01.02.2016 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు 'ద గ్లొరీ ఆఫ్ షిరిడీ సాయీ జూలై, 2015 సంచికలోని ఒక అద్భుతమయిన వైభవాన్ని తెలుసుకుందాం. ప్ప్పుడు మీరు చదవబోయేది బాబావారి చిలుము యొక్క మహాత్మ్యం.
ఈ వైభవంలో శ్రీ జీ.ఎస్.ఖపర్డె గారి ప్రస్తావన కూడా వస్తుంది. ఇంతకు ముందు ప్రచురింపబడిన ఆయన డైరీలో ఈ విషయం మీరు చదివే ఉంటారు. గమనించండి.
శ్రీ షిరిడీ సాయి వైభవం - మహిమ గల చిలుం
వాస్తవానికి
బాబాగారు చిలుం పీల్చడం చాలా తక్కువ. ఆయన సంవత్సరానికి రెండు, మూడు చిలుములు మాత్రమే
పీల్చేవారు. కుండలు చేసే కుమ్మరికి ఈ విషయం
తెలుసు. అయినా గాని, అతను రోజూ రెండు నుంచి
మూడు వందల చిలుములు పట్టుకుని వచ్చి బాబాకు ఇచ్చి వాటి ఖరీదు చెల్లించమని అడిగేవాడు.
అప్పట్లో ఒక్కొక్క చిలుము ఖరీదు రెండు పైసలు. బాబా ఆవిధంగానే చెల్లించేవారు. ఆవిధంగా ఆ కుమ్మరికి అదే జీవనోపాధి అయింది. బాబా ఈ చిలుములన్నింటినీ ద్వారకామాయిలో ఒక మూల గుట్టగా
పోసి ఉంచేవారు. భక్తులు అక్కడికి వచ్చి తమ
ఇష్టానుసారంగా చిలుములు తీసుకుని అక్కడే పీల్చేవారు, లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళేవారు. ఒక రోజు మధ్యాహ్నం ‘దేవ్’ బాబా దర్శనానికి వచ్చాడు. ఒక మూల గుట్టగా పడి ఉన్న చిలుములు చూసి బాబాని ఈ
విధంగా అడిగాడు, “బాబా, మీకు చిలుము పీల్చడానికి సంవత్సరానికి రెండు మూడు చిలుములే
అవసరమవుతాయి కదా! మరి ఇన్ని చిలుములను ఇక్కడ పోగేసి ఉంచారెందుకు?” బాబా “నువ్వు చెప్పింది నిజమే. నాకు సంవత్సరానికి రెండు మూడు చిలుములకన్నా అవసరం
లేదు. కాని నా భక్తులు ఇక్కడికి వచ్చి చిలుము
పీల్చుతారు. కొంతమంది నాకు కనిపించకుండా పట్టుకెడుతూ
ఉంటారు. అందుచేతనే వాటినక్కడ గుట్టగా పోసి
ఉంచాను” అని సమాధానమిచ్చారు.
మహిమ గల చిలుం
బాబా సటకాలాగే
ఈ మహిమ గల చిలుము ఎప్పుడూ ఆయనతోనే సహవాసం చేస్తూ ఉండేది. బాబా చేతులను పెదవులను తాకిన ఆ మట్టి ఎంతో అదృష్టాన్ని
నోచుకుంది. బాబాకు చిలుములను తయారు చేసి ఇచ్చిన
ఆ కుమ్మరి ఎంతో అదృష్టవంతుడు.
మొట్టమొదటిసారిగా
బాబా చిలుమును పీల్చి దానిననుభవించిన చాంద్ పాటిల్ ఎంతో అదృష్టవంతుడు. భాగ్యశాలి.
వారిద్దరి మధ్యా ఏనాటి ఋణానుబంధమో ?
బాబా చిలుమును తను పీల్చి తరువాత చాంద్
పాటిల్ కి ఇచ్చారు.
అతనితో కూడా అతని ఇంటికి వెళ్ళి అక్కడ కొంత కాలం ఉన్నారు. ఆ తరువాత పెండ్లి బృందంతో కలిసి బాబా షిరిడీ రావడానికి
కారకుడు చాంద్ పాటిల్. ఈ సంఘటన తరువాత అది
ఒక చరిత్ర అయింది.
బాబా ఎంతోమంది
భక్తులకి తన చిలుమును పీల్చే అదృష్టాన్ని కలిగించి, వారిని అనుగ్రహించారు. అత్యంత అద్భుతమయిన కధ బాలారామ్ ధురంధర్ ది. (శ్రీసాయి సత్ చరిత్ర 50 వ.అధ్యాయం) దురంధర్ ఆరు
సంవత్సరాలుగా ఉబ్బసం, దగ్గు లతో బాధపడుతూ ఉన్నాడు. షిరిడీ వచ్చినపుడు, ఒక రోజు మధ్యాహ్నం ద్వారకామాయికి
వచ్చి, వినయంగా బాబా పాదాలను వత్తడం మొదలుపెట్టాడు. బాబా అతనికి తన చిలుమును ఇచ్చి పీల్చమన్నారు. అదే మహా ప్రసాదంగా బాలారామ్ ఒక్కసారి పీల్చాడు. ఆ మొదటి పీల్పు అతనికి సరిపడక చాలా భాధాకరమయింది. కాని అతనికి బాబా మీద సంపూర్ణమయిన విశ్వాసం ఉండటం
వల్ల కొంత సేపు చిలుమును పీల్చి, బాబాకు మరలా సవినయంగా తిరిగి ఇచ్చాడు.
అప్పటినుండి
అతని ఆస్త్మా వ్యాధి పూర్తిగా నయమయి ఎంతో శాంతిని పొందాడు. ఆ చిలుము చాలా శక్తిమంతంగా మంత్రంలా పనిచేసింది. ఇక అప్పటినుండి అతనిని ఆస్త్మా వ్యాది బాధించలేదు. కాని బాబా మహాసమాధి చెందిన రోజున మరలా అతనికి ఆస్త్మా
తిరగబెట్టింది. ఆ రోజంతా అతను ఉబ్బసంతో దగ్గుతూనే
ఉన్నాడు. ఆరోజు తరవాతనుంచి ఇక ఉబ్బసంతో బాధపడలేదు. మట్టి చిలుము అందించిన ఆ అనుభూతిని ఎప్పటికయినా
మరచిపోగలడా?
గణేష్.ఎస్.ఖాపర్డే
అమరావతిలో ప్రముఖ న్యాయవాది, ధనవంతుడు. అతను,
బర్మా జైలులో శిక్షననుభవిస్తున్న లోకమాన్య తిలక్ కి విధేయుడు. అతనికి బాబా మీద అపారమయిన నమ్మకం, అచంచలమయిన ప్రేమ
కలవాడు. బ్రిటిష్ వారు ఖాపర్డే మీద నిఘాపెట్టి,
అవకాశం దొరికితే దోషిగా నిర్ణయించి కారాగార శిక్ష వేద్దామని వేచి చూస్తున్న సమయంలో
బాబా అతనిని షిరిడీలోనే ఉంచి కాపాడారు. బ్రిటిష్
వారికి వ్యతిరేకంగా అతను ఎన్నో రాజకీయ ఆందోళనల్లో పాలుపంచుకున్నాడు. షిరిడీలో చాలా కాలం ఉండిపోవడం వల్ల అధిక ఆదాయాన్ని
సంపాదించి పెట్టే అతని న్యాయవాద వృత్తికి ఆటంకం కలిగింది. అతని రాజకీయ లక్ష్యాలు కూడా ఆగిపోయాయి. కాని ఖాపర్డే గారు ఆధ్యాత్మికత మూర్తీభవించిన వ్యక్తి. ఆయన సంస్కృతం, పురాణాలలో మంచి పండితుడు. ఆరతులు
జరిగే సమయంలో మాటిమాటికి బాబా అతనికి సంజ్ఞలు చేసేవారు, చిలుము ఇచ్చి పీల్చమనేవారు.
ఆవిధంగా అతనిలో కలిగే చిక్కు ప్రశ్నలకు సమాధానాలు
లభింపచేసి అనుగ్రహించేవారు,
ఒక్కొక్కసారి
ఖాపర్డే గారు చిలుము పీల్చినపుడు అస్థిమితంగా ఉన్న ఆయన మనసుకు ఎంతో ప్రశాంతత కలిగి,
బాబా పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేది.
22.01.1912 తేదీన ఖాపర్డే గారు తన డైరీలో ఇలా వ్రాసుకున్నారు
“ పూజా సమయంలో
ఆయన రెండు పుష్పాలను తన రెండు నాసికా రంధ్రాలలోను, రెండు తన చెవులలోను, మరొకటి తన శిరస్సుపైన,
పెట్టుకున్నారు. ఇదినాకు ఆయన ఇస్తున్న ఉపదేశంగా
భావించి, ఆ ఉపదేశానికి అర్ధమేమిటో నామనసులోకి రాగానే ఆయన తన చిలుమును నాకిచ్చారు. నాలో
కలిగిన భావాన్ని అది నిర్ధారించింది.” (షిరిడీ డైరీ)
ముస్లిమ్ అయిన
సాయిబాబా పాద తీర్ధాన్ని భక్తులు స్వీకరించి త్రాగుతున్నారనే విషయం తలుచుకోగానే సాయి
సగుణోపాసన (ఆరతి పాటలు) వ్రాసిన కృష్ణాజీ జె.భీష్మకి ఏవగింపు కలిగింది. సాయిబాబా చిలుం పీల్చిన తరువాత, బ్రాహ్మణులయిన భక్తులు
కూడా ఆ చిలుమును పీల్చడం చూసి నిర్ఘాంతపోయాడు.
తాను పాద తీర్ధసేవనం గాని, చిలుం పీల్చడం గాని ఈ రెండూ చేయకూడదని మనసులోనే నిర్ణయించుకున్నాడు. ఒక రోజు బాబా అతనికి ఒక కధ చెప్పడం ప్రారంభించారు. ఆ కధ యధాతథంగా తనకు అంతకు ముందే కలగా వచ్చింది. బాబా కధను చెబుతూ మధ్యలో యాదృచ్చికంగా తన చిలుమును
భీష్మకి ఇచ్చారు. భీష్మ ఒక్క పీల్పు పీల్చాడు. అప్పటినుండి అతను బాబాకు అంకిత భక్తుడయాడు.
ఉదయాన్నే ద్వారకామాయిలోకి
అడుగుపెట్టే మొట్టమొదటి భక్తుడు భాగోజీ షిండే.
అతను బాబా కాలిన చేతికి కట్టుకట్టి సేవ చేసేవాడు. బాబా చిలుమును పీల్చి, భాగోజీకి ఇచ్చేవారు. అతను ఆనందంగా పీల్చేవాడు.
ఇప్పుడు గురువారాలలోను,
ఇతర పవిత్ర దినాలలోను చావడిలో బాబాకు చిలుము సమర్పింపబడుతోంది. ఆ రోజులలో పల్లకీ ఊరేగింపు, రధయాత్ర ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి.
బాబావారి రాజోపచార్ చిత్రపటాన్ని చావడికి తీసుకుని వచ్చి వెండి సింహాసనంలో ఉంచి లగు-ఆరతిని
జరుపుతారు. అడ్కర్ రచించిన ఆరతిపాట “ఆరతి సాయిబాబా,
సౌఖ్య ధాతార జీవా” పాట పాడే సమయంలో బాబాకు మూడుసార్లు చిలుమును సమర్పిస్తారు. బాబాకు ఆరతి సమయంలో చిలుమును సమర్పించే అరుదయిన
గౌరవం తాత్యా కుటుంబానికి వారసత్వంగా లభించింది.
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment