16.01.2017
సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
భక్తుల అనుభవాలు
సునీత గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా – 2వ.భాగమ్
నవంబర్
8 వ తేది ఉదయం సాయి
టెంపుల్ కి వెళ్లి అక్కడి
నుండి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను.
అందరు భయపడ్డారు. ఈ పిల్ల చెపితే
వినలేదు, రెస్ట్ తీసుకోలేదు ఏమౌతుందో అని అందరికి ఒకటే
భయం. అప్పుడు బాబా చూపించారు అద్భుతం.
5kg ల బరువుతో చక్కని బాబు పుట్టాడు. అందరు
ఆశ్చర్యపోయారు. భలే పుట్టాడని అందరు
ఆనందించారు. చూసారా బాబా నాకు ఎంత
పెద్ద గిఫ్ట్ ఇచ్చారో. బాబు కి సాయి
పుష్కర్ అని పేరు పెట్టాము,
ముద్దుగా సాయి కొడుకు అని
పిలుస్తాను. బాబుకి వన్ మంత్ అయిన
తర్వాత నుండి మళ్ళి నేను
షాప్ కి వెళ్ళడం స్టార్ట్
చేశాను. రోజు బాబుని కూడా
తీసుకొని వెళ్ళేదాన్ని. చిన్న పిల్లాడిని అలా
తిప్పకూడదు గాలి, ధూళి వస్తుంది
అని అందరు అన్నారు. కానీ
బాబా ఉన్నారు. ఆయనే చూసుకుంటారని రోజు
బాబుని షాప్ కి తీసుకొని
వెళ్ళేదాన్ని. నా
బాబుకి ఇప్పుడు 13 నెలలు వచ్చాయి. నమ్మండి
సాయి ఫ్రెండ్స్ ఒక్క రోజు కూడా
దిష్టి తీయడం లాంటివి ఏమి
చేయలేదు. ఇప్పటివరకు నా సాయి కొడుకుకి
చిన్న జలుబు గాని, విరోచనాలు
గాని, ఇంక ఎటువంటి సమస్య
గాని రాలేదు. రోజూ బాబా విభూతి
పెడతాను అంతే. బాబా నా
బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండా
కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అనుక్షణం బాబా తోడు ఉంటె
భయం ఎందుకు? నా బాబా నా
కొడుకు రూపంలో నాతోనే ఉన్నారు. నా కొడుకు చిరునవ్వులో
బాబా కనిపిస్తారు. ఇంత అందమైన కొడుకు,
ఎప్పుడూ నవ్వుతూ ఉన్న కొడుకుని చూస్తూ
ఉంటె నాకు అనుక్షణం బాబానే గుర్తుకు వస్తారు.
సాయి
సురేష్: ఇప్పుడు
నేను మా సిస్టర్ షిర్డీ
నుండి వచ్చిన నుండి తన
ప్రగ్నేన్సి కన్ఫర్మ్ అని తెలిసిన మధ్య మూడు
నెలలలో జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను.
మా నాన్నగారు హాస్పిటల్ లో ఉన్న సమయంలో
మా సిస్టర్ కి బాబా పట్ల
ఉన్న అమితమైన ప్రేమను చూసాను. వాళ్ళు షిర్డీ వెళ్లి వచ్చిన తర్వాత నాకు నవంబర్ లో
తనకు బాబా విగ్రహం ఇవ్వాలని
ప్రేరణ కలిగింది. బాబా ని అడిగితే
అయన కూడా సమ్మతించారు. కానీ
నేను మా సిస్టర్ ని
అడిగినప్పుడు తను ఏవో కొన్ని
కారణాల వలన సుముఖంగా లేరు.
బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ఆయనే
తను అంగీకరించేటట్లు చేస్తారు అని నేను ఊరుకున్నాను.
జనవరి నెలలో సంక్రాంతికి మా
సొంత ఊరు వెళ్లి తిరిగి
వైజాగ్ వెళ్ళేటప్పుడు మా సిస్టర్, బావగారు
మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా ఇంట్లో బాబాని
చూసి తను ఎంతగానో మురిసిపోయింది.
కాసేపు అలానే బాబాను
చూస్తూ ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ తనకి నేను
బాబా విగ్రహం ఇస్తాను అన్న ప్రస్తావన వచ్చింది.
అప్పుడు నేను తన సందేహాలకు
కొంత వివరణ ఇచ్చాను. అప్పుడు
తను సరే నేను అలోచించి
నా నిర్ణయం చెప్తానని అన్నారు. ఫెబ్రవరి నెల మొదటి వారం
లో మా సిస్టర్ తన
అంగీకారాన్ని తెలిపారు. సరే బాబా ఏ
రోజు నిర్ణయిస్తే ఆ రోజు బాబా
విగ్రహం తీసుకుందాం కొంచెం వెయిట్ చేయమని చెప్పాను. కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ
చివరికి బాబా ఏప్రిల్ 14, 2015 ఏకాదశి
రోజు విగ్రహం తీసుకోమని సూచించారు. బాబా నిర్ణయం ప్రకారం
ఏప్రిల్ 14 న విగ్రహం తీసుకొని
ఏప్రిల్ 15 న మొదటి అభిషేకం,
పూజ బాబాకు చేసుకున్నాము.
అప్పుడు మా సిస్టర్ చాలా
గుడ్ న్యూస్ చెప్పింది. ఏమిటంటే ఆ రోజు నుండి
తనకి మూడో నెల అని.
ఆ వార్త వినగానే నాకు
చాలా సంతోషమనిపించింది. పెళ్ళైన 14 సంవత్సరాలకి తను ప్రగ్నెంట్ అంటే
అమితంగా తనను నమ్ముకున్న తన
బిడ్డకి బాబా ఇచ్చిన అత్యంత
అద్భుతమైన వరం అనిపించింది. అప్పుడు
ఒక చిన్న సందేహం వచ్చి
మా సిస్టర్ ని అడిగాను. అదేమిటంటే
బాబా విగ్రహం తీసుకోవడానికి తను అంగీకరించిన తర్వాత
ప్రగ్నేన్సి కన్ఫర్మ్ అయ్యిందా అని. అప్పుడు తను
అవునని చెప్పింది. అంటే మా సిస్టర్
బాబా విగ్రహం తీసుకోవడానికి అంగీకారం తెలిపిన ఒక వారంలో బాబా
మా సిస్టర్ కి
ఈ వరాన్ని ఇచ్చారు. మా సిస్టర్ మొదటినుండి బాబానే తన బిడ్డగా భావించేది.
అందువలన బాబా తన పెద్ద
కొడుకుగా(తల్లి, తండ్రి,
గురువు, దైవం,
సర్వం తానుగా) ముందుగా
ఇంటికి వచ్చి, మా సిస్టర్ కు
ఆ తొమ్మిది నెలలు ఏ కష్టం
లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత
కూడా వాడిని కూడా ఎల్లవేళలా సంరక్షిస్తున్నారు.
ఒకటేమిటి అన్నివిధాలా మా సిస్టర్ ని,
బావగారిని, సాయి కొడుకుని ఆ
ఇంటి పెద్ద కొడుకులా అన్ని
సందర్భాలలోనూ తోడుగా ఉండి కాపాడుకుంటున్నారు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
(అయిపోయింది)
(మరలా ప్రచురణ 20 తారీకున)
2 comments:
Sai Baba was born on 28 September 1835 live in Shird he is also known as Shirdi vale Sai Baba and he is an Indian spiritual master Sai Baba is also known as Shirdi Sai Baba who was born on 1835-1918 and resided in Shirdi.
సాయి నీ లీలలు, గాధలు ఎంతెంతో మధురమయా
నీ లీలలే అత్యంత అధ్భుత గాధలయా
నీ లీలలు అందిస్తున్న సాయి భక్తులకు మా వందనాలయ్యా
మీ
కోన బాలాజీ బాాజీ రావు
సాయి ధ్యాన సత్సంగ్
కిసాన్ నగర్
నెల్లూరు - 2
Post a Comment