20.02.2017 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు
– 6వ.భాగమ్
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
email : tyagaraju.a@gmail.com
76. నీ జీవితములో నిజమైన ప్రేమను నీవు పొందలేకపోతే ఆ
జీవితానికి అర్ధము లేదు.
77. నీవు భగవంతునిని సర్వస్యశరణాగతిని వేడినపుడు నీకు
ఆయన ప్రేమ సామ్రాజ్యములోనికి అడుగుపెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు.
78. భగవంతుని తెలుసుకోవాలి అంటే నిన్ను నీవు మర్చిపోయి
ఆధ్యాత్మిక ప్రపంచములో నీ సద్గురువు చేయి పట్టుకొని నడవాలి.
79. ఈ ప్రపంచములో నిన్ను ఎవరు ప్రేమించటములేదు అని బాధపడేకన్నా
ముందుగా నీవు భగవంతుడిని ప్రేమించినావా అని ఆలోచించు.
80. ఈ ప్రపంచములో నీవు సంపాదించినది అశాశ్వతం. అదే భగవంతుడు ఇచ్చినది శాశ్వతము.
81. నీవు సంపాదించినది ఇనపపెట్టెలో దాచుకో, కాని భగవంతుడు ఇచ్చినది నీహృదయములో దాచుకో.
82. నీవు నివసించుతున్నది భగవంతుడు నీకు ఇచ్చిన శరీరము. తిరిగి ఈ శరీరాన్ని ఆయనకు ఒకనాడు అప్పగించవలసినదే
అని గ్రహించు.
83. భగవంతుని తెలుసుకొన్నవాడు భగవంతుని అంశముగానే జీవించుతున్నాడు. ఆఖరిలో భగవంతునిలో ఐక్యమగుతున్నాడు.
84. భగవంతుడిని ప్రేమించినవాడే భగవంతుడిని తెలుసుకోగలగుతున్నాడు.
85. నీవు పీల్చే ప్రతి శ్వాస, నీశరీరములోని ప్రతి కదలిక
భగవంతుని ఇఛ్ఛానుసారమే జరుగుతున్నాయి అని గ్రహించు.
86. నీదృష్ఠిలో భగవంతుని పూజించటానికి ఉత్తమ సమయము సూర్యోదయము. కాని ఆయన నీపూజలను స్వీకరించడానికి ఎల్లవేళల ఆతృతగా
ఎదురు చూస్తూ ఉంటాడు.
87. భగవంతునినుండి నీకు ఏమికావాలో వాటిని కోరుకో. కాని, ఆయన నీకు ఏదో ఒక సమయములో తనకు ఇష్ఠమైనది ఇస్తాడు. దానిని మాత్రము తిరస్కరించకు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment