15.03.2016 మంగళవారం
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావాఅరి శుభాశీస్సులు
శ్రీసాయి పుష్పగిరి
- ఆధ్యాత్మికం – 6వ.భాగం
ఈ రోజు సాయి
బానిసగారికి బాబావారు ఆధ్యాత్మికతపై ఇచ్చిన మరికొన్ని సందేశాలు చదవండి.
06.07.2007
51. మనిషి చనిపోయినపుడు ఊరేగిస్తూ
ఆశవాన్ని శ్మశానానికి తీసుకువెడుతున్న సమయంలో శవం మీద చల్లే
చిల్లర నాణాల కోసం ఏరుకునే
ప్రజల గోల,
శ్మశానంలో చితి కాలుతున్నపుడు చావుకట్నం
యిమ్మని కోరే కాటికాపరి గోల,
ఇంటికివచ్చిన తరువాత పదవ రోజున భోజనాలు
చేస్తున్న బంధువుల గోల,
12వ.రోజున రక్తసంబంధీకుల
ఆస్తి పంపకాల గోల
ఇటువంటి
స్థితిలో ఆ చనిపోయిన వ్యక్తియొక్క
ఆత్మకు శాంతి ఎక్కడ అని
ఆలోచించసాగాను.
19.07.2007
52. స్వధర్మాన్ని పాటిస్తూ నీ జీవితాన్ని కొనసాగించు. పరధర్మాన్ని
ఎప్పుడూ ద్వేషించవద్దు.
29.07.2007
53. నీ లోని ప్రేమతత్వాన్ని తోటివారితో పంచుకో. అపుడు
పరమత సహనం దానంతటదే నీకు
అబ్బుతుంది.
21.08.2007
54. కోరికలు అనే నదిలో చేపలు
జీవిత కాలమంతా ఆ నదీ ప్రవాహానికి
ఈదవలసిందే. అదే
కోరికలు లేని చెఱువులోని చేపలు
ప్రశాంతంగా జీవిస్తూ తమ జీవిత కాలమంతా
భగన్నామస్మరణలో గడుపుతూ ఆఖరికి తమ గమ్యస్థానాన్ని చేరుకుంటాయి.
55. బంగారు నగల తయారీలోని నాణ్యత
ఆ దుకాణం యజమానికి మంచి పేరును తెచ్చి పెడుతుంది. అలాగే మంచి శిష్యుల
నడవడిక వారి గురువు యొక్క గొప్పతనాన్ని
చాటి చెబుతుంది.
10.09.2007
56. సద్గురువు వెళ్ళవద్దు, వెళ్ళవద్దు, చేయవద్దు చేయవద్దు అని ఆదేశించిన తరువాత
కూడా వారి మాటలు వినకపోవటం
మన బాధలకు మూలమని గ్రహించాను.
--- సాయిబానిస
57. సద్గురు సాయి దయాళుడు. ఆయనే తన పిల్లలు
ఏతప్పు చేసినా, ఆ
తప్పును పిల్లలు అర్ధము చేసుకొనేలాగ చేసి తన పిల్లలను
కాపాడుకుంటారు అని గ్రహించాను.
--- సాయిబానిస.
19.10.2007
58. భగవంతుడు మన యజమాని. ఆయన ఆశీస్సులే మనకు
లభించే జీతము. ఆ
జీతాన్ని మనం తీసుకుని ఆయన
పేరిట పండగ చేసుకుందాము.
సంతోషంగా ఉందాము.
20.10.2007
59. ఈ జగత్తులో ఏదీ
శాశ్వతం కాదు. ఆఖరికి
అన్నీ బూడిద కావలసిందే.
ఈ నిజాన్ని గమనించటానికే నేను నా భక్తులకు ఊదీని
ప్రసాదిస్తాను.
01.01.2008
60. మానవుడు ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరినా
ఆఖరికి ఒకనాడు మట్టిలో కలిసిపోవలసిందే.
(మరికొన్ని సందేశాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment