13.03.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
తెలుగు అనువాదం :
ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్,
దుబాయి
శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగునుండి గ్రహింపబడినది.
శ్రీ
సాయి సత్ చరిత్ర 39 వ.అధ్యాయంలో బాబాకు సంస్కృత పరిజ్ఞానమ్ ఉందన్న విషయం మనం గమనించవచ్చు.
నానా చందోర్కర్ కి “తత్విధ్ధి ప్రణిపాతేన….” భగద్గీత శ్లోకానికి చక్కని వివరణ ఇచ్చి
తనకు సంస్కృత పరిజ్ఞానం కూడా కలదని నిరూపించారు.
ఇప్పుడు మీరు చదవబోయే భాగంలో బాబాకి సంస్కృతంలో సంపూర్ణమయిన పరిజ్ఞానం కలదని
నిరూపించే సంఘటనలు సజీవ సాక్ష్యాలు.
సాయి భక్తులు –
శ్రీ భారం ఉమా మహేశ్వర రావు &
శ్రీమతి భారం మణి –
4 వ.భాగమ్
1988
లో ఆయన కొంతమంది భక్తులతో కలిసి నాగపూర్ దగ్గర పరదసింగ వెళ్ళారు. అక్కడ అవధూతయిన అనసూయ మాతని దర్శించుకున్నారు. ఆవిడ వారందరినీ ఒక మాతృ మూర్తిగా ఆహ్వానించి తన ఆశ్రమానికి
తీసుకునివెళ్ళారు.
(అవధూత అనసూయ మాత)
ఆయన
ధ్యానంలో కూర్చున్నపుడెల్లా బాబా ఆయనకి సందేశాలను ఇవ్వసాగారు. 1989 జనవరి ఒకటవ తారీకున ఆయన షిరిడీలో ఉన్నారు. ఆరోజున బాబా తాను ప్రసాదించిన సందేశాలన్నిటిని సామాన్య
ప్రజల ఉపయోగార్ధం ఒక పుస్తక రూపంలో ప్రచురించమని ఆదేశించారు. అప్పటికే బాబా ఆయనకు సందేశాలన్నిటినీ తెలుగులోనే
ఇచ్చారు. మూడు సందేశాలను మాత్రం ఆంగ్లంలో ఇచ్చారు. బాబా ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన తనకు తెలుగులో ప్రసాదించిన
సందేశాలన్నిటిని పుస్తక ప్రచురణ కోసం ఆంగ్లంలోకి తర్జుమా చేసారు. తెలుగులో ఇవ్వబడ్డ సందేశాలను తెలుగులో ‘సాయి తత్వ
సందేశాలు” అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు.
ఎవరయినా
కష్టాలలో ఉన్నపుడు వారి క్షేమం కోసం వారి తరపున కూడా ప్రార్ధన చేయమని బాబా ఆయనని నియమించారు. బాబా బి.వి.రావుగారికి ఇచ్చిన సందేశాలన్నిటినీ ఆయన
భార్య మణిగారు ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో వ్రాస్తూ ఉండేవారు. బాబా ఆయనకు ధ్యానంలో 350 కి పైగా సందేశాలను ఇచ్చారు. మణిగారు వాటినన్నిటిని ఉన్నదున్నట్లుగా రాసారు. అవన్నీ కూడా పుస్తకరూపంలో ప్రచురింపబడ్డాయి. ఈ సందేశాలన్ని ప్రతిఒక్కరి ఉపయోగార్ధం “సాయి తత్వ
సందేశ్’ అనే పేరుతో ఆంగ్ల పుస్తకంలో కూడా ప్రచురింపబడ్డాయి. ఇవన్నీ బాబా మనకందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపే
అమూల్యమయిన సందేశాలు.
ఆయన
ధ్యానంలో కూర్చున్నపుడు బాబా ఆయనకు సంస్కృతంలో కూడా సందేశాలను ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబా ఆయనకు సంస్కృత శ్లోకాలను కూడా
ప్రసాదిస్తూ ఉండేవారు. రావుగారికి సంస్కృతం
రాదు. ఒకసారి బాబా ఆయన నోటివెంట ఒక సంస్కృత
శ్లోకాన్ని పలికించారు. ఆయన భార్య ఆ సంస్కృత
శ్లోకాన్ని యధాతధంగా రాసారు. ఆయనకు కొంతమంది
బాబా భక్తులు స్నేహితులు. వారిలో కొంతమంది
సంస్కృత పండితులు కూడా ఉన్నారు. బాబా ఆయన నోటివెంట
పలికించిన సంస్కృత శ్లోకాలన్నిటికి అర్ధాలు హైదరాబాదులో ఉన్న సంస్కృత పండితులందరినీ
సంప్రదించి తెలుసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఒక
సంస్కృత శ్లోకానికి అర్ధం హైదరాబాదులోని ఏఒక్క సంస్కృత పండితుడూ చెప్పలేకపోయాడు. ఎంతో మందిని అడిగినా ఎవ్వరూ దాని అర్ధం విడమరచి
చెప్పలేకపోయారు. రావుగారు, ఆ శ్లోకానికి అర్ధం,
వ్యాఖ్యానం తెలియకపోవడం వల్ల తాను రాస్తున్న భాగాన్ని అక్కడితో ఆపేశారు. రచన ఇంక ముందుకు సాగలేదు. అపుడు బాబా ఆయనకి ఒక సందేశం ఇచ్చారు.
“బెంగళూరులోని మైసూరు రోడ్డులో ఉన్న శ్రీరాజ రాజేశ్వరి
దేవాలయ ఆశ్రమంలో ఉన్న స్వామీజీని కలుసుకో. ఆయన నీకు ఆ శ్లోకానికి అర్ధం చెబుతారు”
అపుడాయన బెంగళూరుకు బయలుదేరి వెళ్ళారు. ఆయన బెంగళూరు వెళ్ళినపుడు రచయిత (శ్రీ బొండాడ జనార్ధనరావుగారు)
బెంగళూరులోనే ఉన్నారు. ఆయన రావుగారిని పూజ్యశ్రీ
రత్నపురి స్వామీజీగారి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు. స్వామీజీ రావుగారు ఇచ్చిన సస్కృత శ్లోకాన్ని చదివి
ఎంతగానో సంతోషించారు. ఆయన తన శిష్యులనందరినీ
సమావేశపరిచి దాని అర్ధం, ఆ శ్లోకం ఏ వేదంలో ఏభాగంలో
ఉన్నదో విశదంగా తెలియచేసారు.
అది
చాలా ముఖ్యమయిన శ్లోకం. దురదృష్టవశాత్త్లు
రచయిత ఆ శ్లోకం, దాని అర్ధం మర్చిపోయారు.
ఇది 1990 వ.సంవత్సరంలో జరిగింది.
1990
జనవరి 25వ.తారీకున బాబా ఆయనకు ఒక సందేశం ఇచ్చారు.
రాబోయే ఆదివారం ఫిబ్రవరి, 4, 1990 నీజీవిత చరమాంకం. దానికి తయారుగా ఉండు అని ఆయనకు ధ్యానంలో సందేశమిచ్చారు. ఆయన జాతకం ప్రకారం కూడా అది వాస్తవం. బాబా ఆయనను తన నామస్మరణ చేయమని, బిల్వపత్రాల రసం
త్రాగమని సలహా ఇచ్చారు. బాబా ఇచ్చిన ఈ సందేశం దగ్గరి బంధువులందరికీ ఒక్కసారిగా తీవ్రమయిన ఆఘాతం కలిగించింది. రాబోయే ఉపద్రవం గురించి బంధువులందరికీ తెలియపరిచారు. మరలా జనవరి 28వ.తారీకున మరొక సందేశం ఇచ్చారు రావుగారికి. బంధువులందరినీ స్నేహితులను ప్రత్యేకంగా ఒకరోజు చెప్పి
ఆరోజున వారినందరినీ రమ్మని వారందరినీ కూడా భక్తిశ్రధ్ధలతో వారి చేత నామజపం చేయించమని
చెప్పారు. ఫిబ్రవరి 3వ.తారీకు మధ్యాహ్నం బాబా
ఆయనకు మరొక సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో
7000 సంస్కృత శ్లోకాలు ఉన్నటువంటి శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన “గురు
సంహిత” పారాయణ 3వ.తేదీ రాత్రికి ఏర్పాటు చేయమన్నారు. మరుసటిరోజు (ఫిబ్రవరి 4) దత్తహోమం చేయించమని చెప్పారు.
‘గురు సంహిత’ ఒక్కటే గ్రంధం ఉండటం వల్ల ఆయన సన్నిహితులందరూ ఆ ఏడువేల శ్లోకాలను అధ్యాయాల
వారీగా కాపీలు తీయించారు. 3వ.తేదీ రాత్రికల్లా
7000 శ్లోకాలు పారాయణ పూర్తిచేయించడానికి సంస్కృత పండితులందరినీ ఏర్పాటు చేశారు. అందరికీ అధ్యాయాలవారీగా కాపీలు ఇచ్చారు. అదృష్టవశాత్తు శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక ఆచార్య
శ్రీబోధానంద స్వామిగారు కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి, రావుగారి ఇంటికి వచ్చారు. ఆయన మరుసటిరోజు ఉదయం వరకూ అక్కడే ఉన్నారు. 3వ.తేదీ రాత్రి మొత్తం 7000 శ్లోకాల పారాయణ పూర్తయింది. 4వ.తేదీ ఉదయం అందరూ గ్రూపులవారీగా నామజపం మొదలు
పెట్టారు.
నామజపం
జరుగుతుండగా హోమం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఒక భక్తునికి లలితాసహస్రనామ పారాయణ కూడా
పదకొండు సార్లు చేయాలనే సంకల్పం కలిగింది. పదకొండు సార్లు పారాయణ చేసారు.
ఎలాగయితేనేమి ఎటువంటి ప్రయత్నం చేయకుండానే 400 మందికి
పైగా భక్తులు వచ్చారు. బాబా అంకిత భక్తుడయిన
డా.రాఘవరావుగారు కూడా వచ్చారు. బాబా అనుగ్రహాన్ని
కోరుతూ అందరూ బాబాని ప్రార్ధించసాగారు. మధ్యాహ్నం
రెండు గంటలకి రావుగారి బి.పి.పడిపోయింది. నాడి
కొట్టుకోవడం ఆగిపోయింది. మానవ ప్రయత్నంగా ఆయనని
బ్రతికించుకోవాలనే ఆశతో ఆయన కుమారుడు ఆక్సిజన్ సిలెండర్ తెచ్చి ఆక్సిజన్ పెట్టడానికి
ప్రయత్నించాడు. కాని సిలెండర్ మూత పగిలిపోయి
ఆక్సిజన్ పెడదామనుకున్నా లాభం లేకపోయింది.
కొంతసేపటి తరువాత బి.వి.రావుగారు మెల్లగా ఏదో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన నోటివెంట “బాబా, బాబా” అనే మాటలు వెలువడ్డాయి. అక్కడికి వచ్చిన భక్తులలో ఉన్న డాక్టర్స్ ఆయన నాడి
పరీక్షించి నాడి చక్కగా కొట్టుకుంటోందని చెప్పారు. ఆవిధంగా బాబా తన అద్భుతమయిన లీలను ప్రదర్శించి రావుగారిని
ఆపదనుంచి కాపాడి ఆయన జీవితాన్ని నిలబెట్టారు. ఇదంతా
జరుగుతున్నంత సేపు రచయిత కూడా అక్కడే ఉన్నారు.
దీనికంతా ప్రత్యక్ష సాక్షి ఆయన. ఆవిధంగా
రావుగారికి జీవితకాలం ఒక సంవత్సరం పొడిగింపబడింది. ఇదే విధంగ బాబా ఆయన జీవితకాలాన్ని ఒక్కొక్క సంవత్సరం
చొప్పున పదిసార్లు పెంచుతూ వెళ్ళారు. ప్రతిసారి
బాబా ఆయనను ముందుగానే హెచ్చరిస్తూ సందేశం ఇచ్చేవారు. బాబా చెప్పిన ప్రకారం బి.వి.రావుగారు, బంధువులు,
భక్తులు నామ జపం, పారాయణ నిర్వహిస్తూ వచ్చారు.
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment