రపు నీరు ఒడ్డుకు విపరీతముగా వస్తుంది. కొంతసేపటి తర్వాత ఆ సముద్రపు నీరు సముద్రములోనికి వెళ్ళిపోతుంది. అటువంటి సమయములో కష్టాలు అనే చేపలు, అహంకారము అనే పాములు ఒడ్డున ఉన్న రాళ్ళమీద పడి గిలగిల కొట్టుకొంటాయి. కాని భగవంతుని అనుగ్రహము అనే ముత్యపు చిప్పలు ఒడ్డున మిగిలి యున్న కొద్దిపాటి నీళ్ళలో ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి.
06.08.93
66. జీవితము అనే రైలు ప్రయాణములో సుఖశాంతులు కావాలి అంటే బంధువులు, స్నేహితులతో (రాగ ద్వేషాలకు నిలయాలు) ఎక్కువ పరిచయాలు ఉండరాదు. ప్రయాణములో నీవు ఎన్ని సామానులు (ఆస్థిపాస్థులు) మోయగలవో అన్ని సామానులు మాత్రమే తీసుకొని టైముకు సరిగా స్టేషనుకు రావాలి. (టైముకి సరిగా నీ బరువు బాధ్యతలు పూర్తి చేయాలి). రైలు పెట్టెలో సరిగా కూర్చుని సుఖప్రయాణము చేయాలి. తలుపు దగ్గర నిలబడి బయటకు అనవసరముగా చూడరాదు. (అనవసరపు విషయాలలో తలపెట్టరాదు) అపుడే జీవితము అనేరైలు ప్రయాణము సుఖశాంతులతో సాగిపోతుంది.
09.08.9367. జీవితము ఒక రైలు ప్రయాణము వంటిది అని మన అందరికి తెలుసు. మరి ఈ ప్రయాణానికి అంతము నీకు తెలుసా ! విను, నీ రైలు తిరిగి తిరిగి ఆఖరికి నీవు ప్రయాణము ప్రారంభించిన మొదటి స్టేషన్ కు చేరుతుంది. (తల్లి గర్భము నుండి నీ ప్రయాణము ప్రారంభము అయినది. మరణము తర్వాత తిరిగి తల్లి గర్భములో చేరుకొంటావు) అదే నీ రైలు ప్రయాణానికి అంతము.
19.09.9368. జీవితము ఒక సర్కసు వంటిది. ఆ సర్కసులో ఊయలమీద ఊగటము జీవితములో కష్టతరమైన పనులు చేయటమువంటిది. ఊయల ఊగుతుంటే క్రింద పడితే రక్షించటానికి వల ఉండదు. ఊయల ఊగటము ఆపలేము. అటువంటి సమయములో నా నామస్మరణ చేస్తూ ఊయల ఊగు. ఒకవేళ నీవు ఊయలనుండి జారిపడితే నిన్ను రక్షించటానికి నా చేతులు చాచి యుంటాయి.
11.10.9369. జీవితము ఒక అంతులేని యాత్ర. నీవు ఆయాత్రలో జన్మలు యెత్తుతున్న ఒక యాత్రికుడివి.
15.10.9370. జీవితము అనే పడవ ప్రయాణములో భార్య తెరచాప వంటిది. గాలివాలు బాగా ఉన్నపుడు ఆ తెరచాపను ఎగరవేయాలి. గాలివాలు లేనపుడు తెరచాప ఎగరవేసిన, ఆ పడవ ప్రయాణానికి తెరచాప అడ్డముగా మారుతుంది -- జాగ్రత్త.
26.11.9371. జీవిత బస్సు ప్రయాణములో ప్రయాణీకులలో దైవ చింతనపరులు, అనాధ బాల బాలికలు, హరిజనులు, గిరిజనులు, అన్య మతాలవారు ఉంటారు. నీవు భగవన్నామస్మరణ చేస్తూ సర్వజనులు సుఖశాంతులతో ప్రయాణము చేయాలి అనే కోరికతో గతుకుల రోడ్డుమీద ధైర్యముగా బస్సును ముందుకు నడిపించాలి.
03.01.94
72. జీవితము ఒక అంతులేని నడక. దారిలో ఇతరులతో కలసి ఆటలాడుతాము. పాటలు పాడుతాము, పోటీలు పడతాము. పోటీలలో ఒకళ్ళే గెలుస్తారు. రెండవవాడు ఓడిపోతాడు. ఓడినవాడు, నెగ్గినవాడు సంతోషపడటములోను అర్థము లేదు. అదేవిధముగా మానావమానాలు గురించి ఆలోచించటములో అర్థము లేదు.
12.04.9473. జీవితము ఒక లారీని నడపటము వంటిది. బరువు బాధ్యతలను లారీలో వేసుకొని నడపాలి. రోడ్డుమీద మిగతాలారీలకు ప్రమాదాలు జరిగిన మనము అధైర్యము పడకుండా మన లారీని గమ్యస్థానము చేర్చాలి.
23.06.94
74. జీవితములో న్యాయము అన్యాయము అనేవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. అన్యాయాన్ని మరచిపోయి నీవు న్యాయమైన మార్గములో ప్రయాణము చేయి.
04.07.9475. జీవితములో సత్యము, అసత్యము అనేవి రెండు అంశాలు. మనిషి కష్టాలలో ఉన్నపుడు అతనికి కొన్ని అసత్యాలు చెప్పి అతని మనసుకు కొంత శాంతిని కలగ చేసిన పాపము కాదు. ఏదైన ఒక విషయములో 90 శాతము సత్యము 10 శాతము అసత్యము యున్న ఆవిషయమును సత్యముగా చెప్పబడుతోందే. అందుచేత మనముందుకు వచ్చే సత్యము, అసత్యములలో మంచిని మాత్రమే తీసుకుని ముందుకు సాగిపోవాలి.
08.08.94
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
(ఇంకా ఉంది)
0 comments:
Post a Comment