23.02.2017 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక
మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 2
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
Email:
tyagaraju.a@gmail.com
13. నీ మనసు స్వఛ్ఛమైనపుడు దాని లోతుని కనుగొనవలసిన
అవసరము ఎవరికి లేదు.
14. నీతోటివానిపై నీకు ఉన్న ప్రేమ వానితో సఖ్యతకు దారి
తీస్థుంది. ఆ సఖ్యతనుండే నిజమైన ఆనందము వెల్లి
విరుస్తుంది.
15. ఏమంచి పని చేయడానికి భయపడకు. ఆ పని పూర్తి చేసిన తర్వాత దేనికి భయపడకు.
16. గులాబి పుష్పము వెనుక ముళ్ళు ఉన్నట్లే నీవు చేసే
మంచిపనులు వెనుక నిన్ను వ్యతిరేకించేవారు ఉంటారు అనేది మర్చిపోవద్దు.
17. మానవుడు మరణించిన రోజున బాధపడేకన్న అతని ఆత్మ కొత్త
శరీరములో ప్రవేశించబోతున్నది అనే సంతోషముతో ఆ చనిపోయిన వ్యక్తి పార్ధివ శరీరానికి అంతిమ సంస్కారాలు చేయడం ఉత్తమము
అని గ్రహించు.
18. నిజ జీవితములో అలలు లేని సాగరమును నీవు చూడలేవు. అదే విధముగా ఒక్క క్షణముకూడా నీ మనసును ఆలోచనలు లేకుండ ఉంచలేవు.
19. తెలివైన మానవుడు, మానవులు కల్పించిన సమస్యలను సులువుగా
పరిష్కరించగలడు. అదే మానవుడు విధి వ్రాత ప్రకారము
కలిగే సమస్యలకు తలవంచి జీవించవలసి ఉంటుంది.
20. నీవు లేనిదే నీ నీడలేదు. అలాగే నీ జీవితములో కష్ఠాలు లేనిదే సుఖాలు లేవు
మరియు సుఖాలు లేనిదే కష్టాలు లేవు. కష్ఠసుఖాలు
నిన్ను నీ నీడలాగ ఎల్లపుడు వెంటాడుతూ ఉంటాయి.
21. నీవు ఇతరుల జీవితము విషయాలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించేముందు
నీజీవితము విషయము ఒక్కసారి ఆలోచించి ఆతర్వాత ఇతరులకు న్యాయము గురించి చెప్పు.
22. నీవు ఎంత ఎత్తుకు ఎదిగినావు అనేది ముఖ్యము కాదు. నీవు ఎంత దూరము సమదృష్ఠితో చూడగలుగుతున్నావు అనేది
ముఖ్యము.
23. మౌనముగా నీవు చేసే ప్రార్ధనలు మాత్రమే భగవంతునికి
స్పష్ఠముగా వినబడుతుంది.
24. ఒకసారి నీవు విశాలహృదయముతో నీతోటివానిని చూడగలిగినపుడు,
నీలో సంకుచిత భావానికి తావులేదు.
25. నీజీవితములో లాభము, నష్ఠము క్షణికమైనవి. వాటి గురించి ఆలోచించకుండ లాభనష్టాలను సమదృష్ఠితో
చూడగలగినవాడే విజ్ఞుడు.
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment