31. 01. 2016 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు "ది గ్లోరీ ఆఫ్ షిరిడి సాయి" జూలై, 2015 సంచికలో ప్రచురింపబడిన ఒక వైభవాన్ని తెలుసుకుందాము.
బాబా వారికి మానవాతీత శక్తులు ఉన్నాయనే విషయం మనకందరికీ తెలుసు. మానవ కళ్యాణానికై పంచభూతాలను కూడా ఆయన శాసించగలరు. ఈ వైభవంలో అగ్నిమీద ఆధిపత్యం ఎలా చూపించారో తెలుసుకుందాం.
శ్రీ షిరిడీ
సాయి వైభవం -
పంచ భూతాలపై
ఆధిపత్యం
షిరిడీ నివాసి
కొండజీకి బాబా మీద మిక్కిలి ప్రేమ, భక్తి.
అతని భక్తి ప్రేమలకు బాబా అతనిని ముద్దుగా 'కొండ్యా, అని పిలుస్తూ ఉండేవారు. ఒక రోజున కొండ్యా బాబా వద్ద కూర్చుని కబుర్లు చెబుతూ
ఉన్నాడు. అది మిట్ట మధ్యాహ్నం, ఎండ చాలా తీవ్రంగా
ఉంది. దానికి తోడు ఈదురు గాలి కూడా వీస్తూ
ఉంది.
ఆక్షణంలో బాబా “ఖల్వాడీ (పంట నూర్చిన
ప్రదేశం) వద్దకు వెళ్ళు. నీ గోధుమ పంట రాశి
అగ్నికి ఆహుతి అవుతూ ఉంది” అని కొండ్యాతో అన్నారు. కొండ్యా వెంటనే గోధుమ పంట రాశి వద్దకు పరిగెత్తుకుని
వెళ్ళాడు. గోధుమ పంట రాశిని పరిశీలించాడు.
చుట్టుప్రక్కల అంతా బాగా విచారించి ఎక్కడా ఎటువంటి
మంటలు లేవని, అంతా సరిగానే ఉందని నిర్ధారించుకుని తిరిగి వచ్చాడు. వచ్చిన తరువాత బాబాతో ఇలా అన్నాడు-“బాబా! ఇంత మండుటెండలో
ఎందుకని నన్ను అనవసరంగా అక్కడికి, ఇక్కడికి పంపించి భయపెట్టావు?” అపుడు బాబా, గోధుమపంట
రాశివైపు చూపిస్తూ “ నీ పంట కుప్పనుండి పైకి పెరుగుతూ వస్తున్న పొగను చూడు. గోధుమ పంట రాశి మధ్యలో నిప్పు అంటుకుంది” అన్నారు.
ఆ సమయంలో గాలి
విపరీతంగా వీచడం మొదలైంది. రాశి నుండి వస్తున్న
పొగను చూసి కొండ్యా బాగా ఆందోళనతో సహాయం కోసం కేకలు పెడుతూ పంట నూర్చిన చోటకి వెళ్ళాడు. అతని అరుపులు, కేకలు విని గ్రామస్థులు ఇళ్ళనుండి
బయటకు వచ్చి, వీస్తున్న గాలిగి ఎగసి పడుతున్న మంటలను చూశారు. అందరూ బాబా వద్దకు పరుగులు పెట్టారు. మంటలనుండి వచ్చే నిప్పురవ్వల వల్ల మిగిలిని ధాన్యపు
రాశులేమీ మంటల బారిన పడకుండా కాపాడమని బాబాను వేడుకొన్నారు. “బాబా మంటలనార్పండి. లేకపోతే మొత్తం ధాన్యపు రాశులన్నీ తగలబడిపోతాయి. పంటంతా నాశనమయిపోతే పశువులతో సహా గ్రామస్తులందరూ
ఆకలితో మాడిపోవాల్సి వస్తుంది” అని మొర పెట్టుకొన్నారు. సహాయం కోసం అర్ధిస్తున్న గ్రామస్థుల మొర ఆలకించి
బాబా వారితో కలిసి కుప్ప నూర్చిన ప్రదేశానికి వెళ్ళారు. ఒక గ్లాసులో నీరు తీసుకుని గోధుమ రాశి మధ్యలో చుట్టూరా
వృత్తాకారంగా నీటిని చల్లారు. “ఈ మధ్యలో ఉన్న
పంట మాత్రమే అగ్నికి ఆహుతి అవుతుంది. దానిని
ఆర్పడానికి ప్రయత్నించకండి. అది అగ్ని దేవునికి
నివేదన” అన్నారు. ఆయన ఈవిధంగా అన్నారో లేదో
గాలి వీచడం ఆగిపోయి పంటలోని మధ్య భాగం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది. జీవించడానికి ఆధారభూతుడయిన అగ్నిదేవునికి సమర్పించాలనే
విలువయిన పాఠాన్ని భక్తులు అర్ధం చేసుకున్నారు.
బాబాకి పంచభూతాలయిన,
భూమి, వాయువు, ఆకాశము, అగ్ని, వరుణుడు, వీటన్నిటిమీద ఆధిపత్యం ఉంది.
ఆయన పలుకే వాటికి
చట్టం.
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment