23.01.2015 శుక్రవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ప్రతీ మానవునికి ఒక మార్గదర్శకుడు లేక ఒక మంచి సద్గురువు ఉండాలి. కొంతమంది అనుకోవచ్చు విధినెవ్వరూ తప్పించలేనప్పుడు దేవునితో పని ఏమిటి గురువుతో పని ఏమిటి అని. కాని ఆవిధిని కూడా తప్పించి ప్రమాదాల బారిన పడకుండా రక్షించే శక్తి గురువుకు ఉంటుంది. ఇక చదవండి.
హరిసీతారాం దీక్షిత్ చెప్పిన అనుభవాలు - 2 (నిన్నటి సంచిక తరువాయి భాగం)
మొట్టమొదటిసారిగా నేను బాబాని చూడగానే నా ప్రియ స్నేహితుడు గోవింద రఘునాధ్ ధబోల్కర్ కూడా బాబా దర్శనం చేసుకుంటే బాగుండుననిపించింది. ఒకసారి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకోమని షిరిడీనుండి ధబోల్కర్ కి ఉత్తరం వ్రాశాను.
తరువాత నేను ధబోల్కర్ ని కలుసుకొన్నప్పుడు "నేను తప్పకుండా బాబా దర్శనం చేసుకొంటాను. కాని ఒక గురువు అవసరం ఏముంటుంది? నాకేమీ అర్ధం కావటల్లేదు. ప్రతి పనీ మనంతటమనమే చేసుకోవాలి." అన్నాడు.
ధబోల్కర్ షిరిడీ ప్రయాణం పెట్టుకొన్న రోజున అతని స్నేహితుని ఒక్కగానొక్క కొడుకు మరణించాడు. ధబోల్కర్ తన షిరిడీ ప్రయాణం మానుకొన్నాడు. తన స్నేహితుని గురువు సమక్షంలోనే అతని కొడుకు మరణించాడు. ధబోల్కర్ కి చాలా ఆశ్చర్యం వేసింది. కానున్నది కాక మానదు. విధినెవ్వరూ తప్పించలేనప్పుడు యిక గురువుయొక్క ఆవశ్యకత ఏముంది అనుకొన్నాడు.
తరువాత అతనికి మరొక స్నేహితుడు కలిశాడు. అతను కూడా ఒకసారి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొమ్మని ధబోల్కర్ కి నచ్చచెప్పి ఒప్పించాడు. ఇద్దరూ షిరిడీకి ప్రయాణమయ్యారు. దాదర్ లో రైలు దిగి అక్కడినుండి మన్మాడ్ వెళ్ళే రైలు ఎక్కుదామనుకొన్నారు. కాని బాంద్రా స్టేషన్ లో ఒక ముస్లిం వ్యక్తి "ఇది ఎక్స్ ప్రెస్ రైలు. దాదర్ లొ ఆగదు.. అందుచేత బోరీ బందర్ లో దిగండి" అని చెప్పాడు. ఆవ్యక్తి చెప్పినట్లుగానె వారు బోరీ బందర్ లో దిగిపోయి మరునాడు ఉదయానికల్లా షిరిడీ చేరుకొన్నారు.
సాయి దర్శనానికి యింకా సమయం ఉండటం వల్ల, మరొక వ్యక్తితో కలిసి సంభాషిస్తూండగా 'గురువు ఆవశ్యకత గురించి ధబోల్కర్ చర్చించాడు. తరువాత మేమంతా బాబా దర్శనానికి వెళ్ళాము. మేమందరం కూర్చోగానే సాయి మహరాజ్ ధబోల్కర్ వైపు చూస్తూ, నాతో "హేమాడ్ పంత్ ఏమంటున్నాడు" అన్నారు". "బాబా మీకంతా తెలుసు" అన్నాను.
మరుసటిరోజు "బాబా నేనిక వెడతాను అనుమతినివ్వండి " అన్నాను. బాబా వెళ్ళమని అనుమతిచ్చారు.
"నేనెక్కడికి వెళ్ళాలి" అడిగాను బాబాని.
"అక్కడికి" అన్నారు బాబా.
"ఏదారిలో వెళ్ళమంటారు" అని అడిగాను.
"చాలా దారులున్నాయి. వివిధ ప్రదేశాలకు వెడతాయి. ఒకదారి యిక్కడినుండి వెడుతుంది. ఆదారి చాలా కఠినమయినది. దారిలో పులులు, ఎలుగుబంట్లు ఉంటాయి" అన్నారు బాబా.
"కాని మాకు ఒక మార్గదర్శకుడు ఉంటే బాగుంటుంది" అన్నాను.
"మనకి మార్గదర్శకుడు ఉంటే సమస్యే లేదు. పులులు, ఎలుగుబంట్లు ప్రక్కకు తొలగిపోతాయి. లేకపోతే లోతయిన లోయలో పడే ప్రమాదం ఉంది" అన్నారు బాబా.
ఈ సంభాషణ ధబోల్కర్ మనసుమీద బలమైన ప్రభావాన్ని చూపించింది. గురువుయొక్క ఆవశ్యకత గురించి అతని ప్రశ్నకు సమాధానం లభించింది.
తరువాత అతనికి సాయి మహరాజ్ గారి అనుభవాలు ఎన్నో కలిగాయి. ధబోల్కర్ సాయి మహరాజ్ కి నిజమైన భక్తుడయాడు.
(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
2 comments:
Sai please give visa to me my hubby for London make our trip success be with us and bless make this dream with your blessings om saima om sai ram omsaimaa
nice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hrnice blog hr
Post a Comment