15.03.2017
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
భక్తులు –
శ్రీ
భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి –
6. వ.భాగమ్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
తాను
తీవ్రమయిన ధ్యానంలో ఉన్నపుడు తన శరీరమంతా వెచ్చగా ఉంటుందనే విషయాన్ని చెప్పారు రావుగారు.
ఆయన
ఎన్నో సత్సంగాలని నామజపాలని నిర్వహించారు.
అటువంటి సందర్భాలలో ఆధ్యాత్మికోపన్యాసాలు కూడా ఇస్తూ ఉండేవారు.
నూతనంగా సాయిబాబా మందిరాలను నిర్మించినపుడు వాటి
ప్రారంభోత్సవాలకు రావుగారిని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఆవిధంగా ఆయన వివిధ ప్రదేశాలలో ఎన్నో సాయిబాబా మందిరాలను
ప్రారంభించారు. ఈ క్రింద ఇచ్చిన చిత్రం ఆయన
ఇస్తున్న ఆధ్యాత్మికోపన్యాసం.
ఒకసారి
బాబా ఆయనకు కలలో కనిపించి ఆయన గత జన్మలో నానా సాహెబ్ చందోర్కర్ అని తెలియచేసారు. ఒకసారి 30 సంవత్సరాల వయసుగల ఒక స్త్రీ బి.యు.రావుగారిని
కలుసుకోవడానికి వచ్చింది. ఆసమయంలో ఆయన అనారోగ్యంగా
ఉన్నారు. ఆమె తనకు రేకీ వైద్యంలో ప్రావీణ్యం
ఉన్నదని, బి.యు.రావుగారికి రేకీ వైద్యం చేయటానికి
వచ్చానని చెప్పింది. అప్పుడు రావుగారు ఒక గదిలో విశ్రాంతిగా పడుకుని ఉన్నారు. ఆమె అందరి అనుమతితో ఆయన పడుకున్న గదిలోకి వెళ్ళింది. ఆమె ఆగదిలో ఉన్నవారినందరినీ బయటకు వెళ్ళిపొమ్మని
చెప్పింది. కొంతసేపటి తరువాత ఆమె గదిలోనుంచి
బయటకు వచ్చి రేకీ వైద్యం పూర్తయిందని చెప్పింది.
అపుడు మేమంతా ఆయన గదిలోకి వెళ్ళాము.
బి.యు.రావుగారు ఒక ముఖ్యమయిన విషయం చెప్పారు. ఆవచ్చిన స్త్రీ గత జన్మలో తన కుమార్తె అయిన మైనతాయి
అని, తాను నానా సాహెబ్ చందోర్కర్ ని అని చెప్పిందన్నారు. ఆమె తన గత జన్మ గురించి, తాను (బి.వి.రావు గారు) గత జన్మలో ఎవరో కూడా చెప్పిందని అక్కడున్నవారందరికి
చెప్పారు. ఆమెకు తన గత జన్మ, బి.యు.రావుగారి
గత జన్మ తెలుసు. ఈ సంఘటన గుంటూరులో జరిగింది. ఆవచ్చిన స్త్రీ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సీనియర్ ప్రభుత్వోద్యోగి
భార్య. ఆమె బి.యు.రావుగారి ఇంటిని ఎలా గుర్తించగలిగింది. రావుగారు అస్వస్థతగా ఉన్నారని ఆయనకు రేకీ వైద్యం
అవసరమనే విషయం ఎలా తెలిసింది. ఈ విషయాలు ఎవ్వరికీ
తెలియవు. ఏమయినప్పటికి వారి గతజన్మ తాలూకు
వివరాలను ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
కాని నానా సాహెబ్ చందోర్కర్ 1921 వ.సంవత్సరంలో మరణించాడు. బి.వి.రావుగారు 1922 వ.సంవత్సరంలో జన్మించారు.
1995
వ.సంవత్సరంలో ఆయనకు వెన్నుపూస క్రింద రెండు డిస్కులు పట్టు తప్పాయి. వెన్నుపూస వంగిపోయింది. దాని ఫలితంగా ఆయన నిటారుగా లేచి నిలబడలేకపోయేవారు,
నడవలేకపోయారు. ఈ సమస్య ఉన్నాగాని బాబా దయవల్ల
ఆయన అటూఇటూ తిరుగుతూ ఎవరి సహాయం లేకుండ తన పనులన్నిటిని చేసుకున్నారు.
బి.యు.రావుగారితో
పరిచయం ఉన్నవారందరూ సాయిబాబా వైపు ఆకర్ఢితులయారు. అది వారి అదృష్టమనే చెప్పాలి. సాయిబాబా దయాసముద్రుడు కావడం చేతనే వారందరినీ తన వైపుకు
ఆకర్షించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, దగ్గరి
బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు, సామాన్య ప్రజానీకం అందరూ ఎంతో అదృష్టవంతులు. రావుగారు వారందరి జీవితాలలోని బరువు బాధ్యతలలో కొంతభాగం
తానుకూడా భాగం పంచుకుని వారి క్షేమం కోసం వారి తరఫున బాబాని ప్రార్ధించేవారు. నామజపం కూడా చేస్తూ ఉండేవారు. ఆవిధంగా ఆయన బాబా గురించి, ఆయన బోధనలు ప్రచారం చేయడంలో
అధ్భుతమయిన సేవ చేసారు. ఆయన 78 సంవత్సారాల
వయసులో 2000 సంవత్సరం మే, 23 వ. తారీకున బాబాలో ఐక్యమయ్యారు.
ఆయన
భార్య శ్రీమతి మణిగారు కూడా తన భర్త లాగే బాబా భక్తిపరులారు. ఆవిడకు బాబాపై ధృఢమయిన నమ్మకం. తన భర్తకు ఎంతగానో సహాయసహకారాలు అందించారు. 1981 వ.సంవత్సరంనుండి ఆవిడ తన భర్తతో సమానంగా బాబాసేవలో
పాలుపంచుకున్నారు. బాబా తత్వ ప్రచారంలో ఆవిడ
తన భర్తకు చేదోడువాదోడుగా నిలిచారు.
దేశవ్యాప్తంగా
సాయిభక్తులందరి అనుభవాలను ఆవిడ స్వంతంగా సేకరించారు.
ఈ అనుభవాలన్ని సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత జరిగినవి. ఆ అనుభవాలన్నిటినీ ఏర్చికూర్చి 1987 వ.సంవత్సరంలో
‘సాయి లీలా తరంగిణి’ పేరుతో 350 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మొదటి భాగం. రెండవ భాగం ‘శ్రీసాయిలీలా స్రవంతి’ అనే పేరుతో ప్రచురించారు. బాబా అనుగ్రహంతో ఆవిడ తెలుగులో బాబా గురించి ‘శ్రీసాయి
లలితా గీతా విభావరి” అనే పుస్తకాన్ని రచించి ప్రచురించారు.
శ్రీమతి
మణిగారు కూడా ఆధ్యాత్మికోపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. ఆవిడ తన ఉపన్యాసంలో బాబాయొక్క అద్వితీయమయిన బోధనా
పధ్ధతి, బాబా తత్వాన్ని అర్ధం చేసుకోవలసిన అవసరం, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఏవిధంగా సాధించాలి
మొదలైనవాటి గురించి భక్తులందరికీ వివరించి చెబుతూ ఉండేవారు.
ఆవిడది చాలా ఉదార స్వభావం. అందరితోను ఎంతో నమ్రతతోను, మర్యాదగాను మాట్లాడేది. ఆవిడ తన భర్తకి ఎనలేని సహాయం చేసారు. రావుగారు సాయిబాబాపై పుస్తకాలను రచించే సమయంలోను,
వాటన్నిటినీ సంకలనం చేసే సమయంలోను నిరంతరం సహాయం చేసారు. బాబా దయవల్ల ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి
తన భర్తకు సహాయం చేయడమే కాకుండా ఆవిడ కూడా ఆ లక్ష్యాన్ని సాధించారు. మే 2006, 14, వ.తారీకున ఆమె సంతోషంగా తన జీవితాన్ని
చాలించారు.
శ్రీ
బి.వి.రావుగారు, మణిగారు ఇద్దరూ ఎంతో భాగ్యశాలురు. ఇద్దరూ బాబా సేవలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. వారు తాము చేసే ప్రతి కార్యక్రమాలలోను బాబా సహాయాన్ని
పొందగలిగారు. చివరికి బాబా అనుగ్రహ బలంతో ఆధ్యాత్మికంగా
పురోగతిని సాధించారు.
రచయిత
శ్రీబొండాడ జనార్ధనరావు గారు బి.యు.రావుగారికి బంధువు. ఆకారణంగానే ఆయనకు శ్రీరావుగారు, శ్రీమతి మణిగారు
వివరించిన అనుభవాలు బాబా చూపించిన లీలలు అన్నీ దగ్గరుండి ప్రత్యక్షంగా చూసే అవకాశం పుష్కలంగా లభించింది. కొంతమంది సాయి భక్తుల కోరికపై శ్రీబి.వి.రావుగారు.
శ్రీమతి మణిగారల గురించి వ్యాసాన్ని ఏర్చి కూర్చి మనకందించారు.
శ్రీసాయిబాబా
వారి ప్రేరణ కారణంగానే , సాయిబాబా గురించి విశ్వవ్యాపంగా లభించిన సమాచారాన్ని కూడా
సేకరించారు. వాస్తవాలని, సంఘటనలను కూడా పరిగణలోకి
తీసుకుని మనకందరికి అందించారు.
(అయిపోయింది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
పాఠకులందరికీ రేకీ గురించిన సమాచారం టూకీగ ....
రేకీ : విశ్వం లోని ప్రాణ శక్తి. ఈ విథానం జపాన్ దేశీయుడైన డా. ఉసూయీ గారి ద్వారా ప్రచారంలోకి వచ్చింది. రేకీ మాస్టర్ గారి ద్వారా ఉపదేశం తీసుకోవాలి. మనలో షట్చక్రాలు ఉంటాయి. బ్రహ్మ రంధ్రంద్వారా ఈ శక్తిని మనలోకి ప్రవేశ పెడతారు. మనలో ఉన్న చక్రాలన్ని జాగృతమౌతాయి. మనలోకి కొంచెం వేడి ప్రవేశిస్తుంది. రేకీలో 3 డిగ్రీలు ఉంటాయి. మొదటి డిగ్రీలొ మన మనమీద చేతులను ఉంచి హీలింగ్ ఇచ్చుకోవచ్చు. యితరులకు కూడా ఇవ్వవచ్చు. 2వ. డిగ్రీలో డిస్టంట్ హీలింగ్ చేయవచ్చు. అంటే మనిషి యెంతదూరంలో ఉన్నాకూడా రేకీ హీలింగ్ ఇవ్వవచ్చు. 3 వ.డిగ్రీ మాస్టర్ డిగ్రీ అనగా ఆ డిగ్రీ ఉంటే మనం యింకొకరికి రేకీ ఉపదేశాన్నివ్వవచ్చు.
మీకు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ లో రేకీ గురించి సేర్చ్ చేయండి.
www.reiki.org
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment