22.02.2017 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజునుండి ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు ప్రచురిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలను తెలపండి.
ఆధ్యాత్మిక
మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 1
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
email: tyagaraju.a@gmail.com
1. నీ కష్టసుఖాలను భగవంతునితో పంచుకో. అదే నీ సుఖాన్ని మాత్రము నీ తోటివానితో పంచుకో.
2. నీవు ఆధ్యాత్మిక సాగరములోని ఒక కెరటానివి. సాగరతీరాన్ని తాకే ప్రతిసారి భగవంతుని పాదాలను కడుగుతున్న
అనుభూతిని పొందు.
3. నీలో దాగి ఉన్న అనంతమైన ప్రేమను నీ తోటివానితో పంచుకోలేనపుడు,
ఆప్రేమకు అర్ధము లేదు.
4. ప్రేమ ఒక పవిత్రమైన నదివంటిది. ఆ నది సాగరములో కలిసేముందు ఎందరి దాహమునో తీర్చాలి.
5. ముందుగా నిన్ను నీవు నీ అధీనములో ఉండే స్థితిని
అలవరచుకో. అపుడు నీ జీవితములో నీకు ఎదురుపడే
కష్ఠసుఖాలు ఏమీ చేయలేవు.
6. నీ జీవితములో కోరికలు అనే వృక్షము అతిగా పెరిగిపోతుంటే
ఆ వృక్షము కొమ్మలను నరకటము అవివేకము. నీవు
నీహృదయములో దాగిఉన్న ఆ వృక్షము వేర్లను నరకడము అలవాటు చేసుకో. (సమయానుకూలముగా వేరులను నరుకుతూ వృక్షము మహావృక్షముగా
మారకుండా చూసుకో)
7. నీ జీవితములో అపజయాలను చూసిన తర్వాత ఇంక విజయాలను
సాధించలేను అని తలచటము అవివేకము. విజయాన్ని
సాధించలేకపోయినా ఫరవాలేదు. కాని అపజయాలకు తలవంచవద్దు.
8. నీకు తెలిసిన విషయాలనుండి సత్యమును గుర్తించటము
సులువు. కాని నీకు తెలియని విషయాలలో తలదూర్చి
సత్యశోధన చేయటము అవివేకము.
9. నీవు కొండరాళ్ళ మధ్య ఒక రాయి అయినా ఫరవాలేదు. ఏనాటికైన ఒక శిల్పి వచ్చి ఆ రాయిని ఒక సుందర శిల్పంగా
మలచుతాడు అనే ఆశతో జీవించు.
10. అడవిలోని వెదురు చెట్లు తమ రూపాన్ని కోల్పోయి అనేక
విధాలుగా మానవాళికి ఉపయోగపడుతున్నాయి. కాని,
కొన్ని వెదురు కొమ్మలు మాత్రము వేణువుగా మారి మంచి సంగీత విద్వాంసుని పెదాలను ముద్దు
పెట్టుకొని సంగీత సామ్రాజ్యములో తమ స్థానాన్ని నిలబెట్టుకొనుచున్నవి.
11. సంసార సాగరములో
వచ్చే కష్టసుఖాలు అనే కెరటాల మధ్య భగవంతుని భక్తుడు ప్రశాంతముగా ఈతకొడతాడు. అదే నాస్తికుడు కెరటాల తాకిడికి ఆ సంసార సాగరములో
మునిగిపోతాడు.
12. నీలోని ఆత్మ మరియు నీతోటివానిలోని ఆత్మ ఒక్కటె అని
నీవు భావించినపుడు నీతోటివాడు మానసికముగా బాధపడుతుంటే అదే బాధను నీవు అర్ధము చేసుకోగలగాలి
కదా!
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment