15.01.2017 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కొన్ని
అనుకోని సంఘటనలు జరగడం వల్ల గత రెండు వారాలుగా ప్రచురించలేకపోయాను. శ్రీ సాయి సురేష్ గారు తమ సోదరి అనుభవాలను పంపించారు. ఆయన రెండు వారాల క్రితమే పంపించారు. ఈ రోజు వాటిని యధాతధంగా ప్రచురిస్తున్నాను. మనందరం కూడా ఆమె అనుభవాలను పంచుకుందాము. బాబా ప్రేమని అవగాహన చేసుకొందాము.
సాయి భక్తుల అనుభవాలు
సునీత
జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 1 వ భాగం
అఖిలాండకోటి
బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజా పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి
బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా
అందరికీ సాయి శుభాశీస్సులు
ఈ
రోజు మా(సాయి సురేష్)
సిస్టర్ సునీత కి పెళ్ళైన
14 సంవత్సరాలకి బాబా అనుగ్రహం తో
బాబు పుట్టిన ఒక చక్కటి సాయి
లీలను మీ ముందు ఉంచుతున్నాను.
ఇది టైపు చేస్తూ ఉంటే
చంద్రాబాయికి బాబా బిడ్డను
అనుగ్రహించిన నాటి లీల నాకు
గుర్తుకు వస్తుంది.
ఆమెకు బాబా
రక్షణ అనుక్షణం ఎలా ఉండేదో మా సిస్టర్ కి
కూడా బాబా అలానే రక్షణ
ఇచ్చారు. అంతటి అద్భుతమైన అనుభవం
ఇది. ఇక ప్రియ సాయి
బంధువులారా మా సిస్టర్ అనుభవాలను
తన మాటలలోనే చదవి ఈ సాయి
లీలలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి.
ఓం
సాయి రామ్. సద్గురు సాయి
నాధ్ మహారాజ్ కి జై, సాయి
నాధునికి శతకోటి నమస్కారములు...
నా
పేరు సునీత. మా
వారి పేరు జయరాజు. మేము
వైజాగ్ నివాసులము. మా
వివాహం జరిగి 14 సంవత్సరములు అయింది. మా వివాహ జీవితంలో
ఎటువంటి కలహాలు గాని, కష్టములు గాని
ఎప్పుడు లేవు. ఆనందముగా ఉండేవారము.
కలహాలు, బాధలు లేకపోయినా ఏదో
లోటు ఉండేది. కారణం మాకు పిల్లలు
లేకపోవటం. ఏన్నో పూజలు చేసాము.
వైజాగ్ లో ఉన్న డాక్టర్స్
అందరిని కలిసాము. కానీ లాభం లేకపోయింది.
మా జీవితం పువ్వులు లేని చెట్టులా కనిపించేది.
యెంత ఉన్న ఆనందం లేదు
మా జీవితంలో. కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత నాకే
తెలియకుండా బాబా గారికి దగ్గర
అయ్యాను.
బాబా
కోసం ఎక్కువ ఆలోచించేదాన్ని. ఎప్పుడూ బాబా నాతోనే ఉన్నారు
అనే భావన నాలో ఎక్కువ
అయింది. అన్ని విషయాలు బాబాతో
షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. బాబాతో రోజు ఫోటోలో చూసి
మాట్లాడుకునేదాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా,
ఏమి చేస్తున్నా బాబా నాతోనే ఉన్నారు
అనే నమ్మకం నాలో
ఎక్కువ అయ్యింది.
కొన్ని
రోజుల తర్వాత మా చిన్నాన్న గారికి
ఆరోగ్యం బాగాలేదు. చిన్నాన్నని వైజాగ్ కేర్ హాస్పిటల్ లో
జాయిన్ చేసారు. అప్పుడు మా చిన్నాన్న గారి
అబ్బాయి సాయి సురేష్ (అవును
మీ అందరికి తెలిసిన సాయి సురేష్) మా
బ్రదర్ తో టైం స్పెండ్
చేసే అవకాశం కుదిరింది. మా బ్రదర్ తో
ఎప్పుడు కలిసిన బాబా గురించే మాట్లాడుకునేవాళ్ళం.
అప్పుడు ఇంకా కొన్ని నాకు
తెలియని విషయాలు బాబా గురించి తెలిసాయి.
అప్పుడు బాబా పట్ల నా
అవగాహన ఇంకా విస్తృతమైంది. బాబా
మీద విశ్వాసం ఇంకా బలపడింది.
ఎప్పటి
నుండో నేను మా వారు
షిర్డీ వెళ్ళాలని అనుకొనేవాళ్ళం కానీ వెళ్ళలేకపోయాము. నాలో
నేను బాబాని నా బిడ్డగా భావించేదాన్ని.
ఎవరైనా నాకు పిల్లలు లేరా
అని అడిగితే, బాబా యే నా
బిడ్డ అనేదాన్ని. బాబా నాకు బిడ్డను
ఇస్తారు, లేకపోయిన పరవాలేదు బాబా ఉన్నారు కదా
అని ఎప్పుడు అనేదాన్ని. బాబాతో ఎప్పుడూ “బాబా
నాకు బిడ్డని ఇవ్వండి. కానీ నేను షిర్డీ
వచ్చిన తరువాత ఇవ్వండి” అనేదాన్ని. సాయి ఫ్రెండ్స్, ఇవి
అన్ని బాబాకి నాకు మధ్య జరిగిన
సంభాషణలు. ఈ రోజు మీతో
పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా
ఉంది. కాని నన్ను మీరు
పిచ్చిదాన్ని అనుకోవద్దు.
అప్పుడు
మా జీవితంలో ఎప్పుడు లేని ఒక అనుభవం
జరిగింది. మా ఇంటిలో ఉన్న
ఫిష్ ఎక్వేరియం లో చేపలు పిల్లలు
పెట్టాయి. మేము చాలా సంతోషించాము.
అప్పుడు నాకనిపించింది. నాకు బిడ్డను ఇవ్వటానికి
బాబా షిర్డీ రమ్మంటున్నారు అని. షిర్డీ
వెళ్ళటానికి మేము రిజర్వేషన్ చేయించుకున్నాము.
మాతోపాటు మా అమ్మగారు వస్తానంటే
ఆమెకి కూడా రిజర్వేషన్ చేసాము.
నా ఆనందానికి అవధులే లేవు. మా వీధిలోని వారందరికి షిర్డీ వెళ్తున్నామని
చెప్పాను.
షిర్డీ
బయలుదేరే రోజు ఉదయం 4 గంటలకు
తయారవటానికి ముందు వాటర్ ట్యాంక్
లో నీళ్ళు లేవని మోటార్ వేసి
మర్చిపోయాము. మొత్తం మా మేడ మీద
ఉన్న రెండు ట్యాంక్ లు
నిండిపోయి వాటర్ మేడపై నుండి
క్రిందకి పైపు ద్వారా పోయింది.
అలా పైపు ద్వారా వాటర్
వెళ్ళినప్పుడు శబ్దం అతి భయంకరంగా
వచ్చింది. ఆ శబ్దం విని
భయం వేసింది. అప్పుడు బాబా ఏదో చెప్తున్నారు
అని అనిపించింది. బాబా
అంతా నీ దయ, అంతా
మంచే జరగాలని బాబా ని తలుచుకొని
రైల్వే స్టేషన్ కి బయలుదేరాము.
బాబా
దయ వలన ప్రయాణం చాలా
చక్కగా జరిగి షిర్డీ చేరుకున్నాము.
షిర్డీ లో మొదటిసారి అడుగుపెట్టి,
కాసేపట్లో బాబా దర్శనం చేసుకోబోతున్నామనే
ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాను. రూమ్ కి వెళ్లి
స్నానాలు చేసి బాబా దర్శనానికి
వెళ్ళాము. బాబాని మొదటిసారి చూడగానే నాకే తెలియకుండా నా
కళ్ళు నీటితో నిండిపోయాయి.
ఆనందంతో కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. మొదటిసారి బాబాని చూసినప్పుడు బాబా తప్ప నాకు
ఇంకేమి కనిపించలేదు. షిర్దిలో ఐదు రోజులు ఉన్నాము.
ఈ ఐదు రోజులలో కాకడ
ఆరతి, మధ్యాహ్న ఆరతి,
సంధ్య హారతి, శేజారతి అన్ని చూసాము. ఈ
ఐదు రోజులలో ఎంతో ప్రశాంతతను పొందాను.
బాబా నాకు మాటలలో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చారు. మనసంతా ఆనందం తో నిండి
పోయింది. అదే సమయంలో వైజాగ్
లో హుదుద్ తుఫాన్ వచ్చింది. వైజాగ్ అంతా నాశనం అయిపొయింది.
అప్పుడు నాకు అర్ధం అయ్యింది.
మేము బయలుదేరే రోజు ఆ భయంకర
సంకేతం బాబా ఇచ్చి. ఏదో
ప్రళయం రాభోతుందని బాబా సూచించారని.
బాబాకి
కొబ్బరికాయ సమర్పిస్తే బాబా బిడ్డని ప్రసాదించే
వృత్తాంతాలు మనం సత్ చరిత్రలో చదివాము.
అందువలన షిర్డీ లో బాబాకి కొబ్బరికాయ
ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే బాబాకి నేను కొబ్బరికాయ ఇస్తే బాబా
నాకు బిడ్డను ఇస్తారని నాకు అనిపించింది. సమాధి
మందిరంలోనికి కొబ్బరికాయను సెక్యూరిటీ గార్డ్స్ తీసుకు వెళ్ళనివ్వలేదు. బాబాకి ఏదైనా యిద్దామనుకుంటే బాబా
మననుండి దానిని ఎలాగైనా తీసుకుంటారు కదా! అని నేను
మనసులో అనుకుంటున్నాను.
మరి నా దగ్గర ఎలా
తీసుకుంటారు బాబా అనుకుంటూ బాబా
దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అప్పుడు
మా మదర్ టీ
త్రాగుదామన్నారు. టీ షాప్ కి
వెళ్లి టీ త్రాగుతున్నాము. ఆ
షాప్ పక్కన కొబ్బరికాయల షాప్
ఉంది. మేము టీ త్రాగి
అక్కడి నుండి బయలుదేరాము. అప్పుడు
చక్కని చిన్న పిల్లవాడు అక్కడికి
వచ్చి నా చేయి పట్టుకొని
నాకు కొబ్బరి బొండం కావాలి ఇవ్వు
అని అడిగాడు. నేను ఆ షాప్
అతనిని రేటు యెంత అని
అడిగాను. పెద్దది 50, చిన్నది 40 రూపాయలని చెప్పారు. అప్పుడు నేను చిన్నది ఇవ్వు
అని షాప్ అతనికి చెప్పాను.
కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
నాకు పెద్దది కావాలని మారాము చేసాడు. అప్పుడు నేను చివరకు వాడి
ఇష్ట ప్రకారం పెద్ద కొబ్బరి బొండం
కొని ఇచ్చాను. ఆ పిల్లవాడు త్రాగుతున్నాడు.
అప్పుడు మా వారు మొత్తం
మీద బాబాని ఏడిపించావు అని అన్నారు. అప్పుడు
నాకు గుర్తుకు వచ్చింది బాబా నేను ఇస్తాను
అనుకున్న కొబ్బరికాయ నువ్వు ఎలా తీసుకుంటావో అనుకున్న
విషయం. వెంటనే వెనకకు తిరిగి బాబుని చూసాను. కానీ బాబు ఎక్కడా
కనిపించలేదు. ఆ రూపంలో బాబా
నేను ఇస్తానన్న కొబ్బరికాయ స్వీకరించారని నాకు చాలా సంతోషంగా
అనిపించింది.
మా
షిర్డీ యాత్ర చాలా బాగా
జరిగింది. స్వీట్ మెమోరీస్ మనసు నిండా పెట్టుకొని
షిర్డీ నుండి వైజాగ్ వస్తున్నాము.
వైజాగ్ లో వచ్చిన హుదుద్
తుఫాన్ వలన విజయవాడ వచ్చినప్పటికీ
ట్రైన్స్ ఏమీ వైజాగ్ వెళ్ళడం
లేదు. అయినా నేను భయపడలేదు.
అన్నింటికీ బాబా ఉన్నారు. బాబా
చూసుకుంటారు అనుకున్నాను. కొద్దిసేపటికి స్టేషన్ మైక్ లో వైజాగ్
ట్రైన్ బయలుదేరుతుంది అని చెప్పారు. అలాగ వైజాగ్ వచ్చిన మొదటి ట్రైన్ మాదే. వైజాగ్
లో దిగాము. వైజాగ్
లో కరెంటు లేదు, వాటర్ లేదు.
అంతా భయకరంగా ఉంది. కాకపోతే మా
ఇంట్లో మాత్రం నేను షిర్డీ బయలుదేరిన
రోజు మోటర్ వేసి మరిచిపోవడం
వలన, రెండు ట్యాంక్ లు
నిండిపోవడం వలన మాకు ఒక
వారం రోజులపాటు వాటర్ కి ఎటువంటి ఇబ్బంది రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను బాబా
ప్రతి నిమిషం మమ్మల్ని చూస్తూ మాకు ఏ ఇబ్బంది
లేకుండా చేసారని.
3 నెలలు
పోయిన తరువాత బాబా నాకు గొప్ప
గిఫ్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే నేను
డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నేను తల్లిని కాబోతున్నానని
డాక్టర్ చెప్పారు. నిజంగా ఎంత సంతోషకరమైన విషయం
సాయి ఫ్రెండ్స్. బాబా నాకు ఇంత
గొప్ప గిఫ్ట్ యివ్వబోతున్నారా అని నా కంటి
నుండి ఆనందభాష్పాలు. నేను చెప్పలేను సాయి
ఫ్రెండ్స్ నా ఆనందానికి ఇంక
అంతేలేదు. బాబాకి నేను, మావారు శతకోటి
వందనాలు చెప్పుకున్నాము. డాక్టర్ నాకు ఆ రోజు
నేను తల్లిని కాబోతున్నానని చెపుతుంటే అతను నాకు బాబా
లాగానే అనిపించారు. నేను డాక్టర్ గారి
కాళ్ళు పట్టుకొని ఇవి నా బాబా
చరణాలు అని ఏడ్చేసాను. తరువాత
డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా
ఉండాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి,
మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు అని చెప్పారు.
కానీ
నాకు మా ఇంటి నుండి
15 కిలోమీటర్ల దూరంలో బ్యూటీ పార్లర్ ఉంది. షాప్ ని
నేను చూసుకోవాలి. స్టాఫ్ ఉన్నారు కానీ నేను కూడా
ఉండాలి. షాప్ కి వెళ్ళకపోతే
కుదిరే పరిస్థితి కాదు. నాకు నా పుట్టబోయే
బిడ్డ కూడా ముఖ్యమే. మరి
ఏమి చేద్దామని ముందు భయపడ్డాము, ఆలోచించాము.
కాని బాబా ఉన్నారు కదా
భయం ఎందుకు? అన్ని బాబానే చూసుకుంటారు
అని రోజు షాప్ కి
వెళ్ళేదాన్ని. రాత్రి 8.30 కి వచ్చేదాన్ని. పెద్దవాళ్ళందరూ
ఏన్నో తిట్టేవారు. ఇంత లేటుగా ఇంటికి
రాకూడదు, ఇలా తిరగాకూడదు, రెస్ట్
తీసుకోవాలి, ఇలా ఇంకెన్నో చెప్పేవారు.
కానీ నేను ఎప్పుడు దేనికి
ఆలోచించలేదు, భయపడలేదు, బాబా నాతో ఉన్నారు.
నాకు ఏమి కాదు అనే
ఒక గట్టి నమ్మకంతో 9 నెలలు
పూర్తి చేశాను. వారంలో ఒక్క రోజు ఇంటి
దగ్గర ఉండేదాన్ని. మిగత రోజులు షాప్
కి వెళ్లి వస్తు ఉండేదాన్ని. సాధారణంగా ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో
అందరూ, ఇంట్లో చిన్న పిల్లల ఫోటో లు కనపడేలా
పెట్టుకుంటారు. నేను మాత్రం బాబా
ఫొటోలే ఇంటి నిండా ఎటుచూసినా
కనపడేలా పెట్టుకున్నాను.
ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు,
ఇంటి పని, షాప్ పని
అన్ని నేనే చేస్తూ 9 నెలలు
బాబా గారి దయవలన, బాబా
తోడుతో జరిగిపోయాయి. డాక్టర్ నాకు నవంబర్ 8, 2015 కి
డెలివరీ డేట్ ఇచ్చారు. నవంబర్
7 వరకు నా పనులు నేనే
చేస్తూ వచ్చాను. ఈ 9 నెలలు బాబా
నన్ను కంటి పాపలా కాపాడుతూ
వచ్చారు. నా సాయి కి
ఏమిచ్చి ఈ ఋణం తీర్చుకోగలను?
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment