12.03.2017 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
తెలుగు అనువాదం :
ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్,
దుబాయి
శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగునుండి గ్రహింపబడినది.
సాయి భక్తులు –
శ్రీ భారం ఉమా మహేశ్వర రావు &
శ్రీమతి భారం మణి –
3 వ.భాగమ్
పదవీ
విరమణ చేసి గడుపుతున్న రోజులలోనే ఆయన సాయితత్వ ప్రచార బాధ్యతలను చేపట్టారు. 1985 లో బాబా ఆయనకు కలలో కనిపించి ఒక మాసపత్రికను
ప్రారంభించి తత్వప్రచారం చేయమని ఆదేశించారు. అదేరోజు రాత్రి మరొక భక్తుడయిన శ్రీయూసఫ్ ఆలీ ఖాన్
కు కూడా కలలో దర్శనమిచ్చి శ్రీ బి.యు.రావుగారికి పత్రిక ప్రారంభించడానికి కావలసిన
సహాయం చేయమని ఆదేశించారు. అంతేకాదు, ప్రారంభింపబోయే
మాసపత్రికకు ‘సాయిప్రభ’ అని పేరుపెట్టమని కూడా సూచించారు.
పత్రిక
ప్రారంభించడానికి కావలసిన ఆర్ధికవనరుల విషయాన్ని బాబాకే వదిలేసి, పత్రిక ప్రారంభించడానికి
ఇద్దరూ ఉద్యుక్తులయ్యారు. 1985 విజయదశమి రోజున
‘సాయిప్రభ’ ప్రత్యేకసంచిక వెలువడింది. ఆతరువాత శ్రీ వి. నారాయణరావుగారు కూడా సహాయం
చేసారు. ఆవిధంగా బాబా ఆదేశాలప్రకారం ఆయన మార్గదర్శకత్వంలో
బి.యు.రావుగారు మాసపత్రికను విజయవంతంగా ప్రచురించసాగారు.
1985
లో ఆయన షిరిడీ వెళ్ళినపుడు బాబా అంకిత భక్తుడయిన మహల్సాపతి కుమారుడయిన శ్రీమార్తాండ్
మహరాజ్ ను, మనుమడయిన శ్రీ అశోక మహల్సాపతిలను కలుసుకున్నారు.
1985
లో విజయవాడలో 49 రోజులపాటు బాబా నామసప్తాహం జరిగినపుడు అందులో రావుగారు కూడా పాల్గొన్నారు. ఆసమయంలో ఒక రోజు బాబా ఆయనకు కలలో కన్పించి ధ్యానంలో
కూర్చోమని ఆదేశించారు. సప్తాహం చివరి రోజున
ఆయన ధ్యానంలో కూర్చొన్నారు. ధ్యానంలో ఆయనకు
శ్రీదత్తాత్రేయ, జీసస్ క్రైస్ట్, శ్రీరామకృష్ణ పరమహంసల దర్శన భాగ్యం కలిగింది.
1986
వ.సంవత్సరంలో ఒక రోజున ఆయన మూత్రవిసర్జనకై వేకువజామునే లేచారు. అపుడాయన హైదరాబాదులో తన ఇంటిలోనే ఉన్నారు. లేచి డ్రాయింగ్ రూములోకి వచ్చారు. అక్కడ సోఫాలో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి
కనిపించాడు. గాభరాగా “ఎవరది” అని గట్టిగా అరుస్తు
సోఫావద్దకు వచ్చారు. అప్పుడాయనకు తళుక్కుమని
మెరుపులాగ బాబా రూపం స్పష్టంగా కనిపించింది.
ఆవెంటనే బాబా అదృశ్యమయ్యారు.
1987
వ.సంవత్సరంలో ఆయనకు ద్వారకామాయిలో బాబానుంచి మొట్టమొదటి సందేశం వచ్చింది. బాబాపై ఆయనకున్న నమ్మకం ఎన్నోరెట్లు పెరిగింది. బాబా అనుగ్రహం వల్ల ఆయనకు అత్యధ్భుతమయిన అనుభవాలు,
దివ్యదర్శనాలు కలగడం ప్రారంభమయ్యాయి.
ఆయనకు
జీవతంలో ఎన్నో అనుభవాలు కలిగాయి. ఆయనకు కలిగిన
ఆ దివ్యానుభవాలను దగ్గరుండి వీక్షించిన ఆయన దగ్గరి బంధువులందరూ ఎంతో అదృష్టవంతులు. ఆయనకు కలిగిన అనుభూతులన్నిటినీ వివరించి చెప్పడం
సాధ్యంకాదు.
బాబా
మనపై ప్రతిక్షణం అన్ని విషయాలలోను తమ అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారనడానికి, మనకు మార్గదర్శకులుగా
ఉన్నారని చెప్పడానికి రావుగారికి కలిగిన అనుభవాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.
ఆయనకు
రాబోయే ఆపదలను బాబా ముందుగానే తెలియచేస్తూ ఉండేవారు. 1987 వ.సంవత్సరం జనవరి 4వ.తారీకున తెల్లవారుఝామున
ఆయనకు బాబా కలలో దర్శనమిచ్చి, జనవరి 4 (అదే రోజు) ఉదయం 10.30 తరువాతనుంచి ఆయనకు ఆరోజు మంచిది కాదని చెప్పారు. బి.యు.రావుగారు తన కుటుంబసభ్యులతో,
తనను ఆస్పత్రిలో చేర్పించవద్దని ముందుగానే చెప్పారు. బాబా సూచించిన సమయానికి సరిగ్గా ఆయనకు సుస్తీ చేసి
తెలివితప్పింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. చాలా సీరియస్ అయింది. ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆయనను దగ్గరలోనే ఉన్న హైదరాబాద్ లోని మహావీర్ ఆస్పత్రికి
తీసుకుని వెళ్ళారు. అక్కడి డాక్టర్స్ ఆయనను
పరీక్షించి ఆయనకు సెరిబ్రల్ హెమరేజ్ వల్ల పూర్తిగా పక్షవాతం వచ్చిందని, బ్రతికే అవకాశమే
లేదని తేల్చి చెప్పారు. ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి
తీసుకెళ్ళిపొమ్మని చెప్పారు. ఆయనని మధ్యాహ్నం
1.30 కు సికిందరాబాదులోని గాంధీ ఆస్పత్రిలొ చేర్పించారు. అక్కడి డాక్టర్స్ కూడా ఆయనకి సెరిబ్రల్ హెమరేజ్
అని నిర్ధారించి వెంటనే ఆయనను ఐ.సి.యు. లోకి
తీసుకునివెళ్ళారు. ఆయనకు వైద్యం జరుగుతుండగా ఆయన భార్య, ఆయన తలవద్ద
బాబా దీవిస్తున్నట్లుగా ఉన్నఫొటో, ఆయన చొక్కా జేబులో ద్వారకామాయి ఫోటో ఉంచారు.
నుదిటిమీద బాబా ఊదీ రాసారు. అక్కడ డాక్టర్స్ లో ఒకాయన బహుశ నాస్తికుడయి ఉండచ్చు,
ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఇదంతా గమనించి, ఆయన
పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, బాబాయే కాదు ఎవ్వరూ కూడా ఆయనని బ్రతికించలేరని చెప్పాడు. కొంతసేపటి తరువాత ఆయన శరీరంలో కాస్త కదలిక వచ్చింది. కాని ఆయన శరీరభాగం కుడివయిపు మొత్తం పక్షవాతం వల్ల
కదలిక లేకుండా ఉంది. కొంతసేపటి తరువాత బాబా
అనుగ్రహం వల్ల ఆయన శరీరంలో కుడివైపున కూడా కదలిక వచ్చింది.
రాత్రివేళ ఆయనకు తెలివి వచ్చింది. తనని ఆస్పత్రిలో చేర్పించినందుకు అందరినీ కేకలేసారు. ఆరాత్రే తను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పారు. అంత అర్ధరాత్రివేళ వెళ్ళడం మంచిది కాదని ఆయనకు నచ్చ
చెప్పారు. రచయిత (శ్రీబొండాడ జనార్ధనరావు)
ఆసమయంలో మైసూరులో ఉన్నారు. శ్రీరావుగారికి
సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిన విషయం ఆయనకు మైసూరులో ఉండగా తెలిసింది. విషయం తెలిసినవెంటనే ఆయన హైద్రాబాద్ చేరుకున్నారు. వెన్వెంటనే ఆయన రావుగారిని చూడటానికి ఆస్పత్రికి
వచ్చారు. ఆయన ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి వైద్యం
ఇంకా జరుగుతుండగానే డిశ్చార్జి చేసేసినట్లు చెప్పారు డాక్టర్స్. ఒక సీనియర్ గవర్నమెంట్ డాక్టర్ అయిన శ్రీ ఎ.ప్రభాకరరావు
గారినుండి, మరొక బంధువునుండి లిఖితపూర్వకంగా కాగితం వ్రాయించుకుని వారి సమక్షంలో డిస్చార్జి
చేసామని చెప్పారు డాక్టర్స్. షిరిడీసాయిబాబా
శక్తివల్లే తనకు నయమవుతుందని, ఆ నమ్మకం తనకుందని అందువల్ల తనకి ఏఆస్పత్రిలోను వైద్యం చేయించుకోవడం ఇష్టం లేదని
అన్నారని డాక్టర్స్ చెప్పారు. ఆయన విపరీత ప్రవర్తనకి ఆయనకి సేవ చేసిన నర్సులు కూడా చాలా ఆశ్చర్యపోయారని చెప్పారు. ఆ తరువాత రావుగారు పూర్తిగా ఆరోగ్యవంతులయారు.. బాబాకు అసాధ్యమన్నది ఏదీ లేదు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment