18.02.2017 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భగవంతుని
గురించి సాయిబానిస ఆలోచనలు – 5వ.భాగమ్
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
e mail id : tyagaraju.a@gmail.com
61. నీహృదయములో ప్రేమ అనే వృక్షాన్ని పెంచు. ఆ వృక్షము నీడలో నీమనసును ప్రశాంతముగా ఉండనీయి.
62. నీవు భగవంతుని విధేయ సేవకుడివి. అందుచేత ఆయన గురించే జీవించు.
63. నీవు భగవంతుని పాదాల దగ్గర సేవకుడిలాగ జీవించు. అటువంటి జీవనములోని ఆనందాన్ని చవిచూడు.
64. ఈ సృష్ఠిని సృష్టించినవాడు భగవంతుడు. ఆ భగవంతునికి ఈ సృష్ఠిలోని ప్రతి కదలిక తెలుసు.
65. నీలో ఆధ్యాత్మిక వృక్షము ఎదుగుతున్నపుడు నీవు ఈ
ప్రాపంచిక రంగములో ఒదిగి ఉండటము నేర్చుకో.
66.
నీవు భగవంతుని నమ్మిననాడు ఆయన నీ నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయడు.
67. భగవంతుడు నీశారీరక అందాన్ని ఎప్పుడూ చూడడు. ఆయన నీఆత్మ సౌందర్యాన్ని చూస్తాడు.
68. నాకు సమస్య ఎదురైనపుడు నాసమస్యను నా సద్గురువుకు
మనసులో విన్నవించుకొంటాను. నాసద్గురువు నాకు
ఏదో ఒక రూపములో సమాధానము ఇస్తారు. ఇది నాజీవిత
అనుభవాలలో ఒకటి. (సాయిబానిస గారి అనుభవమ్)
69. మంచితనం అనే కొవ్వత్తిని వెలిగించు. ఆవెలుగులో నీతోటివాని చేతిలో ఉన్న కొవ్వత్తిని నీవు
వెలిగించటానికి అతనికి సహాయము చేయి.
70. సద్గురువు అడుగుజాడలలో నీవు నడువు. అపుడు నీవాళ్ళు నీఅడుగుజాడలలో నడుస్తారు.
71. సద్గురువు ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమను నీవు పొందదలచిన ఆయనవైపు నీవు నీమొదటి
అడుగును వేయి. అపుడు ఆయన నీవైపు పది అడుగులు
వేస్తాడు.
72. నీనేత్రాలతో ఏమిచూసినా అది అశాశ్వతము అని భావన కలుగుతుంది. అదే నీ మనోనేత్రముతో ఏదైన చూడు, అక్కడ శాశ్వతమైనది అనిపించుతుంది.
73. నీకు ఇష్ఠము లేనివాటిని బాహ్య ప్రపంచములో వదలివేయి. నీకు ప్రీతిపాత్రమైనవాటిని భగవంతునికి అర్పించి
ఆయన ప్రేమను సంపాదించు.
74. భగవంతునిపై ధ్యానము చేయి. ఆయన మాట్లాడే భాషను అర్ధము చేసుకొని వాటిని నిజజీవితములో
ఆచరించు.
75. నిజమైన ప్రేమకు అర్ధము తెలుసుకోవాలి అనే కోరిక ఉంటే
నిన్ను ప్రేమించేవారిలో భగవంతుడిని చూడు.
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment