17.02.2017 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భగవంతుని
గురించి సాయిబానిస ఆలోచనలు – 4 వ.భాగమ్
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు , ఆల్ ఖైల్ గేట్
, దుబాయి నుండి
46. భగవంతుని అవతారమే సద్గురువు. ఆయన పాదాలపై నీశిరస్సు ఉంచి సర్వస్యశరణాగతిని పొందు.
47. భగవంతుని దృష్టిలో ఒకేఒక మతము. అది మానవాళిలో ఉన్న మానవత్వము.
48. భగవంతుని భాష తెలుసుకోవాలి అని ఉంటే నీమనోద్వారము
తెరచి ఆయనకు స్వాగతము పలుకు. అప్పుడు ఆయన నీలో
ప్రవేశించి నీతో మాట్లాడుతాడు.
49. పరమాత్ముని తోటలో నీ ఆత్మ ఒక పూలమొక్క. ఆ మొక్కకు ఇప్పటినుండీ ప్రేమ అనే నీరు పోసి పెంచు.
50. నీప్రార్ధనలలో భగవంతుని దయను కోరుకో. ఆయన దయతో నీవు సాధించలేనిది ఏమీ లేదు.
51. భగవంతుని కరుణ సర్వమానవాళిపైన ఉండాలని కోరుకో. అపుడు నీపై కూడా ఆయనకు కరుణ కలుగుతుంది.
52. భగవంతుడు అందరిలోను ఉన్నాడు అని నీవు నమ్మిననాడు
నీ ఇంటిలోని అద్దము ముందు నిలబడి భగవంతుని దర్శించుకో.
53. నీవు భగవంతుని ప్రేమించు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు.
54. ప్రాపంచిక రంగములోని అందాన్ని నీరెండు కళ్ళతో చూడు. కాని ఆధ్యాత్మిక రంగములోని అందమును నీ మనోనేత్రాలతో
చూడు.
55. భగవంతుడు నీలో నివసించుతున్నాడు అని భావించిననాడు
నీ అవసరాలు అన్నీ ఆయన అవసరాలే అని కూడా భావించు.
56. సత్యమే భగవంతుడు. భగవంతుడె సుందరాకారుడు. ఆ సుందరాకారుని ప్రేమను పొందాలి అంటే ఎల్లప్పుడూ
సత్యమె మాట్లాడు.
57. నీవు సత్యాన్ని నమ్ముకొని చేసే ప్రతి పని ఆభగవంతుడు
చేస్తున్న పని అని భావించు.
58. నీవు శరీరానివి కావు. కాని ఈ శరీరపోషణకు ఆహారము అవసరము. ఆ ఆహారాన్ని నీకు ప్రసాదించుచున్న ఆ భగవంతునికి
కృతజ్ఞతలు చెప్పడము మర్చిపోవద్దు.
59. నీ జీవనయాత్రలో భగవంతుని నామస్మరణ కూడా ఒక భాగమే
అని గ్రహించి జీవించు.
60. నీ మెదడుకు ప్రశాంతత కావాలి అన్నపుడు నీవు నీహృదయ
స్పందనలో భగవంతుని నామస్మరణ జోడించు.
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment