Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, September 3, 2014

కలలలో శ్రీసాయి - 2వ.భాగం

Posted by tyagaraju on 5:07 AM
          
         

03.09.2014 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 2వ.భాగం

ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి తరువాయి భాగం వినండి.

ఆంగ్లమూలం : సాయి.బా.ని.స.శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411


ముందుగా శ్రీసాయి సత్ చరిత్రలోని 28వ.అధ్యాయంలో లాలా లక్ష్మీ చంద్ గురించి తెలుసుకొందాము.  అతనికసలు సాయిబాబా గురించి ఏమాత్రం తెలియదు.  అయినప్పటికీ , 1910వ.సంవత్సరం డిశెంబరు నెలలో అతనికి ఒక కలవచ్చింది.  ఆకలలో అతనికి గడ్డంతో ఉన్న ఒకవృధ్ధుడు కనిపించాడు.  ఆయన చుట్టూ భక్తులు ఉన్నారు.  తరువాత లక్ష్మీ చంద్ తన స్నేహితుడయిన మంజునాధ్ యింటిలో ఒక ఫొటోని చూశాడు. ఆఫోటొ షిరిడీ సాయిబాబాది.   ఆఫొటోలో ఉన్న వృధ్ధుడు సరిగా తాను కలలో చూసిన వ్యక్తిలాగే ఉన్నాడు.  



బెర్హంపూర్ లోని ఒక స్త్రీకి బాబా కలలో కనిపించి కిచిడీ తినాలని ఉందనే కోర్కెను వెలిబుచ్చారు. పైన చెప్పిన ఆయిద్దరూ కూడా బాబా గురించి అంతకు ముందెప్పుడూ వినలేదు, చూడలేదు.  ఈసంఘటనలు బట్టి బాబా  తన భక్తులను తన వద్దకు రప్పించుకోవడానికి స్వప్న దర్శనాలను అనుగ్రహించి తన ఉనికిని చాటుకొంటారని మనం గ్రహించుకోవచ్చు.      

శ్రీసాయి సత్ చరిత్ర 39వ.అధ్యాయంలో ఒక విషయాన్ని గమనిద్దాము.  సాయి యిద్దరు భక్తులకు స్వప్నంలో ఒకేసారి ఒకే సమయంలో దర్శనమిచ్చారు.  ఆయిద్దరు భక్తులు బాపూసాహెబ్ బూటీ, మాధవరావు దేశ్ పాండే.  వారి స్వప్నాలలో బాబా వారితో షిరిడీలో ఒక మందిరాన్ని  నిర్మించమని ఆదేశించారు.  వారు నిర్మించిన మందిరమే  నేడు మనం చూస్తున్న బాబా సమాధి మందిరం.  కోటానుకోట్ల మంది సాయి భక్తులు బాబాను దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఈ సమాధి మందిరానికి వస్తున్నారు.     

  

షిరిడీ సాయిబాబా తన భక్తులకు స్వప్నాలలో దర్శనమివ్వడమె కాదు, ఎక్కడో దూరంలో జరిగిన సంఘటనలను కూడా, ద్వారకామాయిలో తన చుట్టూ కూర్చొని ఉన్న భక్తులకు వివరించి చేప్పేవారు.  ద్వారకామాయిలో ఉదయం బాబా తన ముందున్న భక్తులతో ఆరోజున కొంతమంది ముఖ్య అతిధులు దర్బారులోకి వస్తారని చెప్పిన సంఘటన శ్రీసాయి సత్ చరిత్ర 50వ.అధ్యాయంలో మనం గమంచించవచ్చు.  ఆతరువాత సాయంత్రం వేళ దురంధర్ సోదరులు బాబా దర్శనానికి వచ్చారు.  "ఉదయం నేను చెప్పిన అతిధులు వీరే" అని బాబా అన్నారు.   

దివ్యదృష్టితో బాబా ఎక్కడో మైళ్ళదూరంలో ఉన్న తన భక్తుల కష్టాలను కూడా  తెలుసుకునేవారు.  ఆవిధంగా ద్వారకామాయిలో ఉండి తన భక్తులను కష్టాలనుండి ఆదుకొనేవారు.  దానికి ఉదాహరణ శ్రీసాయి సత్ చరిత్రలోని 7వ.అధ్యాయంలో మనం చూడగలం.  1910వ.సంవత్సరంలో దీపావళిరోజున ఎంతో దూరంలో ఉన్న ఒకకమ్మరి స్త్రీ ఒడిలోనుండి ప్రమాదవశాత్తు కొలిమిలో పడ్డ ఆమె బిడ్డను రక్షించారు.  

అనారోగ్యంతో బాధపడుతున్న తమ భక్తులకు స్వప్న దర్శనమిచ్చి వారి రోగాలను నయం చేసేవారు.  భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని బాబా అతని స్వప్నంలో నయం చేశారు.  ఈవిషయాన్ని మనం 13వ.అధ్యాయంలో గమనించవచ్చు.  

  

బాబా భీమాజీ పాటిల్ కి కలలో ఉపాధ్యాయుడిగా దర్శనమిచ్చి బెత్తంతో కొట్టి పద్యం వల్లె వేయించారు.   

శ్రీసాయి సత్ చరిత్ర 18,19 అధ్యాయాలలో బాబా ఒక త్రాగుబోతుకు కలలో దర్శనమిచ్చి అతని గుండెలమీద కూర్చొని అదిమి పెట్టి జీవితంలో యిక త్రాగనని బాస చేసిన తరువాతనే విడిచిపెట్టారు. 

బాబా నాకు కలలో యిచ్చిన రెండు అనుభవాలను మీకు వివరిస్తాను.  

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List