14.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు చెన్నై
నుండి శ్రీమతి కృష్ణవేణిగారు పంపించిన మరొక అద్భుతమైన లీల ప్రచురిస్తున్నాను. బాబా గారు ఆమె మనసులో అనుకున్న కోర్కెను వెంటనే
తీర్చిన విధానం చాలా ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. మనకి సమయం కుదరక ఆయనకు పూజలు చేయలేకపోవచ్చు. కాని మనసులో ఆయననే తలచుకొంటూ, ఆయననే
మన సద్గురువుగా భావించి భారమంతా ఆయ్న మీదే వేస్తే స్పందించరా? ఇక బాబా వారు నెయ్యి ఎలా పంపించారో చదవండి.
బాబా
గారు పంపించిన నెయ్యి
2016 వ.సంవత్సరంలో మా పాపకి సంక్రాంతి
సెలవులు ఇవ్వడం వల్ల చెన్నైనుండి మా
పుట్టిల్లయిన ఒంగోలు వెడదామనుకున్నాను. ప్రతిరోజు
మన బ్లాగులో ప్రచురించిన బాబా లీలలను చదువుతూ
ఉంటాను. ఆ
రోజు మీరు బ్లాగులో ఏమీ
ప్రచురించకపోవడంతో పాతవి
అన్నీ చదువుతున్నాను. అలా
చదువుతున్నపుడు మీరు ప్రచురించినవాటిలో సాయిబానిస
గారి గృహస్థులకు సాయి సందేశాలను చదవడం
సంభవించింది. అందులో ఈ
విధంగా ఉంది.
“స్త్రీ తన వివాహం తరువాత
పుట్టింటివారిని మరచిపోరాదనె విషయాన్ని శ్రీసాయి సత్ చరిత్ర 12వ.అధ్యాయంలో బాబా మనకందరికీ మంచి
సందేశాన్నిచ్చారు. నిమోన్
కర్ భార్య బేలాపూర్ లో
ఉన్న తన తల్లిదండ్రులను చూడటానికి
వెళ్ళివస్తానన్నపుడు ఆమె భర్త ఒక్కరోజు
మాత్రమే ఉండి వచ్చేయమని చెప్పాడు. అపుడు
బాబా కలగచేసుకొని
ఆమెను పుట్టింటిలో నాలుగు రోజులు ఉండి బంధువులందరితోను గడిపిన
తరువాత షిరిడీకి రమ్మని చెప్పారు” ఇది చదివిన తరువాత
అదే బాబాగారు నాకిచ్చిన ఆశీర్వాదంగా భావించాను. అంతకు
ముందు మా నాన్నగారు ఒంగోలునుండి
మంచి కమ్మటి తాజా నెయ్యి తీసుకుని వచ్చారు.
అది ఎవరో
తెలిసినవాళ్ళ ద్వారా మా అమ్మగారు తెప్పించారు. అది
మా పిల్లలకు వేయమని పంపించింది. నేను
పాప సెలవులకి ఒంగోలు వెళ్ళినపుడు, మా అత్తగారు సంక్రాంతి
రోజున సగం పైగా ఆ
నెయ్యి వేసి చక్రపొంగలి చేశారు.
అది
పిల్లల కోసమని తెప్పించిన నెయ్యని తెలుసు. నాకు
చాలా బాధనిపించింది. ఎందుకంటే
అది ఇక్కడ దొరికే నెయ్యి
అయితే ఎలాగయినా కొనుక్కోవచ్చు. అది
వేరేవాళ్ళ ద్వారా తెప్పించిన మంచి తాజా నెయ్యి కాబట్టి
మళ్ళీ అడగాలంటే కాస్త ఇబ్బందనిపించింది. వెంటనే
బాబాని మనసులో అడిగాను, “ఏమిటి బాబా ఇలా
చేశారు. మీకన్నీ
తెలుసు కదా!” అని. అప్పుడే బాబా తమ విచిత్రమైన
లీలని చూపారు. మా
ఇంటి ప్రక్కనే ఉన్న ఒక ఆవిడ
గురువారం నాడు మాఇంటి ముందు
నుంచి వెడుతూ నా దగ్గరకు వచ్చి,
“మేము మా బంధువుల ఇంటికి
వెళ్ళినపుడు
నెయ్యి తెచ్చాము. దానిలో
కొంత పాపకి పెట్టు” అని నెయ్యి ఇచ్చింది. నాకే
కాదు మా ఇంటిలోని వాళ్ళందరికీ
చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆవిడ చాలా పొదుపరి. నోరు తెరిచి ఏదడిగినా లేదనేస్తుంది. అలాంటి ఆమె నాకు ఉచితంగా నెయ్యి తెచ్చి ఇచ్చిందంటే
ఆశ్చర్యం కాక మరేమిటి? బాబా వారు ఆమెతో మాకు
నెయ్యిని ఉచితంగా ఎందుకిప్పించారో తెలుసా?
ఒకసారి ఆమె కోడలు ఏదో అవసరం వచ్చి నాదగ్గిర వెయ్యి రూపాయలు తీసుకొంది. ఆ తరువాత ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మిగిలిన రెండువందల రూపాయలు ఈ రోజువరకు ఇవ్వలేదు. నేను కూడా బాగుండదని బాకీ విషయం అడగలేదు. కాని బాబావారికి అన్నీ తెలుసు కనక ఈ విధంగా నెయ్యి పంపించి నాకోరికను
తీర్చారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment