Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 28, 2011

షిరిడీ తోటలోని వాటర్ ఫాల్ లో సాయి దర్శనం

Posted by tyagaraju on 7:30 AM


28.11.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

షిరిడీ తోటలోని వాటర్ ఫాల్ లో సాయి దర్శనం

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

సాయి భక్తులారా ! ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు పంపిన బాబా దర్శనం అందిస్తున్నాను.


బాబా ఎపుడూ చెబుతూ ఉండేవారు, సబ్ కా మాలిక్ ఏక్ హై అని. అది అక్షరాలా నిత్య సత్యం. అంటే దాని అర్ధం మీరు భగవంతుడిని (సాయి) ని వినాయకునిగా తలిస్తే ఆయన వినాయకుడు, సుబ్రహ్మణ్యేస్వరునిగా తలిస్తే ఆయన సుబ్రహ్మణ్యేస్వరుడు, జీసస్ గా తలిస్తే జీసస్, అల్లా గా తలిస్తే అల్లా.

సాయి మతాలన్నిటికీ అతీతుడు. మీది ఏమతమైనా గానీ, మీరు ఏ విధంగా పూజించినా గానీ మీ ప్రార్థనలన్నీఈ కూడా ఆయనకి చేరతాయనడంలో ఎటువంటి సందేహము లేదు.

బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. యిందు గలడందు లేడని సందేహము వలదు. బాబా లేని ప్రదేశాన్ని మనం చూపించలేము. ఆయన సర్వత్రా నిండి ఉన్నాడు. సర్వాంతర్యామి. దానికి సాక్ష్యమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రింద ఇవ్వబడిన ఫొటో.



ఈ ఫోటో షిరిడీలో ఒక సాయి భక్తుడు షిరిడీ గార్డెన్ కాంప్లెక్స్ తోటలో ఉన్న వాటర్ ఫాల్ ని తన సెల్ కెమెరాలో తీసినప్పుడు కనిపించిన దృశ్యము. కొంతమంది సాయిభక్త బృందం షిరిడీ వెళ్ళి అక్కడి వాటర్ ఫాల్ ని ఫొటోలు తీసినప్పుడు ఒక ఫోటోలో బాబా వాటర్ ఫాల్ లో కనిపించారు. సాయి ఎప్పుడూ, ఎప్పుడూ, ఎల్లప్పుడూ, మనతోనే ఉంటారు, ఉన్నారు.

సాయిని చూచిన కనులే కనులు, సాయిని ప్రార్థించిన మనసే మనసు, సాయిని గానం చేసిన గానమే గానము, సాయిని పూజించిన కరములే కరములు, సాయి లీలలను విన్న కర్ణములే కర్ణములు, సాయి లీలలను చరిత్రను చదివిన బ్రతుకే ధన్యము.


మన సాయి భక్తులందరికీ, మరియూ, ఈ అద్భుత దృశ్యాని వీక్షించే అవకాశాన్నిచ్చిన సుకన్యగారికి బాబావారి అనుగ్రహము లభించుగాక

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List