21.02.2017 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భగవంతుని
గురించి సాయిబానిస ఆలోచనలు – 7వ.భాగమ్
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు , ఆల్ ఖైల్ గేట్, దుబాయ్
88. భగవంతునిపై ప్రేమతో ఆధ్యాత్మిక రంగములో నీవు తొలి అడుగులు వేస్తున్న సమయములో ఒక అదృశ్య
హస్తము నిన్ను నీచేయి పట్టుకొని నడిపించుతుంది.
ఆహస్తము నీ సద్గురువు హస్తము అని గుర్తుంచుకో.
89. ఒకసారి నీవు నీ సద్గురువుయొక్క ప్రేమను పొందిన తర్వాత
ఆయన ఆశీర్వచనాలతో నీవు భగవంతుని ప్రేమసామ్రాజ్యములో స్వేచ్చగా తిరగవచ్చును.
90.
ఆధ్యాత్మిక సాగరములో అనేక పడవలు ప్రయాణము చేస్తూ
ఉంటాయి. వాటిలో నీపడవకూడా ఒకటి. ఆధ్యాత్మిక సాగరము లోతు నీకు తెలియదు, కాని నీ జీవిత
అంత్యదశలో ప్రశాంతముగా ఆధ్యాత్మిక సాగరములో కలసిపో. భగవంతుని పాదాల చెంతకు చేరుకో.
91. నీవు నీచేతులతో దానము చేయి. అపుడు నేను నా చేతులతో నీకు ఇచ్చే సంపదను స్వీకరించే
హక్కును పొందగలగుతావు.
92. భగవంతుడు నక్షత్ర మండలములో నివసించుతున్నాడని నీవు
భావంచవచ్చును, దానికి నేను అంగీకరించుతాను.
కాని ఆ నక్షత్రమండలము నీ హృదయములోనే ఉన్నది అని గుర్తుంచుకో.
93. నీకు భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే తపన ఉన్ననాడు
భగవంతుడు కూడా నీగురించి ఆలోచించుతూ ఉంటాడు.
నీకోరిక నెరవేరడానికి సద్గురువు సహాయం కోరుకో, నీకోరిక తప్పక నెరవేరుతుంది.
94. భగవంతునిపై
నీకు ఉన్న ప్రేమే నిన్ను ఆయన దగ్గరకు చేర్చుతుంది.
95. భగవంతుని చూడాలి అనే తపనతో నీవు నడక ప్రారంభించినపుడు
అనేక చికాకులు ఎదురు అవుతాయి. ఆ చికాకులకు
తలవంచిన నీవు ఎన్నటికి ఆయనను చూడలేవు. నీ ప్రయాణములో
నీవు ప్రాణాలు విడిచిన ఫరవాలేదు, మరుజన్మలో భగవంతుని చూడగలవు.
96. నేను భగవంతుని పాదాల దగ్గర పడియున్న బానిసను. ఆ భగవంతుడె
నన్ను లేవనెత్తి, నన్ను తన ఎంచుకున్న మార్గములో నన్ను నడిపించుతాడు.
97.
ఇతరుల చేతిలో ఏమి ఉంది అని ఆలోచించకు. భగవంతుడు
నీకు నీచేతిలో ఉంచినదానిని జాగ్రత్తగా కాపాడుకో.
98. భగవంతుడు నీకు ముక్తిని ప్రసాదించేముందు నీకు భుక్తిని
ప్రసాదించుతాడు. నీలోని కోరికలు తీరిన తర్వాత,
ఆయన ఇచ్చేది నీవు స్వీకరించి ముక్తిని పొందు.
99. నీవు ఈప్రపంచములో ఎన్నటికి ఒంటరివాడివి కావు. భగవంతుడు ఎల్లప్పుడు నీ నీడ రూపములో నీతోనే ఉంటాడు.
(సమాప్తం)
(రేపటినుండి
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment