15.07.2014 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి తత్వం - 3వ.భాగం
శ్రీసాయి తత్వం పై ఎంతో పరిశోధన చేసి మనకందించారు సాయి.బా.ని.స శ్రీ రావాడ గోపాలరావు గారు. ఈ రోజు తరువాయి భాగం చదవండి.
స్వంత భార్యతో చేసే శృంగారం పంచదారవంటిది కాని పరస్త్రీ సాంగత్యం మధుమేహాన్ని కోరి కొని తెచ్చుకోవడంవంటిది.
శ్రీసాయి సత్ చరిత్ర 49వ.అధ్యాయంలో ఈ విషయం గమనించండి. ఒకసారి బిజాపూర్ నుండి ఒక ధనికుడు కుటుంబంతో బాబా దర్శనానికి వచ్చాడు. అతని భార్య తన మేలిముసుగును తొలగించింది.
బాబా ప్రక్కనే కూర్చొన్న నానా సాహెబ్ ఆమె అందానికి ముగ్ధుడయి ఆమెను మరలా మరలా చూడాలనుకొన్నాడు. బాబా ఆవిషయాన్ని గమనించి నానాను వారించి సరియైన మార్గంలో పెట్టారు.
వేదాలు, ఉపనిషత్తులు, పవిత్ర గ్రంధాలు. ఇవన్నీ కూడా చివరికి సముద్రంలో కలిసే స్వచ్చమయిన నదులవంటివి. గ్రంధాలన్నీ మంచినడవడి కోసం మార్గదర్శకాలుగా ఉద్దేశింపబడినవి. సాయిసాగరమనే సముద్రంలో ప్రమాణాలను శోధించడం అర్ధరహితమే అవుతుంది.
శ్రీసాయి సత్ చరిత్ర 12,27 అధ్యాయాలలో మనకు ఈవిషయం గురించి తెలుస్తుంది. నాసిక్ నుంచి వచ్చిన మూలేశాస్త్రి తనకు తానే ఒక పండితుడిగా భావిస్తాడు. అతని దృష్టిలో బాబా ఒక పిచ్చిఫకీరు. మసీదులోకి అడుగుపెడితే తాను అపవిత్రుడనయిపోతానని భావించాడు. దూరం నుండే బాబాని గమనించసాగాడు. బాబా, మూలేశాస్త్రి గురువయిన ఘోలప్ స్వామిగా దర్శనమిచ్చి అతని అజ్ఞానాన్ని తొలగించారు. మూలేశాస్త్రి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనిని దీవించారు.
"ఆధ్యాతిమికత్వంలో సాక్ష్యాలు, ఆధారాలు ఉండవు. మనకు పంచుకోవడానికి అనుభవాలు, అనుభూతులు మాత్రమే ఉంటాయి".
ఒక డాక్టరుకు, మద్రాసు భజన సమాజం నుంచి వచ్చిన ఒక స్త్రీకి బాబా శ్రీరామునిగా దర్శనమిచ్చారు. మూలేశాస్త్రికి అతని గురువు ఘోలప్ స్వామిగా, మరొక భక్తునికి అతని గురువు కాకాపూర్ణికగా దర్శనమిచ్చారు. శ్యామాకు, గోపాల్ ముకుంద్ బూటీకి యిద్దరికీ ఒకేసమయంలో బాబా కలలో దర్శనమిచ్చి బూటీవాడాను నిర్మించమని ఆదేశించారు. వీటన్నిటికీ కూడా యివన్ని ఏవిధంగా జరిగాయన్నదానికి మనం సమాధానం తెలుసుకోగలమా? (సమాధానం దొరుకుతుందా). ఖచ్చితంగా సమాధానం పొందలేము.
ఈభౌతిక ప్రపంచంలో కూడబెట్టిన సంపదకి, వస్తువులకి రక్షణకోసం భీమా చేయిస్తాము. "అదే విధంగా ఆధ్యాత్మిక జీవితానికై నావద్ద భీమా చేయించు. నీలక్ష్యానికి అది సురక్షితమయిన మార్గం. "
శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో తాత్యా సాహెబ్ నూల్కర్ జీవితమే అందుకు ఉదాహరణ. తాత్యాకు బాబా పాదతీర్ధం యివ్వగానే అతను ఎటువంటి కష్టం లేకుండా ముక్తిని పొందాడు. తాత్యా మరణవార్త వినగానే బాబా "తాత్యా మన కళ్ళముందే తనువు చాలించాడు. అతనికి మరొక జన్మలేదు".
"ప్రతిక్షణం నీడలా వెంటాడే మృత్యువునుండి మనం ఎంతకాలం తప్పించుకొని పరిగెట్టగలం. అందుచేత చావుకు భయపడవద్దు".
శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో మనం ఈ విషయం గమనించవచ్చు. బాబా తనవద్దకు వచ్చే భక్తులందరికీ ఊదీనిస్తూ ఉండేవారు.
ప్రతి మనిషి మరణించిన తరువాత ఈభౌతిక శరీరం బూడిదగా మారిపోవలసిందే అన్న విషయాన్ని అందరికీ గుర్తు చేయడానికే.
ఈతత్వానికనుగుణంగానే బాబా మేఘుడి అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు. కాని, రాధాకృష్ణమాయి అనూహ్య పరిస్థితులలో మరణించినపుడు కోపర్ గావ్ పోలీసులు ఆమె అంత్యక్రియలను పూర్తిచేశారు.
"విమానంలో కూర్చొని మానవుడు గాలిలో ప్రయాణించవచ్చు. గాలిలో ఎగరడం కోసమె మొత్తం యింధనాన్నంతా ఖర్చు చేసేస్తే, ఆఖరికి విమానం కూలిపోయి భూమిని గుద్దుకోవలసిందే.
అందుచేత భూమి మీదకు సురక్షితంగా దిగడానికి సరిపడ యిందనాన్ని ఎప్పుడూ నిల్వలో ఉంచుకోవాలి. ఈభౌతిక ప్రపంచంలో సుఖాలకోసం, వైభవం కోసం ఆఖరిక్షణం వరకు పదవిని అంటిపెట్టుకొని ఉండటం సహజమే".
ఉద్యోగంలో ఆఖరి వరకూ పెద్దపెద్ద హోదాలలో పని చేస్తూనే ఉండవద్దని బాబా హితవు చెప్పారు. దీనికి ఉదాహరణ దాసగణు మహరాజ్, బాలాసాహెబ్ భాటే, బీ.వీ.దేవ్ ల జీవితాలు. దాసగణు పోలీస్ సబ్ యిన్ స్పెక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. బాలాసాహెబ్ డిప్యూటీకలెక్టర్ గా, బీ.వీ.దేవ్ తహసీల్దార్ గా పని చేస్తూ అందరూ స్వచ్చందంగా పదవీవిరమణ చేసి తమ శేషజీవితాన్ని బాబాసేవలో గడిపారు. ఆవిధంగానే నేను కూడా నా 54వ.ఏట బాబా ఆదేశానుసారం, భారతప్రభుత్వ ఉద్యోగిగా స్వచ్చందంగా పదవీవిరమణ చేసి బాబాసేవకి, బాబా భక్తుల సేవకి నాజీవితాన్ని అంకితం చేశాను.
ఇప్పుడు మరికాస్త ముందుకు వెడదాము. భార్యభర్తలిద్ద్దరూ జీవితంలో ఒకరినొకరు అర్ధం చేసుకొని సహకరించుకొని తమతమ బాధ్యతలను నిర్వర్తించాలి. బాధ్యతలన్నిటినీ నిర్వహించిన దశ పూర్తయిన తరువాత యిద్దరూ అదే ఉత్సాహంతో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాలి.
శ్రీసాయి సత్ చరిత్రలో కాపర్దే జీవితమే యిందుకు ఒక ఉదాహరణ. అమరావతిలో బారిష్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. అతనికి తన భార్యయందు అమితమైన ప్రేమ మరియు ఆమెతో ఎంతో అనుబంధాన్ని పెంచుకొన్నాడు. ఇద్దరూ షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్న తరువాత, తిరిగి వెళ్ళడానికి బాబా యిద్దరికీ వేరు వేరుగా అనుమతినిచ్చారు. మొదటగా ఖాపర్డే నాలుగు నెలల తరువాత మరొక 3 నెలల తరువాత అతని భార్య తిరిగి వెళ్ళేటట్లుగా బాబా అనుమతినిచ్చారు. అవిధంగా బాబా యిద్దరిమధ్యా అనుబంధం లేకుండా సహాయం చేశారు. అతరువాత ఖాపర్దే భార్య మరణించిన తరువాత, ఖాపర్దేను ఆధ్యాత్మిక మార్గాన్ననుసరించమని బాబా సలహా యిచ్చారు.
(ఇంకా ఉంది )
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment