10.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస
గారికి బాబావారు ఆధ్యాత్మికతపై ఇచ్చిన సందేశాలను ప్రచురిస్తున్నాను. చదవండి.
శ్రీ సాయి పుష్పగిరి
– ఆధ్యాత్మికం – 4 వ. భాగం
16.12.2004
31. ముందుగా నీవు ఈ శరీరము
కాదు అని గ్రహించు.
ఈ శరీరానికి ఆకర్షణ వికర్షణ గుణాలు ఉన్నాయి. కాని,
నీలో ఉన్న శక్తి ఆత్మశక్తి. ఈ
ఆత్మశక్తి పవిత్రమయిన శక్తి. ఈశక్తిని
పరమాత్మ శక్తిలోకి విలీనం చేయడానికి ప్రయత్నం చేయి.
01.01.2005
32. ప్రేమను పొందటం, ప్రేమను పదిమందికి పంచి పెట్టడం, ఇది
అందరికీ లభించే యోగంకాదు. ఇది
భగవంతుని అనుగ్రహంతోనే లభిస్తుంది. ఈ
వరము పొందడానికి జన్మనన్మలు ఎత్తినా ఆశ్చర్యపడనవసరం లేదు.
22. ఈ విశ్వంలోని గ్రహాలను చేరుకోవాలనె తపన మనిషి మేధస్సుకు
పదును పెడుతోంది. ఈ
తపన సార్ధకమవాలంటే భగవంతుని
అనుగ్రహం తప్పక ఉండాలి.
14.03.2005
34. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు విజయవంతంగా సాగిపోవాలంటే నీవు నీ గతాన్ని
మరచిపోవాలి. గతంలో
చేసిన తప్పులు చేయకూడదు. అపుడు
నీవు నీ గమ్యాన్ని నీ
గురువు ఆశీర్వచనాలతో క్షేమంగా చేరగలవు.
03.04.2005
35. నువ్వు (ఆత్మ) శరీరము కాదు. నీవు
శరీరములోని ఆత్మవి. నీ
శరీరమునుండి ఆత్మను విడదీయగల శక్తి ఒక్క మృత్యుదేవతకే
ఉందని గ్రహించు. ఆమె
నీదగ్గరకు వచ్చినపుడు భగవన్నామ స్మరణ చేస్తూ ఆమె
వెంట సంతోషముగా వెళ్ళిపో.
09.07.2005
36. నీలోని మంచితనాన్ని పది మందికి పంచు. సదా
భగవంతుని అనుగ్రహం సంపాదించుకోవటానికి నీలోని అత్మ శక్తిని పెంచు.
15.07.2005
37. గురువు ఆశయాలను ఆచరణలో పెట్టడము, గురుపూర్ణిమనాడు మన గురువుకు మనం
ఇవ్వగల నిజమయిన గురుదక్షిణ.
19.08.2005
38. పరధర్మము ఎంతగొప్పదయినా నీవు నీ స్వధర్మాన్నే
పాటించు. నీగురువు
పాదాలను నమ్ముకో. ఇతర
గురువుల జోలికిపోవద్దు.
39. నీ పూజామందిరంలో దేవీదేవతల
విగ్రహాలను పూజచేయటం మంచిదే. కాని,
ఆ పూజామందిరం మాత్రము పురాతనవస్తు ప్రదర్శనశాలగా ఉండరాదు. నీ
పూజా మందిరము నీ మనస్సుకు ప్రశాంతత కల్గించాలి.
01.01.2006
40. ఆకలితో ఉన్నవాడికి ముందర అన్నం పెట్టు. వాని
ఆకలి తీర్చిన తరువాత భగన్నామస్మరణ చేయించు.
(బాబా వారు ఇచ్చిన
మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment