Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, March 14, 2017

సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 5 వ.భాగమ్

Posted by tyagaraju on 7:48 AM
     Image result for images of shirdi sai baba smiling face
       Image result for images of rose hd
14.03.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులు
శ్రీ భారం ఉమా మహేశ్వర రావు
శ్రీమతి భారం మణి –   5 .భాగమ్
          Image result for images of bharam umamaheswararao

తెలుగు అనువాదంఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్దుబాయి
 శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగునుండి గ్రహింపబడినది.
బాబా తన అనుగ్రహాన్ని, దయను బి.యు.రావుగారిపై కురిపించి ఆయన జీవిత కాలాన్ని 1990 నుండి 11 సార్లు ప్రతి సంవత్సరం పొడిగిస్తూ వచ్చారని చెప్పడానికి ఈ సంఘటనే సాక్ష్యం.  ప్రతిసారి బాబా ఆయన జీవితకాలాన్ని ఒక్కొక్క సంవత్సరం పొడిగిస్తూ వచ్చారు.  రావుగారికి గండం ఉందన్న రోజున విషయం తెలిసిన వెంటనే భక్తులందరూ,  రావుగారు ఆయన బంధువులు పిలవకుండానే తమంత తాముగా ఆయన ఇంటికి వచ్చేవారు.


  ప్రముఖ సాయి భక్తుడయిన డా.కె.వి.రాఘవేంద్రరావు గారు కూడా బి.వి.రావుగారి ఇంటికి వస్తూ ఉండేవారు.  ఆ సమయంలో జరిగే సంఘటనలన్నీ గమనించేవారు.  బాబా సూచించిన ప్రకారమే నామజపాలు, పారాయణలు  అన్నీ యధాప్రకారం జరుగుతూ ఉడేవి.  అవన్నీ ఆవిధంగా జరుగుతు ఉండటం వల్లనే రావుగారి జీవితకాలం ప్రతిసంవత్సరం పొడిగింపబడుతూ వస్తొందని చెప్పడానికి ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి.  తను జీవించడానికి కారణభూతులు బాబాయేననే ధృఢ విశ్వాసంతో తన మిగిలిన 11 సంవత్సరాల జీవిత కాలమంతా బాబాసేవలోనే గడిపి తరించారు.

బాబాతో ఆయన సహవాసం చాలా సన్నిహితంగాను, దాదాపుగా క్రమం తప్పకుండా జరుగుతూ ఉండేది.  వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్య సంబంధం ఎంత బలీయంగా ఉందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య  ఉన్న అనుబంధంలా  ఉండేది.  బాబా అనుగ్రహం వల్ల ఆయనకు 1987 లో దైవాలందరి దర్శనం లభించింది. అంతే కాదు సిధ్ధపురుషులయినటువంటి ఆదిశంకరాచార్య, నృసింహసరస్వతిస్వామి, శ్రీరాధాకృష్ణస్వామీజీ, శ్రిపాద వల్లభస్వామి, ఇంకా మరికొందరి దర్శనాలు లభించాయి.  అయనకు స్వప్నంలో కొంతమంది దేవీ, దేవతలు దర్శనమిచ్చారు.  ఆయనకు స్వప్నంలో ప్రత్యంగిరదేవి కూడా దర్శనమిచ్చింది. 
       
             Image result for images of sri maha pratyangira devi
                  (శ్రీ మహా ప్రత్యంగిర దేవి)
ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు.  ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన సామాన్యుడిలాగానే జీవించారు.  సాయి తత్వాన్ని ప్రచారంలోకి తీసుకునిరావడంలో ఎంతగానో శ్రమించారు.  సాయి తత్వ ప్రాచారకునిగా ప్రసిధ్ధి చెందారు.

1991 వ.సంవత్సరం మే 6 వ. తేదీ సాయంత్రం ఆయన తీవ్రమయిన ధ్యానంలో ఉన్నారు.  ఆధ్యానంలో ఆయనకి వింతయిన, అసాధారణమయిన దృశ్యాలు, సంఘటనలు గోచరించాయి.  ఆ దృశ్యంలో ఒక పవిత్ర స్త్రీ మూర్తి ఒక యోగివలె తెల్లని దుస్తులు ధరించి దర్శనమిచ్చింది. ఆమె తన కురులను తలపై ముడివేసుకుని ఉంది.  మెడలోను, చేతులకి రుద్రాక్షమాలలు ధరించి ఉంది.  ఆమె రావుగారిని కొండలలోనుంచి, అరణ్యాలు తదితర ప్రదేశాల గుండా తీసుకుని వెడుతూ ఉంది.  దారిలో ఆయనకు దివ్య పురుషులు, రాక్షసులు కనిపించారు.  ఆయన వారి గురించి ఆ స్త్రీమూర్తిని ప్రశ్నించారు.  అది నీకనవసరమయిన విషయం అని చెప్పింది ఆమె.  ఆయన ఆమెతో కలిసి వెడుతున్నపుడు దారిలో సమస్త దేవుళ్ళు, దేవీ దేవతలు కన్పించారు.  ఆయన వారందరికీ తన ప్రణామాలు అర్పించబోతే ఆమె వద్దని వారించింది.  వారిద్దరూ నడిచే దారి నడవడానికి చాలా కఠినంగా ఉంది. నడవటానికి ఏమాత్రం అనువుగా లేదు. హటాత్తుగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురవడం మొదలయింది.  వాతావరణం చాలా భయంకరంగా ఉంది.  ఆవాతావరణానికి రావుగారిలో ఎటువంటి భయం లేకపోవడం గమనించింది ఆ స్త్రీమూర్తి.  ఆఖరికి ఆమె ఆయనను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది.  ఆప్రదేశమంతా వజ్రంనుండి వెలువడే దివ్యమయిన తెల్లని కాంతిలా తళతళా మెరిసిపోతూ ఉంది. ఆ కాంతి మిరుమిట్లు గొలుపుతూ కళ్ళు పోతాయేమోనన్నంత ప్రకాశవంతమయిన వెలుగు.  ఆ వెలుగుకి తన కళ్ళు దెబ్బ తింటాయేమేనని వెంటనే  కళ్ళు మూసుకున్నారు రావుగారు.  ఆతరువాత కళ్ళు తెరచి చూడగానే, లోపల పెద్ద సింహాసనం దానిపైన లలితా త్రిపుర సుందరీదేవి కనిపించింది.  ఆమెనుంచి దేదీప్యమానంగా ప్రకాశవంతమయిన కిరణాలు ఎన్నో వెలువడుతూ ఉన్నాయి.  ఆ దేవి విలువయిన ఆభరణాలెన్నిటినో ధరించి ఉంది.  హస్తాలలో ఆయుధాలను ధరించింది.
                           Image result for images of manidweepam

  అప్పుడు ఆ దేవికి సాష్టాంగనమస్కారం చేసుకోవడానికి అనుజ్ఞ ఇచ్చింది ఆ పవిత్రస్త్రీమూర్తి.  ఆవిధంగా ఆయనకు ‘మణిద్వీప’ దర్శనం లభించింది.  ఆదేవి అనుగ్రహం లభించింది.  బాబా అనుగ్రహం వల్లనే తనకటువంటి దివ్యదర్శనం లభించిందని ఆయన ఎంతగానో పొంగిపోయారు.

1992 వ.సంవత్సరంలో ఆయన బాబాపై తీవ్రమయిన ధ్యానం చేస్తున్నారు.  ఆధ్యానంలో బాబా తనకు దర్శనమివ్వాలనే సంకల్పంతో ఉన్నారు. ధ్యాన సమయంలో తనముందు బాబా భిక్షాటన చేస్తున్నటువంటి ఫొటో పెట్టుకున్నారు. 
               Image result for images of shirdi sai baba with bhiksha patra

అపుడు బాబా ఆయనతో “నువ్వు ఒక అజ్ఞానివి.  నాదర్శనం నీకు లభిస్తే నానుంచి వెలువడే దివ్యకాంతిని చూసి నువ్వు తట్టుకోలేవు.  ఆకాంతి వల్ల నీకళ్ళు కూడా పోతాయి” అన్నారు.  కాని ఆయన బాబా చెప్పిన హెచ్చరికని లక్ష్యపెట్టక రోజంతా ధ్యానంలోనే గడిపారు.  మొదటి 5 రోజులు కేవలం ద్రవాహారమే తీసుకుని ధ్యానం కొనసాగిస్తూ వచ్చారు.  6వ.రోజునుండి ద్రవాహారాన్ని కూడా తీసుకోవడం మానేసి 12 రోజులదాకా ధ్యానంలోనే కూర్చున్నారు.  12 వ.రోజున బాబా ఆయనకు దర్శనమిచ్చారు. తన సహజమైన దేదీప్యమానమయిన దేహంతో కాక,  రావుగారి నేత్రాలకు హాని కలుగని రీతిలో బాబా దర్శనమిచ్చారు.  రావుగారు తన ముందర పెట్టుకున్న ఫొటోలో ఉన్నట్లుగా దర్శనం లభింపచేసారు.  ఆవిధంగా తనకు బాబా దర్శన భాగ్యం లభించినందుకు ఆయన ఎంతగానో సంతోషించారు. 

(రేపటి సంచికలో : శ్రీ భారం ఉమామహేశ్వరరావుగారు గత జన్మలో ఎవరు? ఎదురు చూడండి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

బాబా వారు తన సహజ రూపంతో మనకు దర్శనమిస్తే ఆయన శరీరంనుండి వెలువడే కాంతి కిరణాలను చూసి మనం తట్టుకోలేము అని ఘంటా పధంగా చెప్పడానికి తార్ఖడ్ గారి ఈ అనుభవాన్ని చదవండి. బాబాగారి శరీరంనుండి దివ్యకాంతులు వెదజల్లడం ప్రత్యక్షంగా చూసిన భాగ్యశాలి తార్ఖడ్ గారు. తార్ఖడ్  గారి ఈ అనుభవాన్ని మన బ్లాగులో 17.08.2011 వ.ససంవత్సరంలో ప్రచురించాను.  సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబమువారి అనుభవాలు పుస్తకంగా కూడా బాబాగారు ప్రచురింపచేసుకున్నారు. తార్ఖడ్ గారి ఆ అనుబవమ్ మరలా మీకోసం...


17.08.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు




సాయితో మరికొన్ని అనుభవాలలో --

బాబా గారి కఫ్నీని ఉతుకుట

నా ప్రయత్నంలో యిప్పుడు యింకా ముందుకు సాగుతూ, నేను బలంగా భావించేదేమిటంటే మా నాన్నగారు తన డైరీని రాసి ఉండవలసిందని. యిది, ఆయన బాబాతో సాంగత్యం దాని ఫలితంగా మిక్కుటంగా పెరిగిన అనుభూతులు దాని వల్ల లార్డ్ సాయి మీద ఆయనకు పెరుగుతూ ఉండే ప్రేమను గురించి కాలక్రమానుసారంగా వాటిని ఒక పథ్థతిలో తెలియచెప్పి ఉండేది. ఆయన లార్డ్ సాయిని మొట్టమొదటి సారి కలుసుకున్నపుడు తాను ఒక మహాశక్తిని కసులుసున్నానని గాని అది తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందనే మంచి భావం ఆయనకి వచ్చి ఉండకపోవచ్చును.  నేననుకునేదేమినటే ఆ కాలంలో శ్రీ నరసిం హ సరస్వతి అనే ఒక స్వామి, బాబా లీలలను గురించి వివరంగా తెలియ చేసే డైరీని రాశారు. యిపుడివన్నీ కూడా తరువాతి ఆలోచనలు. నేను కూడా నాకు కలిగిన కొన్ని సంఘటనలు తేదీల వారీగా వాటిని రాసి పెట్టుకోలేదు. మా నాన్నగారి అనేకమైన మహాద్భుతమైన అనుభవాలతో పోల్చుకుంటే నా అనుభవాలు చాలా కొద్ది మాత్రమేనని చెప్పనవసరం లేదు.

బాబా మీద మా నాన్నగారి భక్తి ఆరోహణక్రమంలో ఉన్నప్పటికీ, బాబాకి తన  భక్తునితో బంథాన్ని బలపరచుకోవడానికి ప్రత్యేకమైన నేర్పు ఉండేది. మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు అక్కడి స్థానికుల ద్వారా బాబా వారి స్నానం కూడా ఒక ప్రత్యేకమైన పథ్థతిలో ఉండేదని తెలుసుకున్నారు.
ఆయన తన శరీరాన్ని మనందరిలాగా బాహ్యంగా తోముకుని శుభ్రం చేసుకోవడమే కాదు, తన లోపలి భాగాలని కూడా తోముకుని శుభ్రం చేసుకునేవారు. ఆయన తమ ప్రేవులను బయటకు తీసి, శుభ్రం చేసుకుని తిరిగి శరీరంలో పెట్టుకునేవారు. రాముడు, కృష్ణుడు మాత్రమే అటువంటి అష్ట సిథ్థులతో జన్మించారని మా నాన్నగారు చెపుతూ ఉండేవారు. ఆ కారణం చేతనే వారు మానవ రూపంతో ఉన్న దేవుళ్ళని పిలవబడ్డారు. ఆయన అభిప్రాయం ప్రకారం బాబా పుట్టుకను గురించిన వివరాలు తెలియవు. కాని ఆయన లీలలు అన్ని విషయాలలోనూ సరిసమానంగా మహా శక్తితో పోటీపడుతూ, సరిపోలుతూ ఉంటాయి.

ఆయన షిరిడీకి వెళ్ళినపుడు ఒకసారి, బాబా ఆయనతో తనతో కూడా తాను స్నానం చేసే ప్రదేశానికి రమ్మని అక్కడ ఒక ప్రత్యేకమయిన పని ఇస్తాననీ చెప్పారు. మా నాన్నగారు అటువంటి పనికి యెప్పుడూ ఇష్టమే. తనకు మరొక దివ్యానుభూతి కలగవచ్చని ముందే ఊహించారు. బాబా "భావూ ! ఈ పని చాలా సులువు. నేను స్నానం చేస్తాను. స్నానం చేస్తూండగా నువ్వు నా కఫ్నీని ఉతికి పెట్టు. ఉతికిన తరువాత, దానిని నీ రెండు చేతులతో యెత్తి యెండలో ఆరే దాకా పట్టుకుని వుండు. నేను చాలా సేపు స్నానం చేస్తానని నీకు తెలుసు. అంచేత నేను స్నానం పూర్తి చేసేటప్పటికి అది ఆరిపోతుంది. దానిని నేనుమరలా వేసుకుంటాను. గుర్తుంచుకో అది ఆరేటప్పుడు అది నేలను తాకకూడదు" అన్నారు.


మా నాన్నగారు వెంటనె ఒప్పుకుని ఆపని చేయడానికి తయారయారు.

వారిద్దరూ లెండీ బాగ్ కి వెళ్ళారు. అక్కడ రేకులతో కట్టబడిన గది ఉంది. ఒక పెద్ద నలుచదరంగా ఉన్న రాయి బాబా స్నానికుపయోగించేది ఉంది. మా నాన్నగారు స్నానాల గది బయట బాబా గారు, ఉతకడానికి కఫ్నీ యిస్తారని యెదురు చూస్తున్నారు.

బాబా గారు పిలిచి కఫ్నీ యింకా యివ్వకపోయేసరికి మా నాన్నగారు కొంచెం అసహనంతో ఉన్నారు. బాబా చేస్తున్న చమత్కారాలలో అది ఒకటి అనుకున్నారు. తలుపుకి ఉన్న చిన్న ఖాళీ గుండా గది లోపలికి చూద్దామని నిర్ణయించుకున్నారు. నమ్మశక్యం కాని విథంగా బాబా శరీరం ప్రతి అణువునుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తూ ఉండటం చూశారు.

అటువంటి శక్తివంతమైన కాంతిని ఆయన భరించలేకపోయారు. కళ్ళు పోతాయేమోనని భయం వేసింది. తన తప్పుడు పని కూడా బయట పడుతుందేమోనని కూడా అనుకున్నారు. అదే క్షణంలో బాబా తన కఫ్నీని తీసుకుని ఉతకమని చెప్పి పిలవడం వినపడింది. మా నాన్నగారు కఫ్నీ తీసుకుని దగ్గరనున్న బావి వద్దకెళ్ళి సబ్బుతో బాగా శుభ్రంగా ఉతికారు. నీరు బాగా పిండి, దాన్ని తన రెండు చేతులతో యెత్తి యెండలో యెత్తి పట్టుకున్నారు. బాగా తేలికగా ఉండటంతో మొదట బాగానే భరించారు, కాని సమయం గడిచే కొద్దీ యెండకు యెండి తేలికవడానికి బదులు బరువుగా అవడం మొదలెట్టింది. తాను ఆపరీక్షలో తప్పుతానని మా నాన్నగారికి అర్థమయింది. కారణం తొందరలోనే కఫ్నీ నేలని తాకుతుంది.  ఈ కఠినతరమైన కార్యంలో కృతకృత్యుడవటానికి తగిన బలాన్నిమ్మనమని ఆయన హనుమంతుడిని ప్రార్థించి ఆయన సహాయం తీసుకుందామని నిర్ణయించుకున్నారు. ఆయన హనుమంతుడిని ప్రార్థిస్తుండగా బాబా లోపలినించి అరుస్తూ "హే భావూ ! హనుమాన్ ని సహాయం కోసం యెందుకు పిలుస్తున్నావు?" అన్నారు. సంశయం లేకుండా బాబా 'అంతర్ద్యాని' (మనసులోని ఆలోచనకు గ్రహించే శక్తి కలిగి ఉండటం) మనసులోని ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా చదవగలగడం. బాబా దిగంబర శరీరాన్ని చూడటానికి ప్రయత్నించి తప్పు చేశానని అందుకు మన్నించమని మా నాన్నగారు బాబాని కోరారు. బాబా ఆయన తప్పుని మన్నించగానే, మా నాన్నగారు కఫ్నీ తేలికగా అయిపోవడం గమనించారు. మా నాన్నగారు బాబాకు కృతజ్ఞతలు చెప్పి, అటువంటి సాహసకార్యాలు చేయనని ఒట్టు పెట్టుకున్నారు. బాబా నుంచి యెవరూ యేదీ దాచలేరని అర్థమయిందాయనకి. 
అందుచేత బాబా వారి బోథనలు అంత గొప్పవి. మీ అనుమతితో నేను స్వతంత్రంగా ఈ మాట చెప్పనా, "బాబా ప్రత్యక్షంగా స్వయంగా చేసిన బోథనలతో దీవెనలు అందుకున్నవారు అదృష్టవంతులు"

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List