24.02.2017 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బందువులకు బాబావారి శుభాశీస్సులు
మహాశివరాత్రి
శుభాకాంక్షలు
ఆధ్యాత్మిక
మార్గములో ప్రయాణముపై సాయిబానిస
ఆలోచనలు – 3
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయ్
26. నీవు, నేను అనే భావనతో ప్రేమ చిగురించుతుంది. ఆ ప్రేమ భగవంతునిపై కలిగిననాడు మానవాళిపై నీప్రేమ
పెరుగుతుంది.
27. నీ మనసులో వికారాలను తొలగించు, అపుడు భగవంతుని గురించి
జ్ఞానము నీమనసులో స్థానము ఏర్పరుచుకొంటుంది.
28. భగవంతుడు తన ఉనికిని చాటుకోవడానికి ఒకే ఒక మార్గము
ఉంది. అదే మానవ అవతారము ఎత్తడము. మన సద్గురువు ఆ విధమైన భగవంతుని అవతారమే.
29. జీవిత సత్యాలను నీవు ఏ పాఠశాలలోను నేర్చుకోలేవు. అవి నీజీవిత అనుభవాలనుండి నేర్చుకోవాలి.
30. అందమైన చేతికఱ్ఱను చేతిలో పట్టుకోసము వాడగలవు. అదే చక్కటి వెదురు కఱ్ఱను నీ మనసుకు ఉల్లాసాన్ని
కలిగించే వేణువుగా మలచగలవు.
31. సముద్రమునుండి తీరానికి తాకే కెరటాలను నీవు లెక్కపెట్టగలవు. కాని, సముద్రములోని నీరును కొలమానములో చెప్పలేవు. అదే విధముగా మానవుడు తన జీవితములోని కష్ఠసుఖాలను
గుర్తు పెట్టుకోగలడు. కాని జీవనయాత్రను పూర్తిగా
గుర్తుంచుకోలేడు.
32. మానవాళిలో అందరు అంగీకరించేది ఆత్మ శాశ్వతము, శరీరము
అశాశ్వతము. మరి ఈ సత్యమును అంగీకరించిన పిదప
శరీరముపై వ్యామోహము ఎందులకు?
33. మానవుడు తన జ్ఞానాన్ని మాటల ద్వారా తెలుపలేడు. కాని తన జ్ఞానాన్ని చేతల ద్వార చూపగలడు.
34. నీభావాలను మాటల ద్వార తెలపలేని సమయములో నీకనులు
నీభావాలను తెలుపగలవు.
35. నీమనసు చికాకుల సుడిగుండములో తిరుగుతున్నపుడు ఆ
సుడిగుండమునుండి బయటపడటానికి దైవ సహాయము కోరటము ఉత్తమము.
36. నీమనసులోని భావాలే నీలో సంతోషాలు, చికాకులను ప్రేరేపించుతాయి. మరి మనసులోని భావాలను అదిమి పెట్టిననాడు సంతోషాలను,
చికాకులను సమదృష్టితో అనుభవించగలవు.
37. మనసును ఏకాగ్రత పేరిట ఒకే విషయముపై లగ్నము చేసేకన్న,
నీ జీవిత సత్యాలపై ఏకాగ్రతను సారించి ప్రశాంత జీవితము కొనసాగించటము ఉత్తమము.
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment